Sunday, September 14, 2008

తల- బట్టతల-మగవాడు కాన్సెప్ట్ తెలుసా ?
ముఖ్య గమనిక :: ఈ టపా చదవకుంటే 432 వెంట్రుకలు,చదివి కామెంటకపోతే
676 వెంట్రుకలు ఊడిపోతాయి.దానికి నేను బాధ్యురాలిని కాదు(హి హి హి )..


నిన్న సాయంకాలం కాలేజ్ నుండి ఇంటికి వస్తుంటే మా బుచ్చిబావ కాల్ చేసి
మీనూ...నేను ఈ రోజు ఇంటికి వస్తాను,అని చెప్పి కాల్ కట్ చేసాడు.
హమ్మయ్య నేను చేయబోయే "కాకరకాయ కసాపిసా" అనే కొత్త రకం వంట ఎవరి మీద
ప్రయోగించాలో అనుకుంటున్నా....బావొస్తున్నాడన్నమాట అనుకున్నా...

లైట్ గా కాళ్ళు నొప్పుడితే డబ్బులకు ఆలోచించి బసెక్కా "కాళ్ళనొప్పి" భయంకరమైన "తలనొప్పిగా" మారింది.

బస్ లో నా వెనక సీట్లో ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారు.
అందులో ఒక అబ్బాయి పేరు "విజయవాడ".మరో అబ్బాయి పేరు "బెజవాడ".

విజయవాడ: రేయ్ మామా నిన్న పెళ్ళిచూపులకి వెళ్ళానన్నావ్.యావైందిరా..
బెజవాడ: 30 yrs induustry... అదే రిపీట్ అయ్యింది.
విజయవాడ: ఏం జరిగిందో సరిగా చెప్పు.
బెజవాడ: ఎముంది, నేను తన "జడ" చూస్తే తన నా "బట్టతల" చూసింది.
విజయవాడ: "Software Engg" అని చెప్పావా ?
బెజవాడ:: ఆ.. చెప్పంగానే ఎందుకో మరీ "జాలిగా" చూసి వెళ్ళిపోయింది.

...........................................................


ఇదంతా చూసి, విని నా చిట్టి హృదయం ద్రవించిపోయింది.ఇంటికి వచ్చి చూసేసరికి మా
డాక్టర్ అన్నయ్య బట్టతలతో నవ్వూతూ కనిపించాడు.
పాపం రేపు మా అన్నయ్య పరిస్థితి కూడా ఇంతేనా..ఇంకా ఈ నవ్వులు కొంతకాలమేనా ?

దేవుడా..అబ్బాయిలకు ఇన్ని కష్టాలు పెట్టావా తండ్రి.అమ్మాయిలు జుట్టు కత్తిరించుకుని 'పోని' అన్నా,
అబ్బాయిలకు కత్తిరించకుండా ఊడిపోతుంటే పోనీ లే వాళ్ళు ఏం చేస్తారు ?
అని ఎందుకు వదిలెయ్యట్లేదు తండ్రి ??

ఇప్పటికే అమ్మాయిలంతా జుట్టుపిలకలున్న అబ్బాయిలను ఇష్టపడుతుంటే
వాళ్లకి జుట్టు ఊడిపోయేట్టు చేసావా తండ్రి. అయ్యో రాత..అని అనుకుంటూ...ఉంటే ఒక చక్కని ఆలోచన స్పురించింది..

ఆడదానికి ౩౩ % reservation ఇచ్చిన మన బుల్లబ్బాయిలందరి కోసం హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసి
జుట్టుని ప్రసాదించే ఏదో ఒక "మంత్రం" సాధించి తీరాలి అని నిర్ణయించుకున్న.

వెళ్ళే ముందు మన బ్లాగుమిత్రులందరికి కాల్ చేద్దామని అనుకుని ముందుగా
కొత్తపాళీ గారికి కాల్ చేసా..

నే : హల్లో కొత్తపాళీ గారు..బాఉన్నారా..ఏం చేస్తున్నారండి?
కొత్తపాళి గారు: ఏం బాఉండడమో ఏమోనమ్మా.."పెళ్ళాం చెప్తే వినాలి"..సినిమా చూస్తున్నా..

నేను: అయ్యో అదేంటండి..అలా..
కొత్తపాళి: అదంతేనమ్మా..ఒక్కసారి పెళ్ళాయ్యాకా
మన చేతిలో ఏమి ఉండదు.గుండుపై జుట్టూ ఉండదు.నా ప్రొఫైల్ లో ఉన్న పిక్ చూస్తే నీకే తెలుస్తుందమ్మా అన్నారు.
పిక్ చూసా..అయ్యో తన లైఫ్ కి సింబాలిక్ గా ఈ ఫోటొ పెట్టుకున్నారా.. పాపం
మగవాళ్లకి ఇన్ని కష్టాలా.. ఆ దేవుని మీద అప్పటి దాకా "సాస్" లా ఉండే నా కోపం "జామ్" లా గట్టిపడింది.

అనుకుంటూ...ఇలా పెళ్ళై జుట్టు ఊడిపోయేవాల్ల కోసమైనా నేను తపస్సు చేయాల్సిందే అనుకున్నా..

తరవాత..రాజేంద్రా గారికి కాల్ చేసా..
నేను: హెలో రాజేంద్రా గారా..?
రాజేంద్రా గారు: అవునమ్మా నేనే..
నేను: ఏం చేస్తున్నారండి..
రా: "పెళ్ళాం చెప్తే వినాల్సిందే" అనే సీరీయల్ చూస్తున్నానమ్మా..
నే: అయ్యో అలాంటి సీరీయల్ ఏ చానెల్ లో రాదే?
రా: అది ఏ చానెల్ లో రాదమ్మా..మా ఇంట్లో మాత్రమే వస్తుంది అన్నారు.
నే: ఇంతకీ మీది లవ్వు మ్యారేజీయా అరేంజా..?
రా: ఏదైతేనేం రెండిట్లో పెద్ద తేడా ఏమి లేదమ్మా..
నే: అదేలా అండి..?
రా: లవ్వ్ మారేజి అంటె.."మనంత మనమే వెల్లి గుంతలో పడటం".
అరేంజ్ మ్యారేజ్ అంటె "కొంత మంది కలిసి గుంతలోకి తోయడం".
ఏదైతేనేం మొత్తానికి "గుంతలో పడటం" అన్నమాట..

నే : ఏమనుకోక పోతే మీది "బట్టతల" కదా :)
రా : :(

పెళ్లి కాకముందు జుట్తు దానంత అదే ఊడిపోతుంది.పెల్లయ్యాక ఊడగొడతారు..అంతేనమ్మ తేడ అన్నారు.
ఇంతకీ ఏంటమ్మా సంగతి అని అడిగారు..
నే: ఇది కథ అని ..నా హిమాలయ ప్రయానం గురించి.చెప్పి కాల్ కట్ చేసాను.

పాపమ్ కొంతమందికి పెళ్ళికి ముందే జుట్తు ఊడిపోతే ,కొంతమందికి అయ్యాక ఊడిపోతుందా అనుకుని
ఎలాగైనా వీల్లందరి కోసం నేను త్యాగం చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నా..

........................................................

నా ప్రయాణం గురించి తెలిసి ...నాతో పాటు "విద్య" గారు, "మురళి" గారు కూడా వస్తానన్నారు.
మీరెందుకండి నాతో..ఎంచక్కా బ్లాగులు రాసుకోండి అంటే...హు హు హు..బ్లాగడానికి ఇంకా ఏం మిగిలింది మీను..
అరే..అరే..అసలు బ్లాగు పెద్దవాళ్ళు మాకు బ్లాగడానికి ఏం వదలడం లేదు..
కవితలు,కథలు,కాకరకాయ పులుసులు,బెండకాయ పులుసులు,ప్రేమలు,పెళ్ళిళ్ళు,
వంటాలు,తంటాలు,మా వారు శ్రీవారు,అత్తా,ఆవకాయ ఇలా అన్నింటి పైన
రాసేస్తున్నారు..ఇంకా మేం బ్లాగాలి..ఏం ఉందని బ్లాగాలి..

పోనీ కామెంటుదామంటే అది కూడా మా కన్నా ముందే కామెంటేస్తారు..

ఇంకా మాకేం మిగిలింది మునక్కాడ ముక్క...
మేం కూడా నీతో పాటు వస్తాం.....అంటే ....సరే చిన్నపిల్లలు ముచ్చట పడుతున్నారు కదా అనేసి రండి అన్నాను..

వెళ్ళె ముందు వరంగల్ కి వెల్లి మా ఫ్రెండ్స్ కి నా ప్రయాణం గూర్చి
చెప్పి వద్దామని బయలుదేరాను..
స్టేషన్ కి వెళ్ళేప్పుడు తోవలో శివగారు ఏవో ఆయుర్వేదిక మూలికలు కొంటూ కనిపించారు..
ఏందుకు శివగారు ఇవి అంటే ..జుట్టు పెరగడానికి మీనూ...

ఇదిగో ఈ "త్రిఫల చూర్ణం" వాడితే జుట్టు వద్దన్నా పెరుగుతుందిట...
అంటూ తన ఊడిపోయే జుట్టు గురించి బాధపడ్డారు....

జనాలు జుట్టు పెరగాలనే వ్యామోహం లో ఎంత
మోసపోతున్నారు ..పాపం ఇలాంటి వాళ్ళు ఎంతమందో..అనుకున్నా...

కాజిపేటా రైల్వేస్టేషన్లో ...అశ్విన్ గారు,శ్రీకాంత్ గారు కనిపించారు.

అశ్విన్ గారు చంకలో ఒక కుక్కపిల్ల.చేతిలో కోకాకోలా,కల్లల్లో కన్నీల్లు..
పెట్టుకుని కనిపించారు..ఎలాంటి మనిషి ఎలా అయిపోయారేంటి అనుకుని.
అసలు ఏం జరిగిందండి అని అడిగా..
నాదో విశాద గాధ ..ప్రతి సారి లువ్వులో ఫెయిల్ అవుతున్నాకానీ ఈ సారి నా పీకల మీదకు వచ్చింది.

నే: షాన్వాజ్ , షైలాభానూల గురించేనా ..?
అ: అవును వాళ్ళూ పోతే పోయారు ..ఇప్పుడు..నా కోసం
సులక్షణ రెడ్డి బాంబులు పట్టుకుని వెతుకుతుందిట.బతికుంటే "ఆఫ్రికా" అమ్మాయినైనా ప్రేమిస్తా.

అని ఒకటె ఏడవడం..ఇంతకి నువ్వెటు వెల్తున్నావ్ మీను అని అడిగారు.

హిమాలయాలకి వెల్తున్నానండి...
అ: ఓహో అలాగా..

ఇంతలో ఎవరొ అమ్మాయి వచ్చి గన్ ఎక్కుపెట్తి...
అశ్విన్ కదిలావో కాల్చి పారేస్తా అంది.
నే: ఎవరండి మీరు..?
అ: మీను తనె సులక్షన రెడ్డి..
సు: ఏయ్ ఎవరు మీరు..?
శ్రీ: మేము అశ్విన్ ఫ్రెండ్స్ అండి..
సు: ఐతే మీరు అయిపోయారు..
అ: ఏంటే అయిపోయేది..తుప్పు పట్టిన తుపాకీ మొహందానా...అని గట్టిగా అరుస్తూ బాలక్రిష్ణ స్టైల్లో
తుపాకీని తన్నేసి అశ్విని నాచప్ప లెవల్లో పరుగు పెట్టారు.
నేను,శ్రీకాంత్ గారు తనని ఫాలో అయిపోయాం.

మీను నువ్వు హిమాలయాలకి వెళ్తున్నావా..? అయితే నేను వస్తా..నీతో పాటు
కనీసం అక్కడనైనా సేఫ్ గా ఉంటాను.అలాగే నాతో పాటు మా ఫ్రెండ్ శ్రీకాంత్ వస్తాడు ,మేము కూడా తపస్సు చేస్తాం నీతో పాటు..అన్నారు.
సరే రండి అన్నాను.

అదేంటో నే వెళ్ళే సంగతి అప్పుడే అందరికీ తెలిసిపోయింది...ప్రవీణ్ గారు,చైతు గారు,కిరణ్ గారు,మురళీ గారు,సరస్వతికుమార్ గారు,క్రాంతి గారు,తెరెసా గారు,
వికటకవిగారు,ప్రఫుల్లచంద్ర గారు,వేణు గారు,భావకుడన్ గారు,బొల్లొజుబాబా గారు,మహేశ్ గారు,బ్రహ్మి గారు,శరత్ గారు,దీపు గారు,ప్రతాప్ గారు
తెలుగువాడిని గారు,విజ్జు గారు..అందరూ కళ్ళెంట నీల్లెట్టుకున్నారు..మా కోసం ఇంత త్యాగం చేస్తున్నావా..మీనూ అంటూ..


అన్నీ సర్దుకుంటుండగా.."రానారె" గారు కాల్ చేసి మీనూ బేగంపేట్ లో "బ్లాగానంద స్వామీజీ" గారున్నారు.
ఎందుకైనా మంచిది తను ఇంతక ముందు ఇలానే తపస్సు చేసారంటా మీరు వెళ్ళి కలిస్తే మీ ప్రయత్నం మంచిదో కాదో తెలుస్తుంది అన్నారు.
సరే అని అందరం బయల్దేరాం.

**** ***** ****

అది తాడేపల్లి వాళ్ళ ఆశ్రమం. అక్కడికి వెళ్ళాక. ఎంతో ప్రశాంతం గా ఉంది వాతావరణం.
ఇంతలో ప్రసాదం గారొచ్చి ప్రసాదం పెట్టారు. దీప్తిధారా గారు ఆశ్రమ పక్షుల తో నిమఘ్నమైనారు.
చదువరి గారు చదువుకుంటున్నారు. వీవెన్ గారు ఈ మధ్య బ్లాగులు హాట్ గొడవల మధ్య విసికి మెడిటేషన్ లో ఉన్నారు.

అశ్విన్ గారు వెంటనే స్వామిజి దగ్గరకు పరుగెత్తుకెళ్ళి.ఓ నవ్వు నవ్వారు.

స్వామీజీ : "ఆకాషం ఎర్రగా ఉంది" అన్నారు...
అశ్విన్ : "వీపు దురదగా ఉంది" అన్నారు....

మేమంతా ఇదేంటి అని అడిగితే ..అశ్విన్ గారు చెప్పారు.ఆ స్వామీజి ని కలిసే ముందు ఇలా
కోడ్ చెప్పాలని. ఆయిన అసలు పేరు "అబ్రకదబ్ర" అట. ఓహో అలాగా అనుకున్నామ్.

స్వా : పిల్లకాయల్లారా ఇంతకీ మీరు హిమాలయాలకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు.
శ్రీకాంత్ : "తల-బట్టతల-మగవాడు" అన్న Concept మీద తపస్సు చేయడానికి స్వామీజీ...
స్వా : ఇది ఓల్డ్ కాన్సెప్టే. మీకో విషయం చెప్పాలి అది పాతిక సంవత్సరాల క్రితం
ఉత్తర దేశంలో ఓ యోగ్యుడుండేవాడు. ఆ యోగ్యుడి పేరు
"విహారి భూపతి" అతను ఇదే concept మీద కొన్ని వందల మందిని
ఉత్సాహపరచి తప్పస్సుకు సిద్దం చేశాడు. ఆ వందల మందిలో నేనూ ఒకడినే.
అందరం కలిసి తపస్సు చేశాం. ఒక్కక్కళ్ళూ తపస్సు చెయ్యలేక వెనుదిరగటం ఆరంభించారు.
చివరకు ఓ ఐదుగురు మిలిలారు. ఆ "యోగ్యుడు" తో సహా ఆ ఐదుగురు మాత్రం
నిర్విరామంగా తపస్సు చేస్తూవున్నారు.
--------------------
INTERVEL
--------------------
( 10 నిమిషాలు తర్వాత )

అది అమృత ఘడియలు సమయం. భగవంతుడు ప్రసన్నమౌదగ్గ సమయం.
అనుకున్నట్టుగానే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.

దే :: "భక్తా ఏమిని కోరికా ?"
ఆ "యోగ్యుడు" నెమ్మిదిగా కళ్ళు తెలిచి చూశాడు.
అదృష్టమో దురదృష్టమోతెలియదు కానీ అందరూ సృహ తప్పి పడివున్నారు.
దేవుడిని చూసి ఆ యోగ్యుడు ఏడవటం మొదలపెట్టాడు. దేవునికేమి అర్ధం కాలేదు.

దే :: మళ్ళీ ..."భక్తా ఏమినీ కోరికా ?"
ఆ యోగ్య్డుడు ఇంకా ఏడుస్తునే ఉన్నాడు.
దేవునికి పిచ్చెక్కింది.

దే :: గట్టిగా అరుస్త్తూ "భక్తా ఏమిని కోరికా ?"

యోగ్యుడు ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు.
దేవుడు ఈ సారి ఆ యోగ్యుడు పక్కన కూర్చోని, తట్టి బ్రహ్మానందం స్టైల్ లో చెవిలో "భక్తా ఏమిని కోరికా ?" అనిడిగాడు.
యోగ్యుడు ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు.

దే :: దీనంగా "భక్తా ఏమిటయ్యా? ఏమిటి ? ఏమిటయ్యా నీ కోరికా ?
తపస్సు చేసి ఏడుస్తావేంటయ్యా.ఏమిటి నీ కొరికా ?.
చెప్పునాయినా పదహారుమంది వెయిటింగక్కడ. చెప్పు ఏం కావాలి "
యోగ్యుడు దేవుడి వంక చూసి.
నా ఖర్మ ఇలా కాలితే ఏవడేం చేస్తాడు లేండి."తల-బట్టతల-మగవాడు" అన్న concept మీద నేను తపస్సు చేశా.
మీరు ప్రత్యక్షమవ్వగానే నేను మిమ్మల్ని కడిగేద్దమనుకున్నా అసలు బట్టతల మగవానికి ఎందుకు పెట్టావ్ అని.
ప్రపంచంలో మగవాని బట్టతల తుడిచెయ్యటమే నా లక్ష్యం,కానీ.... స్వయాన మీరే "బట్టతలేసుకుని" దిగబడ్డారు.
అందుకు నేనేడుస్తున్నా.

అందుకు దేవుడిలా అన్నాడు.
"పిచ్చివాడా ?బట్టతల మగవానికిచ్చిన వరం ."

యోగ్యుడు : అదెలా స్వామీ ?
"బట్టతల మగవానికిచ్చిన వరం. మీ ఉద్దేశంలో మగ దేవతలందరూ ఇంతింత జుట్టేసుకునుంటారనుకుంటారా ?"
"ఏం కాదా",
"కాదు "పురాణాలలో" ఎక్కడన్నా మగవాని జుట్టుని గురించి ప్రస్తావించారా ?
లేదు కదా అదే మరి. బట్టతల దైవత్వానికి ,సింబల్.
అంతెందుకు దుశ్చాశనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని నిండు సభలోకి ఈడ్చుకొచ్చినప్పుడు
ద్రౌపది దుశ్చాచనుని జుట్టెందుకు పట్టుకోలేదనుకున్నావ్?
కారణం దుశ్చాశనునికి "బట్టతల". అంత దాకా ఎందుకు కలియుగ దైవం అంటారే
వేంకటేశ్వర స్వామి బట్టతలవ్వగానే కదా దేవుడైయ్యాడు..

ఇంకా చెప్పాలంటే రాజు పెద్దా ? రాణి పెద్దా ?
"రాజే పెద్ద "
"ఏలా అని మీరెప్పుడన్నా ఆలోచించారా? లేదు కదా నేను చెప్తావిను ఒక్కే ఒక్క కారణం రాజులకు "బట్టతల" కాబట్టి.
అవును శాస్త్రం ప్రకారం కిరీటం పెట్టుకున్నవాడే కింగ్. బట్టతల ఉంది కాబట్టే వాడు కిరీటం పెట్టుకున్నాడు.
కిరీటం పెటుకున్నాడు కాబట్టే వాడు రాజు.అంటే "బట్టతల రాజత్వం" అన్న మాట.
బట్టతలను ఉన్నవారిని అందరూ కాళ్ళుపట్టుకుంటారు. తెలుసా ? అదెలాగంటావా?
అదింతే జుట్టూ అందకపోతే కాళ్ళు అంటారు కదా బట్టతల ఉన్నవాడి జుట్టూ ఎప్పటికీ ఎదుటి వాడు అందుకోలేడు
కాబట్టి ఖచ్చితంగా కాళ్ళే పట్టూకుంటాడు.కాబట్టి నాయినా ఇలా పిచ్చివాడిలా తపస్సు చెయ్యకు ఇంతకు ముందు బట్టతల కోసం తపస్సుచేసే వారెందరో ఉన్నారు తెలుసా ?

కాబట్టి ............
బట్టతల మగవాని "గౌరవం" .
బట్టతల మగవాని "ఆనందం".
బట్టతల మగవాని మరో "అందం".
బట్టతల మగవాని "సుఖం".
బట్టతల "దైవత్వం".
బట్టతలే "సత్యం". సత్యమే నిత్యం.
బట్టతల ఉంది కాబట్టే ఆడవాళ్ళని మగవాడు శాశించగలుగుతున్నాడు.
మీ పూర్వీకులు బట్టతల రాని వాడిని గ్రామంనుండి వెలివేసి మగ గొడ్రాలు అని నిందించేవారంటే దాని విలువ నీకు తెలుసుంటుంది. " అని హితబోధ చేసాడు.
దానికి ఆ యోగ్యుడు కన్నీరు మున్నీరు గా భాదపడి. తనను క్షేమించమని కోరాడు.

దే:: "పర్లేదు భక్తా ఇవన్నీ కామన్. నువ్వు నాకొక సహాయం చెయ్యి.
ఇలాంటి చెత్త విషయాల మీద ఎవ్వరినీ తపస్సు చెయ్యొద్దని చెప్పు సరేనా.
యో : సరే.
దే : మరి నేను వెళ్ళిరానా ?
యో: స్వామీ నాదో అనుమానం. అసలు రాముడంటే N.T.R లా ఉంటాడనుకున్నా మీరేంటి ఇలా ఉన్నారు.
దే: "మీరేంటి ఇలా ఉన్నాను."-అంటే
యో: తమాషాగా, కామెడిగా అని స్వామి అంతకు మించి ఏమీ లేదు తప్పుగా అనుకోవద్దు.
దే: మీటింగ్ ఉంటే రాముడు "రాజస్ధాన్" వెళ్ళాడు. నేను రాముడిని కాదు. "తోటరాముడిని".
నీ ధైర్యానికి మెచ్చాను, నీకెప్పుడన్నా నాతో మాట్లాడాలంటే 'రెండు రెళ్ళు ఆరు' అను. అని మాయం అయ్యాడు దేవుడు.

..............................................................

అదమ్మా సంగతి అని " అబ్రకదబ్ర "స్వామీజి చెప్పారు.
కాబట్టి మీరందరూ "తల-బట్టతల-మగవాడు", అన్న తపస్సు యొక్క
concept ని అందరికీ చెప్పిమగవాని దుఖ: న్నీ పోగొట్టండి. సరేనా అన్నారు.

ఈ రోజు నుండి అహర్నిశలు బట్టతల అని బాధపడే మగవారికి కౌన్సిలింగ్ ఇచ్చి ..
వారికి నిజమైన "బట్టతల" అర్ధం ఇదని చాటి చెప్తాము. మాతో సహకరిస్తా అన్న వాళ్ళు చేతులెత్తండి.


(ఈ పోస్ట్ కేవలం సరదాగా నవ్వుకోడానికి రాసింది మాత్రమే ఎవరిని నొప్పించాలని ఉద్దేశం కాదు.. ఎవరికైనా అభ్యంతరముంటే తెలుపగలరు వారి పేర్లు తొలగించెదము. )

Friday, July 11, 2008

పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా..!!!.( సినిమా..)


మూగవోయిన నా గళమ్మునను కూడా నిదురవోయిన సెలయేటి రొదలు కలవు....
అన్న" కృష్ణశాస్త్రిలా",నేను నోర్మూసుకుని ఉందామనుకున్నా....కాని..బాధలు ఎవరికైనా చెప్పుకుంటే
మనసు తేలిక పడుతుంది అంటారు కదా...అందుకే నా బాధను మీతో పంచుకుంటున్నా.....
**************************************************
3 నెల్లు అయింది....వరంగల్ కి వెళ్ళక......కాని , మొన్నతప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది....ఎందుకంటే
మా బబ్బీగాడు కాల్ చేసి మీనక్క.. బుచ్చిబావ కి accident అయింది నువ్వు వచ్చేయ్..
అన్నీ విషయాలు నీకు ఇక్కడికి వచ్చాక చెప్తాను...అని చెప్పి కాల్ కట్ చేసాడు..
వరంగల్ కి వెళ్ళేసరికి చాలా పొద్దు పోయింది....అన్నం తినేసి పడుకున్నా......!!!
"చిరంజీవి" వస్తే అభిమానులు పిలవకుండా ఎలా వస్తారో...
"నేను" వచ్చానని తెలుసుకొని మా వరంగల్ దోమలు,ఈగలు..బస్సులు,లారీలు,ఆటోల మీద....వచ్చాయి...
అవి తెల్లవార్లూ నాకు ఒకటే, "ముద్దులు"...వద్దన్నా వినకుండా....దుప్పటి లాగి మరీ పెట్టాయి........
*********************************************
తెల్లవారింది...నేను,బబ్బీ త్వరగా Hospital కి వెళ్ళాలని ready అయిపోయాము....
ఇంతకి ఎవరిని చూడ్డానికి వెల్తున్నామో.....అనుకుంటున్నారా..?
నాకు తెలుసు మీకు తెలుసుకోవాలని ఉందని......మా "బుచ్చిబావ" ని చూడ్డానికి వెల్తున్నాం...
"ఈ బుచ్చిబావ" ఎవరబ్బా.?..మీను మాకు ఎప్పుడు చెప్పనేలేదు..
అనుకుంటున్నారా..ఐతే ఇప్పుడు చెప్తాను మీకందరికి .....మీరంతా ఏం చేస్తారంటే,
ఒక బకెట్లో..వాటర్..తెచ్చుకోండి..(అయ్యో బట్టలుతకడానికి కాదండోయ్ Flashback లోకి వెళ్ళడానికి..)
తరవాత అందులో..ఒక రాయి వేయండి.....వేసేసారా....ఇప్పుడు అందులో తరంగాలు మొదలవుతాయి.....
ఒక తరంగం,రెండు తరంగాలు,మూడు తరంగాలు,నాలుగు తరంగాలు.....
అలా ఆ తరంగాలను చూస్తూ చూస్తూ ....నా flashback లోకి దూకేయండి........
*************************************************************
ఆ రోజు ఏం జరిగిందంటే......???
నాన్న గారు అప్పుడే వచ్చారు...నేను,బబ్బీ ఏదో మాట్లాడుకుంటున్నాము....
నాన్న గారు నన్ను,బబ్బీ ని పిలిచి రేపు మన ఇంటికి బంధువులు వస్తున్నారు..అని చెప్పారు....
మీరిద్దరు.." కోతిచేష్టలు" చేయకుండా..బుద్ధిగా ఉండాలి అన్నారు......
సరే అని ఇద్దరం తలలూపాం..........
లోపలికి వెళ్ళాకా మా బబ్బీగాడు చెప్పాడు....మీనక్క...నీకు తెలుసా..
వాళ్ళను రమ్మనడం వెనక ఒక పెద్ద కారణం ఉంది.....
వాళ్ళకు ఒక్కగానొక్క "పుతేర". (సుపుత్రుడు) ఉన్నాడు.....అతని నామధేయం "బంక వెంకట రమణా రెడ్డి"..
అలియాస్ "బుచ్చిబాబు"..(MBBS).
"ఇతనికి కుడిపక్క అమ్మా,ఎడమ పక్క నాన్న తప్పా వెనకా,ముందు ,పెద్దగా ఆస్తి పాస్తులేమి లేవు"..
కాని అబ్బాయి "చుక్కల్లో చంద్రుడు..,మంచివాడు,బుద్ధిమంతుడు"...
వాళ్ళు మనకి దూరపు బంధువులు..వరసకి అత్తయ్య,మావయ్య అవుతారు..
ఇక పోతే ఆ బుచ్చిబాబు గారు మనకి "బావ" అవుతాడే మీనక్క....
ఒక వేళ.. ఆ బుచ్చిబాబుకి నువ్వు,నీకు బుచ్చిబాబు నచ్చితే తరవాత
పిపిపి.....డుం..డుం..డుం..అన్నమాట..అని అసలు సంగతి చెప్పాడు...
**********************************************
మా నాన్న గారు నా పెళ్ళికి ఇంత తొందర పడుతున్నారేంటబ్బా అనుకుంటున్నారా...?
అయ్యో..రామా..!మళ్ళీ అదో పెద్ద..Flashback...
ఈనాటికి..సరిగ్గా 22 సంవత్స్రరాల క్రితం...ఈ భూమిపై ఒక "అద్భుతం" జరిగింది...
ఆ రోజు..Feb 14th..రాత్రి ..సమయం..సరిగ్గా 10.32 min.,,అవుతుంది.
అప్పటివరకు ఆకాశంలో ఏ మూలో నక్కి ఉన్న కారుమబ్బులు
వేగంగా కమ్ముకోసాగాయి...ఒకటే ఉరుములు,మెరుపులు,వర్షం...తుఫాను..అప్పుడే..నేను పుట్టాను..
నేను చిన్నగా ఉన్నప్పుడే "హిమాలయాల" నుండి ఒక "బాబా" వచ్చారంట...
నన్ను చూసి....ఈ అమ్మాయి "మామూలు అమ్మాయి" కాదు...
"బ్రహ్మకి ఇష్టపుత్రిక"...."కారణజన్మురాలు"....ఈ పాప ఏ పని చేసినా అందులో ఒక "ప్రత్యేకత" ఉంటుంది.
ఈ సొట్టబుగ్గల.. అమ్మాయిని చేసుకోబోయే వాడు....చాలా "పూజలు చేసిన వాడై" ఉంటాడు.
పూర్వ జన్మలో ఎన్నో "నోములు నోచిన వాడై" ఉంటాడు.....ఈ అమ్మాయి...
ఎక్కడ అడుగు పెడితే అక్కడ "లంకెబిందలే"....దొరుకుతాయి....ఎడారిలో అడుగు పెడితే
అక్కడ కూడా "వరదలొస్తాయి"...అని చెప్పారంట...మరేమనుకున్నారు.."మీనాక్షా..మజాకా"..!
అందుకే కాబోలు...మా నాన్న గారికి...ఒకసారి...పెరట్లో తవ్వుతుంటే..."బంగారం" దొరికింది....
అన్నట్టు ఈ మాట మీరు మళ్ళీ ఎవరితో అనకండి......మీతోనే అంటున్నా...!
ఇది మీకు ,నాకు మద్య్హలో ఉండాలి సుమండీ....అసలు నేనేమి అనలేదు,మీరేమి వినలేదు సరేనా..
***************************************************
నా కోసం పూజలు చేసేవాడు ఆ బుచ్చిబావే అయ్యింటాడేమోనని మా నాన్న గారి..అనుమానం..
అన్నట్టు మా బబ్బీ గాడి గురించి మీకు చెప్పలేదు కదూ...వాడు మా పిన్ని కొడుకు.
ముద్దుగా,బొద్దుగా ఉంటాడు.
చుట్టాలు వస్తున్నారు అని నాన్న గారు చెప్పగానే,మా బబ్బీ గాడికి ఒకటే సంతోషం .
పెద్దనాన్న,మనం షాప్ కి వెళ్ళి స్వీట్స్ తీసుకొద్దామా...అని అనేసాడు....
వాడికి నచ్చినవన్నీ కొనిపించుకున్నాడు...ఇంటికివచ్చాక మళ్ళీ వాడి ప్రసంగం మొదలైంది.
మీనక్క.. ఆ బుచ్చిబావ చాలా మంచివాడటే..
అల్లం బెల్లం అంటూ ఏదేదో చెప్పాడు....అన్నీ తెలిసిన ఆరిందలా...
**********************************************
చక్కగా నా మానాన నేను... "రామా రామా రామా నీలీ మేఘశ్యామ ..
రామా రఘుకుల సోమా భద్రాచల శ్రీరామా"....అని ఊరికే అలా పాడుతుంటే బబ్బీగాడొచ్చి....
మీనక్క....వాళ్ళని impress చేయడానికా..ఈపాట...ఏడ్చినట్టుంది.
ఇలాంటి పాటలు సినిమాల్లోనే బాగుంటాయి....ఎందుకంటే హీరోయిన్
పాట పాడుతుంటే వెనకాల నుండి Background music..వస్తుంది....
మరి మనం పాడితే ఏమి రాదాయే..!.....అందుకే నువ్వు ఆ పాట పాడకు అన్నాడు....
మనం ఏం చేసినా sensational గా ఉండాలి....ఒక "ప్రత్యేకత" ఉండాలి....
మరి ఏం పాడనురా బబ్బీ అని అడిగా....
"వాషింగ్ పౌడర్ నిర్మా..వాషింగ్ పౌడర్ నిర్మా....పాలలోని తెలుపు నిర్మాతో వస్తుంది...
రంగూల బట్టలే తల తల గా మెరిసేను...అందరూ మెచ్చిన నిర్మా...
వాషింగ్ పౌడర్ నిర్మా..శంకర్ దయాల్ షర్మా"......
నువ్వు ఈ పాట పాడుతుండు.....నేను వెనకాల నుండి నిర్మా..నిర్మా...అంటు
కోరస్ ఇస్తాను....అర్దమైందా....అన్నాడు ...వెధవా..!!!
***********************************************
తెల్లవారి పదింటికల్లా..రమణ గారి అమ్మా,నాన్న వాళ్ళు వచ్చేసారు...
కానీ...ఈ "నవాబ్ ఆఫ్ పటౌడి" గారు మాత్రం రాలేదు.....అంతలో బబ్బీగాడు అన్నాడు..
మీనక్క ఎవరో "పూలరంగడు" వస్తున్నాడే...అని..తను గేట్ తీసి అడుగు పెట్టారో లేదో....
"పిట్టలన్నీ ఆయనకి...రెట్టలతో స్వాగతం పలికాయి"...పాపం సిగ్గుపడుతూ ఇంట్లో అడుగుపెట్టారు....
అసలు సిగ్గుపడడం అబ్బాయిల లక్షణమని నాకు 5th class లోనే తెలిసింది..
ఆ వివరాలన్ని తరవాత చెబుతాను.......మీకందరికి..(ఎందుకంటే మళ్ళీ అదో పెద్ద flashback.)
నాన్న గారు...నన్ను,బబ్బీని బుచ్చిబాబు గారికి పరిచయం చేసారు.....
అలా..అలా...ఆ రోజు ముగిసింది.....
*********************************************
బుచ్చిబావ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు.....
ఒక రోజు బబ్బీ ,నేను సినిమాకి వెల్తుంటే బుచ్చిబావ వచ్చాడు...
ఎక్కడికి వెల్తున్నారు..అని అడిగితే సినిమాకి అని చెప్పాం....
ఐతే నేను మీతో వస్తా...అన్నాడు.....సరే అని ముగ్గురం బయలుదేరాం...
సినిమా స్టాట్ అయింది....అందరం చూస్తున్నాం....ఆ సినిమా చాలా ట్ర్రాజెడి....
మా బుచ్చిబావ ఆ సినిమాలో లీనమై తన "భావోద్వేగాలను నియంత్రించుకోలేక".....
"భయంకరంగ ఏడవడం" మొదలెట్టాడు..ఆయన ఏడుపుకి జడుసుకుని చాలా మంది
ప్రేక్షకులు సినిమా చూడ్డం మానేసి ఈయన్ని వింతగా చూడ్డం మొదలెట్టారు....
ఇంతటితో కథ ముగిసిందా అంటే అదీ లేదు....ఆ సినిమాలో ఎక్కడైనా jokes వస్తే పెద్దగా నవ్వుతూ..
మా బబ్బీగాడి వీపు మీద చరవడం......పాపం ఆ రోజు బబ్బీ గాడు అయిపోయాడు...
***********************************************
తిరిగి ఇంటికి వస్తుండగా....బబ్బీగాడు.. మీనక్క..పుచ్చకాయ కొందామా...అన్నాడు...
అప్పుడు మొదలెట్టాడు బుచ్చిబావ "పుచ్చకాయ పచాపచా"....
"మనం ఎలాంటి కాయ కొనాలంటే.....మందపాటి తొక్కలతో..బరువుగా ఉండే కాయల్ని ఎంపిక
చేసుకోవాలి...చూపుడు వేలు లేదా..మధ్యవేలితో కాయ మీద గట్టిగా్ కొట్టి చూస్తే -
"ఎక్కడో-నూతిలో నుంచి వచ్చినట్లుగా శబ్దం వినిపిస్తే" అది తియ్యని గుజ్జున్న తాజా కాయేనని గుర్తించాలి.
నేల మీద ఆనుకునే కాయ భాగం తెల్లగానూ ఆకుపచ్చ రంగులోను కాకుండ కాస్త పసుపురంగులోకి మారి
ఉంటే అది బాగా పండినకాయే....అని గుర్తించాలి.(పైపెచ్చు మా బుచ్చిబావ ఊతపదం)
పైపెచ్చు పుచ్చకాయరసంలో తేనె కలుపుకుని తింటే గుండెజబ్బులు నయమవుతాయి..
పైపెచ్చు తాపం తగ్గాలన్న,,చెమట ద్వారా పోయే ఖనిజలవణాల లోపం తగ్గాలన్న పుచ్చకాయ తిని తీరాల్సిందే..
పైపెచ్చు ఈ పుచ్చకాయ పైతోలుకు ఎర్రని గుజ్జుకు మధ్య తెల్లని భాగాన్ని "కూర" చేసుకుని తినచ్చు.
పైపెచ్చు లోపలి గింజలను తీసి వేయించి వాటిపై "పొట్టుతీసి" తినచ్చు....
ఇలా పుచ్చకాయ గురించి చెప్పుకుంటు..పోతూనే ఉన్నాడు...
మీనక్క పుచ్చకాయ వద్దు గిచ్చకాయ వద్దు.....త్వరగా ఇంటికి వెల్దామే.. అన్నాడు...బబ్బీగాడు..
ఇంటికి వెళ్ళాక అమ్మ ...సినిమా ఎలా ఉందిరా బబ్బీ....
అని అడిగితే "పుచ్చకాయ" లా ఉంది అని చెప్పాడు బబ్బీగాడు...ఆ రోజు ఏలాగోలా ముగిసింది..
*****************************************
అలా అలా రోజులు గడిచిపోతున్నాయి....అంతలో నా results వచ్చాయి...
నా Results రోజు అందరు "ఉత్కంఠంగా" ఎదురు చూస్తున్నారు....ఫలితాలు ఎలా ఉంటాయో అని...
నేను మా college first వచ్చాను...(ఇది నిజమేనండోయ్)
దేవతలార ఈ సారి పాస్ చేయండి చాలు..మీ చుట్టు..
108.. చుట్లు తిరుగుతాను అని ఎన్నో మొక్కులు మొక్కాను....
కాని ఏకంగా college first తెప్పించేసారు...ఇక మొక్కులు తీర్చాలి కదా..అనుకుని..
తెల్లవారగానే "భద్రకాళిగుడి" కి బయలుదేరాం...నేను,బబ్బీ....
అంతలో మా బుచ్చిబావ వచ్చాడు...వామ్మో ..బుచ్చిబావ వచ్చాడే మీనక్క...అన్నాడు బబ్బీ..
ఇప్పుడెలాగే...అన్నాడు...అయ్యో గుడికి వెళ్తున్నాము అని చెబుదాము లేరా..!అన్నాను...
బావ రాగానే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు...
ఉన్న కథా కమామిషు అంతా చెప్పాం ...(రాడేమో అనుకుని...)
నేను వస్తాను మీతో అన్నాడు...ఇంకేం చేస్తాం సరే అని వెళ్ళాం....
నేను చుట్లు తిరగడం స్టాట్ చేసాను....మా బబ్బీ గాడు కూడా నాతో పాటు తిరగడం మొదలెట్టాడు..
ఒరేయ్ నిన్ను చుట్లు లెక్కపెట్టమని చెప్పాను కదరా..వెధవ..నువ్వు ఎందుకు తిరుగుతున్నావ్ అంటే...
మీనక్క..బుచ్చిబావ..."పుచ్చకాయ పచాపచా"..మళ్ళీ ఎక్కడ మొదలెడతాడో..అని భయంగా ఉందే...
అందుకే ఇలా నీతో చుట్లు తిరుగుతానే..కనీసం పణ్యమైనా వస్తుంది కదే...!
ఇప్పుడా "పుచ్చకాయసుత్తి" నేను భరించలేనే..మీనక్కా..అన్నాడు..
మరి బుచ్చిబావ...ఎలా రా..?అంటే...మనం చుట్లు తిరిగుతుంటే లెక్కపెట్టమని చెప్పానక్క..అన్నాడు..
********************************************************
మొక్కు తీరింది...ఇక ఇంటికి బయలుదేరాం.....
నేను,బబ్బీ చాలా అలసిపోయాం.....అంతలో అమ్మ ఇక భోజనాలకి లెగండి..అని కేక...
అన్నం తిని కూర్చున్నాము...అంతలో బుచ్చిబావ "పొడుపుకథలు పొడుద్దామా" అన్నాడు..
సరే అన్నాం.....ఇద్దరం బుద్ధిలేకుండా..!!..బుచ్చిబావ పొడిచాడు ఒక పొడుపు...
దానికి మేమిద్దరం ఢమాల్....."లక్కబుడ్డి నిండా లక్షవరహాలు"..చెప్పుకోండి చూద్దాం....
అన్నాడు...మాకు తెలీదు బావ అన్నాం ఇద్దరం.....ఓస్ ఆ మాత్రం తెలీదా.."పుచ్చకాయ"...అన్నాడు..
మళ్ళీ మొదలైంది "పుచ్చకాయ పచాపచా"..!!!
నీకు తెలుసా మీను పుచ్చకాయతో "పచ్చడి" కూడా చేయోచ్చు...
ఓరి దేవుడా..!..ఈ సారి పుచ్చకాయ పచ్చడా.....?
****************************************************
మీను అసలు పుచ్చకాయ పచ్చడి ఎలా చేస్తారంటే....పుచ్చకాయ లోపలి ఎర్రని పదార్థం తినేయగా
మిగిలిన చెక్కు, పావుకిలో,నువ్వులు,ధనియాలు,జీలకర్ర,మెంతులు.వెల్లుల్లి,అల్లం,చింతపండు....
మొదలైనవి సిద్ధం చేసుకోవాలి...అన్నీ కలిపి మిక్సీలో వెయ్యాలి...
తరవాత అని....అంటుండగానే....బబ్బీగాడు..మీనక్క నాకు పొట్టలో నొప్పిగా ఉంది అంటు వెళ్ళిపోయాడు...
తరవాత బుచ్చిబావ పుచ్చకాయ పచ్చడి,పుచ్చకాయ తొక్కల ఫ్రై,పుచ్చకాయ చట్ని.పుచ్చకాయ హల్వా,
ఇలా రకరకాల వంటలు...ఇంకా పుచ్చకాయ పుట్టుపుర్వోత్తరాలు..అన్ని చెప్పాడు..
ఇదంతా, విన్న నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు...బావ తలనొప్పిగా ఉంది నేను పడుకుంటా అన్నాను..
***************************************************
బబ్బీగాడు రాత్రి పడుకునేముందు నా దగ్గరికి వచ్చి మీనక్క....ఈ బుచ్చిబావతో నువ్వు వేగలేవే అన్నాడు..
ఒక వే్ళ నీ పెళ్ళి బావతో గనక ఐతే..నేను మాత్రం మీ ఇంటికి రానే...అన్నాడు..
ఎందుకురా..అంటే వామ్మో....బుచ్చిబావ చెప్పే" పుచ్చకాయ పచాపచా"..వినాలి...
ఇంకా ఆ దిక్కుమాలిన..."పుచ్చకాయ కూర","పుచ్చకాయ పచ్చడి","పుచ్చకాయ చట్ని,
"పుచ్చకాయ హల్వా","పుచ్చకాయ బిర్యాని" తినలేక చావాలి.....తలుచుకుంటేనే భయంగా ఉందే..
నేను రానే మీ ఇంటికి అన్నాడు...ఓరేయ్ బబ్బీ .,,బుచ్చిబావతో నా పెళ్ళి చేస్తే ఎలా ఉంటుంది అని అమ్మ
నాన్న అనుకున్నారు అంతే...గాని.. బుచ్చిబావకి నా పై అలాంటి అభిప్రాయం లేదురా
సో నో ప్రాబ్స్.....అన్నాను....ధీమాగా..
*********************************************************
తరవాత ఒక రోజు బుచ్చిబావ వచ్చి మీను..నేను..US వెల్తున్నాను...అని చెప్పాడు..(MS చేయడానికి)
మీను నేను ఇంకో..10 days తరవాత వెళ్ళిపోతా అన్నాడు...బుచ్చిబావ దిగాలుగా.
10 days తరవాత వచ్చి,బబ్బీ,మీను నే వెల్తున్నాను...
అప్పుడప్పుడు కాల్ చేస్తాను...సరేనా..అని చెప్పి వెళ్ళిపోయాడు...
*************************************************************
మళ్ళీ మొన్నే వచ్చాడు సరిగ్గా సంవత్సరం తరవాత.....US నుండి.......వాళ్ళ చెల్లి పెళ్ళికని...
వస్తుంటే..చిన్నaccident అయింది...
కొంచెం నడుము విరిగింది..అంతే..!..మిగతా అంతా ఓకె..నేను,బబ్బీ చూసి రావడానికి వెళ్ళాం...
వెళ్ళేప్పుడు పుచ్చకాయ తీసుకెడదామా..మీనక్క..అన్నాడు బబ్బీ వెధవ...
నువ్వు ముందు నోర్మూసుకుని పద అన్నాను...
******************************************
బుచ్చిబావ ఎలా ఉన్నావ్ అన్నాను...ఆ ఇప్పుడు పర్లేదు అన్నాడు....
అయ్యో పెళ్ళికి అని వస్తే ఇలా జరిగిందేంటి బావ ..అన్నాను...మేము బాగానే వస్తున్నాం మీను ..
వాడే గుద్దేసాడు......వెధవ..అన్నాడు....పోనీలే... మీను నువ్వు,బబ్బీ ఎలా ఉన్నారు..?
"నేను మీ ఇద్దరిని చాలా మిస్ అయ్యాను తెలుసా"...అన్నాడు....
"మేము కూడా నిన్ను చాలా మిస్ అయ్యాం బుచ్చిబావ అన్నాడు బబ్బీగాడు"....
అంతలో బుచ్చిబావ అన్నాడు..మీను..నేను...ఈసారి అమ్మ,నాన్నతో మన పెళ్ళి
గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను......అని.
ఈ వార్త విని...నాకు,బబ్బీకి నెత్తిపైన "పుచ్చకాయ" పడ్డట్టైంది....
అంతలో నేనే అన్నాను.. జోకులు వేయకు బావ..అని..జోకులు కాదు మీను..ఇది నిజం ...
ఓరుగల్లుకే.. పిల్లా పిల్లా..ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే..
ఓరచూపులే రువ్వే పిల్లా..ఏకవీర నువ్విలా ఉన్నావే..అంటూ ..పాటలు పాడ్డం మొదలెట్టాడు..
బుచ్చిబావ పాట బాగానే ఉంది కానీ... నేనెందుకు బావ నీకు...
నా కన్నా మంచి పిల్ల దొరుకుతుంది నీకు అన్నాను నవ్వుతూ..(ఏడవలేక)
నేను జోకులు వేయడం లేదు మీను..ఇది నిజం....కట్టుకుంటె నిన్ను తప్పా..
కట్టుకోనే కట్టుకోను...ఒట్టు పెట్టుకుంటినమ్మో బెట్టు చేయకే....అన్నాడు..బుచ్చిబావ...!!!
***********************************************
తరవాత అసలు ఏం జరుగుతుంది...ఈ కథ ఎటు మలుపు తిరుగుతుంది..
ఇంతకీ బుచ్చిబావకి,మీనుకి...సయోధ్య కుదిరిందా....?
సయోధ్య కుదరక..అయోధ్యలో అగ్నిగుండం బద్ధలైందా..? అసలేం జరిగింది...
తెలుసుకోవాలని మీకందరికి ఆత్రుతగా ఉంది కదూ....
తరవాతి కథ మీరు తెలుసుకోవాలంటే నేను త్వరలో .....తీయబోతున్న సినిమా చూడాల్సిందే....
బడ్జెట్ ఎంతో తెలియదు కాని సినిమా పేరు మాత్రం "పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా"..!!!
***************************************************

Tuesday, June 24, 2008

నేను ఎందుకు ప్రేమించలేదంటే.....???


ఈ మధ్య ఏ college లో చూసినా,ఏ school లో చూసినా,టాంక్ బండ్ దగ్గర చూసినా,
సినిమాహాల్లో చూసినా,ఎక్కడ చూసినా ప్రేమ వ్యవహారాలే..........
ఎక్కడ చూసినా ప్రేమ..ప్రేమ....ప్రేమ.... ప్రేమికులే.........
లోకమంతా ప్రేమ మయం అయిపోయింది.........
***************************************
కనీసం మనశాంతి కోసం అయినా సినిమా కి వెళ్దామంటే అక్కడ కూడా "ప్రేమే"......
ఒక హీరో ఉంటాడు....ఒక హీరోయిన్ ఉంటుంది....
ఇద్దరు ప్రేమించుకుంటారు........మధ్య..మధ్య లో సాంగ్ లు సింగేసుకుంటారు....అన్నీ ప్రేమ సినిమాలే......
మైనే ప్యార్ కియా...,,ఇశ్క్..విశ్క్ ..ప్యార్..వ్యార్...
ప్రేమించుకుందాం రా..!!...నేను నిన్ను ప్రేమిస్తున్నాను..
నువ్వూ.... నన్నూ ప్రేమించు....నేను నిన్నే ప్రేమిస్తా.....
అందరినీ ప్రేమిస్తా......ఎక్కడైనా ప్రేమిస్తా.....
ఎప్పుడైనా ప్రేమిస్తా....నువ్వు వద్దన్నా ప్రేమిస్తా..........
ఇలా అన్నీ ప్రేమకు సంబందించిన సినిమాలే......
***********************************
కాసేపలా ఏదైనా బుక్ చదువుదామని తీస్తే ..అందులో కూడా "ప్రేమ" గూర్చి రాసారు..
సరే ప్రేమంటే ఏంటో..??? మనకు తెలీదు కదా అని చదవడం మొదలెట్టా.......
"ప్రేమంటే.. రెండు మనసులు, ఒకే.. పన్.......థాన నడుచుట"......అని రాసుంది.
ఈ ఒకే.. పన్ .....థాన ,నడవడమేంటో అర్దమవ్వలేదు...
"ప్రేమ, ఆల్జీబ్రా లెక్క వంటిది.ఎన్ని అడుగులు వేసినా ఈక్వేషన్ లా రెండువైపులా విలువ సమానంగా ఉంటుంది..
"ప్రేమ... గణితంలో ఒకటీ ప్లస్ ఒకటి విలువ చాలా....రెండు మైనస్ ఒకటి విలువ సున్నా"!!.....
"ప్రేమలో త్రికోణమితి ప్రేమలు కూడా ఉంటాయి".....
ఓరి భగవంతుడా..! నేను అన్యాయమైపోయా...చిన్నప్పటి నుండి లెక్కలంటే నాకు మింగుడు పడని బొక్కలతో సమానం...
ఇప్పుడిప్పుడే ప్రేమని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే చివరికి ప్రేమలో కూడా ,...
ఆల్జీబ్రా లు ఆవకాయలు,త్రికోణమితులు పెట్టావా తండ్రి.......నాకెందుకింత అన్యాయం చేసావ్ అని బాధపడుతూ......
ఆ....అయినా అందరూ లెక్కలొచ్చిన వాళ్ళే ప్రేమిస్తున్నారా ఈ లోకంలో ..
లెక్కలు రాని వాళ్ళు ఎంతమంది ప్రేమించడం లేదు... అనుకుని...తరవాతి లైన్ చదివా....
"ప్రేమని.. రోడ్డు మీద నడుస్తూ అకస్మాత్తుగా అరటి తొక్క మీద కాలేసి పడటంతో పోల్చొచ్చు.....ఎలా పడ్డాడో...ఎందుకు పడ్డాడో..
చూసేవాళ్ళకి తప్పా అతనికి లేచేదాక అర్ధం కాదు".....ఈ లైన్ చదివి వామ్మో ప్రేమంటే మూతీ,పళ్ళు,నడుములు విరగ్గొట్టుకోవడమా??...అని అనుకుని...ఆఆ.....అయినా... లోకం లో ఎంత మంది ప్రేమించుకోవడం లేదు....
అని తరవాతి లైన్ చదివా....
"నిజమైన ప్రేమకి నిదర్శనం ప్రేమికులిద్దరూ...ఒకే టూత్ బ్రష్ తో తోముకోవడం"....
ఇలా అని ఎవరో" ఏకదంతం" అనే మహానుభావుడు చెప్పారు ఆ బుక్ లో......
ఛి..ఛి..ఒకే బ్రష్ తో ఇద్దరు తోముకోవడమా ప్రేమంటే...ఛి ఇదేం మాయదారి ప్రేమ అనుకుని...ఆ..అయినా ఎంతమంది ప్రేమించుకోవడం లేదు ఈ లోకం లో అనుకుని...తరవాతి లైన్ చదివా.....
"ఇద్దరిని కలిపే సిమెంటే ప్రేమంటే"....అని రాసుంది....ఇది చదివాక ప్రేమంటే ఏంటో కాస్త అర్దమయ్యినట్టే అనిపించింది..
కానీ..అందులో "KCP,Birla,Nagarjuna" సిమెంట్లలో ఏది వాడాలో చెప్పలేదు....ఇప్పుడెలా అనుకున్నా...
ఆ..మన "బ్లాగ్ మిత్రులని" అడిగితే అయిపోతుంది కదా... అని....అనుకుని..తరవాత లైన్ చదివా....
"ప్రేమికులు గుడ్లగూబ కన్నా గుడ్డి వారై ఉండాలి" అని రాసి ఉంది......వార్నీ.....ఉన్న నాలుగు కళ్ళతోనే....
రోజూ..బస్సునంబర్లు,స్టార్ ప్లస్ లోని ఏక్తాకపూర్ ..తీసిన యమ ట్విస్టింగులున్న సీరియల్లు ..,సూడలేక...
ఇంకా....జుట్టుపిలకలు పెంచుకుంటున్న, అబ్బీలను... అమ్మీలా..??..అబ్బీలా..?? ...ఎవలాళ్ళు
అని నా నాలుగు కళ్ళ తో గుర్తు పట్టలేక చస్తా ఉంటే ........ఈ ప్రేమలో గుడ్డోళ్ళు కావడం ఏంట్రా బాబు అనుకుని..
అసలు ఈ ప్రేమ అనేది పెద్ద పద్మవ్యూహం ..లాంటిది అని డిసైడ్ చేసుకుని....
Hyd లోని ప్రేమా..ప్రేమా..అనే University లో "ప్రేమ" పై PhD చేయాలని నిర్ణయించుకుని, బుక్ మూసేసా...
************************************************
ఇక పోతే బ్లాగుల విషయానికి వస్తే....
కొంత మంది బ్లాగు మిత్రులు రాసే కవితలు,కథలు..కాలేజ్ జీవితాలు,చదివాక.....
నాకు చాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలా..బాధేసింది.....
వారు రాసిన కవితల్లో,కథల్లో,వారి కాలేజి జీవితాల్లో...
అన్నీ ప్రేమకు సంబందించిన ప్రస్తావనలే.......
ఒక చెలి ఉంటుంది....ఒక చెలికాడు ఉంటాడు...చెలి విరహవేదనలో...చెలికాడు...తపిస్తూ ఉంటాడు...
ఆ చెలికాడికి, చెలి కళ్ళల్లో ప్రపంచమంతా కనిపిస్తూ ఉంటూంది...
చెలియ కోసం చూసే ఎదురు చూపుల్లో, సెకనులు..నిమిషాలుగా...
నిమిషాలు..గంటలుగా...గంటలు..యుగాలుగా, అనిపిస్తూ ఉంటాయి.....
ఇక కొందరు రాసిన కాలేజి జీవితాల్లో.....వారు ఒకరిని ప్రేమించారు...ఒకరు వారిని ప్రేమించారు..వారి ప్రేమ సఫలమో..విఫలమో
తెలీదు కానీ.....మొత్తానికి ప్రేమించారు...
*******************************
ఛి..ఛి..ఛి..ఛి..ఛి...ఇవన్నీ చదివాక నాకు నా పైనే ఛిరాకేస్తుంది...
చాలా.... బాధగా కూడా ఉంది.....
నా పైన కవితలు రాసేవారే లేరా?? నన్ను పొగిడేవారే లేరా???...నా కోసం ఎదురు చూసే వారే లేరా???
హృదయం ఎక్కడున్నది.......హృదయం ఎక్కడున్నది..
నీ చుట్టూనే తిరుగూ....తున్నది......అని నా కోసం పాట పాడే వారే లేరా?
మీనాక్షీ ,నువ్వు ఆకాశం లో" milkyపుంతవి" అని అనే వాళ్ళే లేరా?
టప.....టప....టప....టప.....ఇవి కన్నీళ్ళు.....
ఇలా... నేను... ఏడుస్తుంటే నా కన్నీళ్ళను రుమాలు తో తుడిచి ....మీనాక్షీ...ఏడవద్దు....
నీ కన్నీళ్ళు....కొహినూరు వజ్రాలు....ఎవరైనా చూసారంటే ఎత్తుకుపోతారు....
కొంపతీసి నిన్నుkidnap చేసినా చేస్తారు.....అందుకే నువ్వు ఏడవకు అని అనే వాళ్ళే లేరా?
*****************************************
లేరు..లేరు..లేరు..లేరు......లేరు
ఎలా ఉంటారు మీరే చెప్పండి...నేనసలు ఎవరినైనా ప్రేమిస్తే కదా ఉండడానికి......
అసలు నేను ఎందుకు ప్రేమించలేదంటే?????
నా... ఈ ......ఈశాదమైన గాధ విని మీరంతా తట్టుకోలేరు......తప్పకుండా ఏడ్చేస్తారు.....
నాకు తెలుసు మీ అందరివి... వీ....శాలమైన హృదయాలని......
అందుకే.... ఒక రుమాలు,ఒక 2,3 బకేట్లు పక్కన పెట్టుకోగలరు....
ఈ సారి" ఉల్లిగడ్డలని గుండ్రంగా కోసి" వాటిని చూస్తూ చూస్తూ నా flashback లోకి వచ్చేయండి ....
******************************************
అసలు నేను ప్రేమించకపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే......
1. అప్పట్లో......నువ్వు..నేను,10th class,boys,లాంటి చిన్న పిల్లలు ప్రేమించుకోవాలని చెప్పే సినిమాలు తీయాలనే ఆలోచన ఏ దర్శకునికీ రాలేదు..
ఇది చాలా బాధాకరమైనా విషయమని నేను సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్షా.....
2.ఇక సంవత్సరమంతా..నాకు...(a+b)2..,(a-b)2...లాంటి సొల్లు సూత్రాలు బట్టి పట్టడానికే సరిపోయింది...
ఇక ప్రేమసూత్రాలు ఏంటో ఎలా తెలుస్తుంది?చెప్పండి.
3.అందరూ పేపర్లతో "పడవలూ,కత్తిపడవలూ,ఇమానాలు" చేయడం నేర్పారు కానీ .....
అవే పేపర్లపై "నాలుగు ప్రేమముక్కలు" రాసి ఎవరిపైకైనా "విసరాలని" ఎవరూ చెప్పలేదు.....
4.అందరు "ముగ్గులు" ఎయ్యడం ఎలాగో నేర్పారు కానీ.....అబ్బీలను" ముగ్గులోకి దింపడం" ఎలాగో నేర్పలేదు...
బ్లాగ్ మిత్రులారా..చూసారా..నన్ను ఈ సమాజం ఒక "ప్రేమికురాలిగా" కూడా ఎదగనివ్వలేదు....
3.నేను ప్రేమించకపోవడానికి మరొక కారణం "దూర్ దర్శన్".మాయదారి దూర దర్శన్....
నన్ను,ప్రేమకు "దూర్" చేసింది.అప్పట్లో ప్రేమకు సంబందించిన సీరియల్స్ ప్రసారం చేయకపోయేవారు...
సగం సమయం "అంతరాయానికి చింతిస్తున్నామూ" అని "చింతించడానికే" సరిపోయేది....
ఇక మిగితా టైం ...గ్రామదర్శిని,టెలిస్కూల్,చిత్రలహరి,బుర్రకథలు,వార్తలు,మహాభారత్,రామాయణం లాంటి కార్యక్రమాలు ఇచ్చేవారు...
గ్రామదర్శిని లో ఏ పంటకి ఏ మందు" పిచికారి" చేయాలో చెప్పేవారు తప్ప ....
ప్రేమలో "అబ్బీ" లను పడేయడానికి ఏ మందు "పిచికారి" చేయాలో చెప్పేవారు కాదు.....
4.ఇక పోతే నా చుట్టూ ఉన్న సమాజం,మా పెద్దలు...నాకు... ప్రేమకి,దోమకి మధ్యనున్న తేడాలు చెప్పలేదు....
కాని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ప్రేమలో కూడా ప్రేయసి,ప్రేమికున్ని కుడుతుంది...ప్రేమికుడు ప్రేయసిని కుడుతాడు..
తరవాత ఇద్దరికి" ప్రేమేరియ" అనే ఒక మాయదారి రోగం వస్తుంది.....అదే" ప్రేమ" అని....
ఈ వ్యాధి యొక్క లక్షణాలు::ఈ వ్యాధి సోకిన వారికి ప్రపంచమంతా... అందంగా కనిపిస్తూంటుంది.
వీరి కాళ్ళు....భూమి పైన నడుస్తున్నా,,,మనసులు మాత్రం ఆకాశం లో" దూదిపింజల్లాగా" ఎగురుతుంటాయి...
కొత్తగా "కవిథలు" రాయాలనే "భయంకరమైన" ఆలోచన వీరిలో రేకెత్తుతుంది...
ఈ వ్యాధి సోకిన వారికి ఆకలి,దప్పికా ఉండవు....ఈ వ్యాధి బాగా ముదిరిన వారు ..ఆకాశం లోకి చూస్తూ...తమలో తామే
మాట్లాడుకుంటూ....నవ్వుకుంటూ..ఉంటారు.....ఈ వ్యాధికి చికిత్స,మందు లేదు....
**************************************************
ఇదంతా వింటుంటే మీ కన్నీళ్ళు ఆగట్లేదు అని నాకు తెలుసు ...ఇప్పటికే 2 బకేట్లు నిండిపోయాయి అనుకుంటా...
మరొకటి పెట్టుకోండి...ముందు ముందు చాలా, వీ.....శాదం ఉంటుంది.
5.ఇక అతిపెద్ద కారణం ఏంటంటే..??? ప్రేమంటే ఇదేనా..? అని నాకు తెలీక పోవడం...
మా స్కూల్లో ఒక అబ్బాయి ఉండేవాడు...పేరు ఈశ్వర్.....చాలా క్లెవర్,మంచివాడు,మనసున్నవాడు.
తను ఎంత మంచివాడు అంటే........Exams లో ఆన్సర్స్ అన్నీ చెప్పేవాడు...
అలా చెప్పడమే "ప్రేమ" అని నాకప్పుడు తెలీదు.నా cycle chain పడిపోయినప్పుడల్లా పెట్టించేవాడు.
అలా పెట్టివ్వడమే "ప్రేమ" అని నాకప్పుడు తెలీదు.
మా క్లాస్ లో ఆన్సర్స్ చెప్పకపోతే ముక్కు చెంపదెబ్బ కొట్టించేవారు.
నేనెప్పుడు ఆన్సర్ చెప్పకపోయినా ఈశ్వర్ నన్ను మెల్లిగా కొట్టేవాడు.
మిగతా వాళ్ళని గట్టిగా కొట్టేవాడు.ఆ గట్టికి...ఈ మెల్లి కి మధ్య ఉన్నదే" ప్రేమ" అని నాకప్పుడు తెలీదు.
నాకు chemistry లో elements రాకపోయేవి...,,
మీనాక్షీ,.... చెప్పమ్మా అని sir అడగ్గానే టక టకా మొదలుపెట్టేదాన్ని.
H,He,Li,Be,B,C,N,O,F,Ne,Na,Mg,Al,Si,P,S,Cl,Ar....
వరకూ బాగానే చెప్పేదాన్ని.....తరవాత బండి ఆగిపోయేది.....
అలాంటి "విపత్కరఘడియల్లో",.... ఆపద్ద్భాందవుడు సినిమా లో ,మీనాక్షీ శేషాద్రి ని చిరంజీవి ఆదుకున్నట్టు....
ఈ మీనాక్షీని ,ఈశ్వర్ ఆదుకునేవాడు......ఎనకాల నుండి" పొటాషియం,పొటాషియం"’ ..అని చెప్పేవాడు.
అలా ఎనకాల నుండి పొటాషియం,పొటాషియం.... అని చెప్పడమే" ప్రేమ" అని నాకప్పుడు తెలీదు.
మా సుబ్బారావ్ గారు నా బుళ్ళి చేతుల పై కొట్టినప్పుడల్లా ఈశ్వర్ కళ్ళల్లో కన్నీళ్ళు .......
ఇక్కడ దెబ్బల ప్రయోగానికి, అక్కడ కన్నీళ్ళ రియాక్శనే, "ప్రేమ" అని నాకప్పుడు తెలీదు.
****************************************************
ఎలా తెలుస్తుంది మీరే చెప్పండి?......అప్పుడు "గంగోత్రి" లాంటి....సినిమాలు తీయాలనే ఆలోచన ఒక్కరికన్నా రాలేదు..
ఎంతటి బాధాకరమైన విషయమిది....మీరే చెప్పండి.
అసలప్పుడే "గంగోత్రి" సినిమా వచ్చుంటే నేను,ఈశ్వర్ కూడా కాజిపేట... రైల్వేస్టేషన్ లో...కూ..కూ...కూ..
చికుబుకు....చికుబుకు....చికుబుకు...చికుబుకు..
రైలుబండి....రైలుబండి.....అని సాంగ్ సింగుకునేవాళ్ళం....ప్రేమ రైలుబండి ఎక్కేసేవాళ్ళం...కానీ
ఆ ప్రేమ రైలు కూడా మిస్సయ్యా.....ఇంక.. నాకు ఏం మిగిలింది నా తుస్సు తుపాకి....
ఇదంతా ప్రేమ అని ఇప్పుడు తెలిసేసరికి "ఈశ్వర్ ఈమానమెక్కి ఈదేశాలకు"ఎళ్ళిపోయాడు....
*********************************************
బ్లాగుమిత్రులారా!!!......ఇంకా వీటన్నింటినీ మించిన విశాద సంఘటన.. ఒక్కటున్నది.....
మా స్కూల్లో "రాఖీపూర్ణిమ" కి ఒక్క రోజు ముందుగా ABVP,SFI అన్నయ్యవాళ్ళు వచ్చేవారు...
అందరికీ "ఎర్ర రంగు దూది" రాఖీలు ఇచ్చి....మా క్లాస్ "అబ్బీలకు" కట్టమనేవారు...
ఊరికే కట్టమంటే అయిపోయేది కదా... కాని వాళ్ళు మాతో "ప్రతిజ్ఞ" చేయించేవారు...
అదేంటో... చిన్నప్పటినుండి ,నేను ఏదైనా "ప్రతిజ్ఞ" ఒక్కసారి చేసానంటే ఇక అంతే.....
ఆ "ప్రతిజ్ఞ" ఏంటంటే........నువ్వు నాకు రక్ష..నేను నీకు రక్ష..మనమిద్దరము కలిసి ఈ దేశానికి రక్ష...
ఇలా నా చేత రక్ష..రక్ష..అంటు.."ప్రతిజ్ఞ"చేపించి... అనవసరంగా వారిపై,నాకు.. కక్ష పెంచుకునేలా చేసారు..
ఇలా నా చేత బలవంతంగా ప్రతిజ్ఞ చేయించి నా "సెవ్వులో పువ్వేట్టేసారు."..
ఇంక ....నాకేం మిగిలింది నా తుస్సు తుపాకి.....స్కూల్లో అంతా అన్నయ్యలే.....
పోనీ కాలేజ్ లో చూసుకుందాం అనుకుంటే......ఈ మాయదారి ABVP,SFI అన్నయ్యలు...అక్కడికి కూడా వచ్చేవారు..
ఇక కాలేజ్ లో కూడా అందరూ ....అన్నయ్యలే........
*********************************
మరొక విషయం ఏంటంటే .....నాకు చాలా అన్యాయం జరిగిపోయింది....
చిన్నప్పుడు "ప్రార్థన" చేసేప్పుడు ... కొన్ని జాగ్రత్తలు "పాఠించమని" ఎవరూ నాకు చెప్పలేదు...
చెప్పి ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో........
రజినికాంత్ అంకుల్ లా ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అనే బాపతు కాదు..ఈ మీనాక్షీ అంటే...
ఈ మీనాక్షీ ఒక్కసారి సెప్తే లెక్కేట్టుకోడానికి ఈల్లేనన్ని సార్లు సెప్పినట్టు....
ఇంకేముంది అంత అయిపోయింది...
"ప్రతిజ్ఞ" చేసేసా.....అదేంటంటే......
భారతదేశం నా మాతృభూమి....భారతీయులంతా నా "సహోదరులు"....అని
అప్పుడే..... ఓసి మీనాక్షీ... భారతీయులంతా నా సహోదరులూ అనేప్పుడు....
బ్రాకెట్లో ఒక్కరు తప్ప..అని పెట్టుకోవే అని చెప్పేవారే కరువయ్యారు.......
ఇంకా నాకేం మిగిలింది నా తుస్సు తుపాకి.....
***********************************
...ప్చ్..ఏం చేస్తాం చెప్పండి...అంతా నా తలరాత....
ఆ రోజు నేనలా చెయ్యకుండా ఉంటే ఈ రోజు ఇలా ఉండేదా...నా పరిస్థితి...
భారతదేశం లో ఉన్న అబ్బీలంతా మన చుట్టే తిరిగేవారు.
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే....మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే..
మీనా ....నా హృదయ వీణా ......అనో...నేను కోపంగా ఉంటే...బంగారు కళ్ళా బుచ్చమ్మో....చెంగావి చెంపా లచ్చమ్మో...
కోపం లో ఎంతో ముద్దమ్మో...ఓ బుంగమూతి సుబ్బమ్మో....అని పాడే వాళ్ళు ఎంతమందో నా కోసం...
*****************************************
బ్లాగ్ మిత్రులారా నాకు తెలుసు నా ఈ హృదయవిదారకమైన గాధ విని ..మీ కన్నీళ్ళు ఆగడం లేదు...అని
plz...ఏడవకండి.....మీరు ఈ కథ చదివి ఏడిస్తే ..మీ భార్య కొట్టిందేమో అనుకుంటారు....మీ పక్కవాళ్ళు...
"అమ్మీలూ’’ మీరు కూడా ఏడవద్దు plz..వచ్చేసారి "రుమాల్లకి" బదులు "స్పాంజిలు"తెచ్చుకోగలరని మనవి..
నా ఈ బాధ విని మీ కన్నీళ్ళు తుడుచుకుని..తుడుచుకుని...మీ చేతులు నొప్పెట్టి ఉంటాయి...స్పాంజ్ అయితే
చాలా వీజి గా కళ్ళు తుడుచుకుని పిండేసుకోవచ్చు........అన్నట్టూ బకెట్లు మరవకండి..
****************************************
ఇంత బాధ లోనూ....గుండెను దిటవు చేసుకున్నా....ఎందుకంటే ..ఎవరైనా మేరే పాస్ గాడి హై..
పైసా హై...బంగ్లా హై...బాయ్ ఫ్రెండ్ హై..తేరే పాస్ క్యా హై..క్యా హై.. అంటే....
మేరే పాస్" బ్లాగ్ హై బ్లాగ్ హై" అని అంటా....
ఇక ఉంటాను.....మీ బ్లాగే మీనాక్షీ......

Friday, June 20, 2008

ఓర్పుకు ప్రతీక....... !!!.....


కోపానికి బధ్ధ శత్రువు ఓర్పు.ఓర్పు కి ప్రతీక సాలెపురుగు.
గదిలొ ఒక మూల.....,,
నిశబ్దంగా ఓర్పుగా,ఒంటరిగా
అది గూడు కట్టుకుంటుంది.
ఎవరిని సహాయం అడగకుండా,,
ఎవరినీ బాదించకుండ
తన.... నుంచి తాను విడివడుతూ
తనని తాను త్యాగం చేసుకుంటు,పోగు తరవాత పోగు
గొప్ప ఏకాగ్రతతో ఒక శిల్పి చెక్కినట్టు
గొప్ప నైపుణ్యంతో ఒక వైద్యుడు నరాల్ని ముడులు వేసినట్టు,
తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది.
******************************
అంతలో...........
ఒక హడావుడి ఉదయాన్నో,
నిశబ్ద సాయంత్ర సమయాన్నో,
గోడమీది నుంచి పెద్ద శబ్దంతో వచ్చిన చీపురుకట్ట,
ఒక్క వేటుతో దాని శ్రమంతా సమూలంగా తుడిచి పెట్టేస్తుంది.
సర్వనాశనమైయిపోయిన సామ్రాజ్యంలోంచి,
సాలెపురుగు అనాధలా నేల మీద పడుతుంది.
ఎవరినీ కుట్టదు.
ఎవరి మీదా.... కోపం ప్రదర్షించదు.
మళ్ళీ తన మనుగడ కోసం,
కొత్త వంతెన నిర్మించుకోవడానికి,
సహనమనే పోగుల్ని....
నమ్మకం....అనే... గోడల మీద తిరిగి స్రవిస్తుంది.
ఎలా బ్రతకాలో... మనిషి కి పాఠం చెబుతుంది.
******************************
బ్లాగు మిత్రులకు ఒక మనవి....
ఇది నేను రాసింది కాదు...

Tuesday, June 10, 2008

నేనూ గొప్ప చిత్రకారినినే.......


ఈ టపా ద్వారా నేను మీ అందరికి కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను...........
లోకం లో ఎక్కడ చూసినా ,పక్షపాతం ,పక్షపాతం..పక్షపాతం..........

********************
అవి నేను స్కూల్లో చదువుతున్నట్టు నటించే రోజులు......(మీ ఇంట్లో టార్టాయిస్ కాయిల్స్ ఉంటే కాస్త వాటిని చూస్తు..చూస్తూ నా ఫ్లాష్ బాక్ లో కి వెల్లగలరని మనవి.....).....
అందరికి స్కూల్ లైఫ్ హాయిగా గడిచిపోదు........ఉదాహరనకి నా లాంటి వాల్లకి....
"మనసంతా నువ్వే" సినిమా లో లా నా లైఫ్ లో అలాంటి హిరో లు కూడా లేరు.......ఎప్పుడైనా "తూనీగా...తూనీగా"......అని పాడుకుందామన్న.......
కాని మా ఇంటి పక్కన సంతోష్ ఉండేవాడు.(పొట్టోడు,నేను ముద్దుగా అలాగే పిలిచేదాన్ని,ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు...)
ఇక వాడితో తూనీగా...తూనీగా...పాడడం సంగతి పక్కకి పెడితే ...గాడిదా..,దున్నపోతా..కోతి...నక్క..కుక్క...అని తిట్టుకోవడాలు ఎక్కువగా ఉండేవి...అయినా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.....ఎందుకంటే మా ఇద్దరికి మ్యాథ్స్ రాదు......
"ఒకే రకానికి చెందిన పక్షులు ఒకే చోటుకి చేరతాయన్నట్టు" మేము కూదా ......ఒకే నోట్స్ లో చూసి మ్యాథ్స్ చేసేవాల్లం.
కష్టపడి ఇద్దరం కలిసి మ్యాథ్స్ చేసేవాల్లం.(అంతా అబద్దం......లత నోట్స్ చూసి చేసెవాల్లం..)
*****************
సంతు,లత,నేను బెస్ట్ ఫ్రెండ్స్.....
లత చాలా క్లెవర్.మనం కూడా అన్నింట్లో క్లెవర్ ,ఒక్క చదువులో తప్ప.....
మా క్లాస్ లో 2 సెక్షన్స్ ఉండేవి.
ఒకటి "ఏ",రెండవది "బి"."ఏ" సెక్షన్ లో కాస్త తెలివి ఎక్కువైన వాల్లను,"బి" సెక్షన్ లో కాస్త తెలివి తక్కువైన వాల్లను చేర్చేవాల్లు,మా టీచర్స్.(అంతా వారి భ్రమ).
మీ అందరికి నేను ఏ సెక్షనో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ..........చెప్తా..చెప్తా.
దేవుడి దయ వల్ల మనకి కాస్త అతిక తెలివి+ తెలివితక్కువ=??? కదా....అందుకని..మా అతిక తెలివి టీచర్స్ నన్ను "ఏ"సెక్షన్ లో వేసారు.మనకి కాస్త గణితం లో పాండిత్యం తక్కువ.ఇక మిగతా...సబ్జెక్ట్స్ అన్నీ........అమ్మో నేను చెప్పను...."గొప్పవాల్లు ఎప్పుడు సొంత డబ్బా కొట్టుకోరు"...అని ఒక బుక్ లో చదివాను...
అలా....అలా హాయిగా,ఆటపాటలతో సాగిపోతున్న నా జీవితం లోకి హఠాత్తుగా ఒక తుఫాను వచ్చింది.......(ప్లీజ్ ప్లే ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.)

*****************
ప్రతీ రోజు లానే ఆ రోజూ స్కూలు కి వెల్లాను.స్కూల్లో ప్రేయర్ చేస్తుంటే ఒక కొత్త మొహం కనిపించింది.
ఆ........ ఎవరో లే అనుకున్నా.....
కాని..కాని..కాని...కాని........
అప్పుడు నాకు తెలీదు ఆ మొహమే నా మొహం పై నవ్వులు లేకుండా చేస్తుందని.
అంతలో మా బట్టగుండు హెడ్మాస్టర్ వచ్చి..ఒక అనౌన్స్మెంట్ చేసాడు..........
పిల్లకాయల్లారా ఈ రోజు మీకు కొత్త సోషల్ టీచర్ రాబోతున్నారు అని....
అంతే ఇక అందరం సైలెంట్ గా అయిపోయాము.(కొత్త వాల్ల ముందు ఆ మాత్రం నటించక పోతే ఎలా....???)
అదేంటో గాని చిన్నప్పటి నుండి...నాకు కాస్త "కలాపోసన" ఎక్కువే........
ఈ సమాజం,మా పెద్దవాళ్ళు...నాలో ఉన్న ప్రతిభను గుర్తించలేదు..........ఎప్పుడు చదువు...చదువు..చదువు...
లేకపోతే నేను ఇక్కడ ఉండాల్సిన దాన్నా...కాదు...
అభిషేక్ లు,షారుఖ్ లు...హ్రిథిక్....వీల్లంతా మన కోసం లైన్ కట్టాల్సిన వాల్లే...
మేడం మీనాక్షి గారు నాతో నటించండి నాతో నటించండి అంటూ...మా గేట్ ముందరే ఉండేవాళ్ళు...
పాపం వాల్లకు దేవుడు అంత అదృష్టం రాసి పెట్టలేదేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు...
******** ******** ********
చిన్నప్పటినుండే ..అంటే మా అమ్మ బొజ్జలో ఉన్నప్పటి నుండే నాకు నటన అబ్బింది....
"పువ్వు పుట్టగానే పరిమలిస్తుంది" అన్నట్టూ నేను కూడా, పుట్టీ పుట్టగానే ,నటించడం మొదలెట్టా..........
నా నటనను డాక్టర్ అంకుల్ దగ్గరే ప్రదర్శించా.......
పిల్లలంతా పుట్టగానే ఏడూస్తారంటా...కాని మీనాక్షి కి నవ్వడం,నవ్వించడం తప్ప ఏడుపు రాదే....
నన్ను బొజ్జలో నుండి తీయగానే ....ఎలాంటి చడి.చప్పుడు..లేకుండా...అలాగే పడుకున్నా.
పాపం డాక్టర్ అంకుల్ ఒకటే కంగారు పడిపోయారు....
నేను మాత్రం ,మీనాక్షి భలే నటిస్తున్నావే షభాష్ అనుకున్నా.కొద్దిసేపు వాల్లను అలాగే టెన్షన్ పెడదామనుకున్నా....
కానీ ఒక నర్స్ ఆంటీ గా...ట్టిగా గిల్లింది.........అంతే పిట్ట కొంచెం ..కూత ఘనం అన్నట్టు..ఏడవడం స్టాట్ చేసా..........
వాఆఆఆఆఆఆఆఆఆఆ..............
ఆ ఏడుపు ఎంత దూరం వినిపించిందంటే,ఎక్కడో ఆపరేషన్ థియేటర్ కి దూరంగా ఉన్న
మా..నాన్న,పెద్దమ్మ,పెద్దనాన్న,పిన్ని,చిన్నపిన్ని,మావయ్య,మా అత్తయ్య.......అందరూ ఒకేసారి పరుగెత్తుకొచ్చారు...
అంతలో నర్స్ ఆంటీ వచ్చి...చాలా సంతోషం మీకు అమ్మాయి పుట్టింది...అని చెప్పింది.....కొంచెం సేపైతే భయపడ్డాం ...పాప కి ఎమైందో అని ....చెప్పింది...
అంటే మన నటనా పఠిమ ఎట్టిదో మీ అందరికి తెలిసిందనుకుంటా...
ఇక అసలు విషయానికి వద్దాం...
************************
మా కొత్త సోషల్ టీచర్ క్లాస్ లోకి ఎంటర్ అయ్యారు.
వారిని చూసాకే తెలిసింది...అప్పుడప్పుడు భగవంతుడు భూమి పైకి కొందరిని పంపిస్తుంటాడు..వాల్లే అవతారపురుషులని.....
ఇక పరిచయ కార్యక్రమం మొదలైంది......
***** ***** *****
ఆయన పేరు సుబ్బారావు గారు.
మా పేర్లన్నీ అడిగి తెలుసుకున్నారు.
అదేంటో మా టీచర్స్ అంతా స్వాతి, అనే అమ్మాయిని ఇష్టపడేవారు.....తను మా క్లాస్ ఫస్ట్.....కొంచెం నత్తి+కొంచెం సుత్తి+కొంచెం పొట్టీ కాని చాలా అందంగా ఉండేది.చాలా పొగరు కూడా.
ఈ సుబ్బారావ్ గారు కూడా స్వాతి కి ఫ్యాన్ అయిపోయారు.....
***** **** ***** ***** *****
ఇక సుబ్బారావ్ గారి, గురించి సెప్పాలంటే అయబాబోయ్ మాటలు సాలవండి.......
అబ్బబ్బ..బ్బ,,బ్బ...బ్బ..బ్బ...అసలు వర్ణించలేమండి.....
1.ఆయనది గుండ్రటి ఫుట్బాల్ లాంటి ఫేసు
2.తలపైన కొన్ని పోచలు మాత్రమే మిగిలున్నయి.అర ఎకరం అప్పటికే మటాష్.
3.ఆయనగారి, ముక్కు ని దేనితో పోల్చాలో అర్దం కావట్లేదు...అదో మాదిరిగా ఉండేది...లావుగా. చంద్రశేఖర్ రావ్ ముక్కు లా ఉండేది అచ్చంగా.
4.ఆయనకో ప్యాంట్.దాన్ని 2 నిమిషాలకోసారి పైకి లాక్కోవడం....అది జారినా....జారకపోయినా..
5.షోలే సినిమాలో ని గబ్బర్ సింగ్ అంకుల్ లాంటి నవ్వు.(గబ్బర్ సింగ్ అంకులే కాస్త నయం ఆయన కన్నా.)
**** **** **** **** *****
యురేకా..యురేకా...మొదటిరోజే ఒక విషయం కనిపెట్టా..అదేంటో తెల్సా..ఈ సుబ్బరావ్ గారి ఇంట్లో వారానికి ఒక పౌడర్ డబ్బా ఢమాల్....
అంత పౌడర్ వేసుకొచ్చారు మరి...ఇంకా ఆ వెడల్పాటి నుదిటి పైనా ముందుగా చందనపు బొట్టు...తరవాత దాని మధ్యలో కంకుమ బొట్టు..గుండ్రంగానూ...వీటికి పైనా సాయిబాబ బొట్టు అడ్డంగానూ...పెట్టారు .....ఆయన గారి మొహం మండ ప్లేస్ ఉంటే ఇంకా ఎన్ని పెట్టేవారో...(బొట్లరాయుడు.గారు.)
******** ********** **********
సుబ్బారావ్ గారు ,లెస్సన్ చెప్పటం స్టాట్ చేసారు ...
ముందుగా జేబులో నుండి ఒక పేపర్ తీసారు ..
వాటిని చదవడం బోర్డ్ పై రాయడం......
వాటిని చదవడం బోర్డ్ పైన రాయడం.....
వారి రాత బ్రహ్మ రాత..వారి క్కూడా..తెలీదు...వారి బాబుక్కూడా తెలీదు...
ఇంక బుడ్డి..బుడ్డి పిల్లలం మాకెలా తెలుస్తుంది..
వారు రాసిన వన్నీ నోట్ చేసుకోవడం మా పని...
ఇందులో ఈయన చెప్పేదేముందబ్బా అనుకున్నా...
***** ****** ******* ******
ఈ సుబ్బారావ్ గారి దయ , వల్ల మెల్లిగా మెల్లిగా నా జీవితం లో ని సంతోషమంతా సెంట్ బాటిల్ లోని సెంట్ లా ఆవిరైపోసాగింది...
అయినా సరే ఓపిక పట్టాను.కాని ..కాని..ఆయన ఆగడాలు మరీ మితిమీరిపోయాయి....
ఎగ్జామ్స్ లల్లో స్వాతి ,కొన్ని ఆన్సర్స్ రాయకపోయినా మార్క్స్ వేసేవారు....
ఇంక తనకి చాక్లెట్స్,నోట్బుక్స్,పెన్స్,బుక్స్ కి కవర్స్ కూడా కోనిచ్చేవారు...అంత వరకూ బాగానే ఉంది...
కాని....అప్పుడప్పుడు మా స్కూల్లో జరిగే సాంగ్స్,డాన్స్..కాంపిటీషన్స్ లో కూడా తనకే ప్రైజ్ వచ్చేలా చేసేవారు.
నేను ఎంత బాగా పాడినా నాకు మాత్రం ఫస్ట్ ప్రైజ్ రాకపోయేది.ఆయన గారి దృష్టిలో స్వాతి ఒక గులాబి పువ్వు,మేమంతా గొంగలి పురుగులం.
ఎండలో నిలబెట్టడం,వేల్ల మధ్యన పెన్ పెట్టి వత్తడం,ఒంగో బెట్టడం,రూల్ కర్రతో వాతలు పడేలా కొట్టడం....ఇలాంటి punishments ఇచ్చే వారు.
సుబ్బారావ్ గారి, ఈ చేష్టల వల్ల నాలో అంత చిన్న వయసులోనే "విప్లవ భావాలు" చెలరేగాయి...
****** ******** ********** ********
కానీ ఏమి చేయలేకపోయాను.......
నేను" విప్లవం" అని అంటే ...నా వెనకాల నిలబడి.."వర్ధిల్లాలి"... అని అనడానికి అరవాడానికి...మా తొట్టిగ్యాంగ్ ఫ్రెండ్స్ ఎవరూ సహకరించలేదు......
నాకు అప్పుడే ఎవరైనా సహకరించి ఉంటే నేను ఈ పాటికే
"ఒసేయ్ రాములమ్మా"సినిమా లోని "విజయశాంతి ఆంటీలా" లేక ఏ నక్సలైట్ల లోనో ఉండేదాన్ని.
ఈ పాటికే మీరందరు కూడా నన్ను అప్పుడప్పుడు పేపర్స్ లో చూసేవారు....
ఈ సమాజం నన్ను ఒక గొప్ప" విప్లవ నాయకురాలిగా" కూడా ఎదగనివ్వలేదు....
***** ****** ***** *****
ఒక రోజు మాములూ లాగానే స్కూల్ కి వెళ్ళాను.ఇంక మా ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు....స్కూల్ అంతా నిర్మానుష్యంగా ఉంది అంతలో నాకు ఒక ఆలోచన తట్టింది.
వెంటనే ఒక చాక్పీస్ తెచ్చి గోడపైనా ఒక బొమ్మ వేసాను...(నాకు డ్రాయింగ్ అంటే ఇస్టం).
బొమ్మ వేసాక పాపం దానికి పేరు పెట్టకుంటే అది బాదపడుతుంది కదా అని దానికి "కొండముచ్చు" అని పేరు పెట్టాను.(ఆ బొమ్మ ఎవరిదో మీరంతా ఊహించే ఉంటారు..)
***** ****** ********
అందరం లంచ్ చేసాక కాసేపు అలా బయటికి వెల్లి ఆడుకుంటున్నాము.......అంతలో (మా సీనియర్)
ఒక అక్కయ్య,హేయ్.... ఈ రోజు గోడపై బొమ్మ చూసారా అని అడిగింది.అందరూ చూడలేదు అని చెప్పారు.
అందరూ తప్పకుండా చూడండీ ,ఎవరూ వేసారో కాని అదిరింది అంది.(మా స్కూల్లో సుబ్బారావ్ గారంటే ఎవరికీ నచ్చదు).
అంతే ఇక సంతోషం తట్టుకోలేకపోయాను.ఏదో గొప్ప ఘనకార్యం చేసి "గిన్నిస్ బుక్ "లో ఎక్కినట్లు ఫీల్ అయిపోయా........
ఆ బొమ్మ వేసింది నేనే,ఆ పేరు రాసింది నేనే,అది నేనే,నని చెప్పబోయాను.
కాని మా ఫ్రెండ్ లత నన్ను ఆపేసింది.వద్దు,వద్దు తరవాత ప్రాబ్లం అవుతుంది అని.
కాని నా చిట్టి పొట్టలో ఏది దాగదు.అంతే ఇక నిజం చెప్పేసా.ఆ బొమ్మ వేసింది "నేనే" అని.
కాని నేను ఒక విషయం మరిచాను.....
అదేంటంటే....ఆ సుబ్బారావ్ గారికి మాలో జరిగే ఈ "లూజ్ టాక్" ని క్యారీఆన్ చేసే "బూట్లీకర్స్ "ఉన్నారని.....
***** ****** *********
2,3 రోజులయ్యాక సాయంత్రం 4.36 నిమిషాలకు ఆ సుబ్బారావ్ గారి,నుండి నాకు పిలుపు వచ్చింది......అంతే ఇక ,మిగతా ఫ్రెండ్స్ అంతా మీనాక్షి నువ్వు అయిపోయావ్..అయిపోయావ్ అని అనడం స్టాట్ చేసారు.
లత,సంతు కి నాకు ఏం జరుగుతుందో అని భయం పట్టుకుంది...
ఇద్దరు కలిసి నువ్వు ఇలా ఎందుకు చేసావ్ అని తిట్టడం ప్రారంభించారు.
అందరి గండెల్లో రైల్లు పరిగెత్తించే...నా గుండెల్లోనే "కృష్ణా,గోదావరి,గోల్కొండా,ఇంకా ఏవేవో ఎక్స్ప్రెస్ లన్ని పరుగెత్తసాగాయి.
లత కి,సంతు కి భయపడకండి నాకు ఏమి కాదు అని...చెప్పాను..కాని నాక్కూడా లోలోపల భయం వేస్తూనే ఉంది.
కాని అలాంటి సమయం లోనే " గుండె గట్టిగా చేసుకోవాలని",లోపల భయం వేస్తున్న "వేయనట్టు నటించాలని" ఏదో విప్లవకారుల బుక్ లో చదివాను.
****** ******* *******
మెల్లిగా చిన్నబోయిన ,అమాయక మొహంతో ఆయన దగ్గరికి వెళ్ళాను.
(ఆ సీన్ లో భలే నటించాను.ఆ పాత్ర లో జీవించాను.)
గుడీవినింగ్ సర్ అని నేనే విష్ చేసాను.
మీనాక్షి ఇప్పుడు ఇక్కడ జరిగే విషయాలు ఎవ్వరితో చెప్పవద్దు....అన్నారు..సరే అని తలూపాను.
నేను కొన్ని ప్రశ్నలు ,అడుగుతాను...ఆన్సర్స్ చెప్పు అన్నారు.
1.నా బొమ్మ గోడపైన ఎవరు వేసారు అన్నారు.....????
ఆ మాట విన్న నాకు భయం పోయి "ముక్కాలా...ముక్కాబులా...లైల ...లైల"....అనే పాట వేసుకుని డాన్స్ చేయలనిపించింది.
ఆ రోజుల్లో ఆ పాట చాల ఫేమస్.
కొంచెం తేరుకుని...("అది ఆయన గారి బొమ్మా అని ఆయన గుర్తు పట్టారు, అంటే నేను ఎంత బాగా వేసానో మీరే ఊహించండి.")
నేనా సర్...బొమ్మా...సర్???
ఎక్కడ సర్....ఎవరిది సర్..???
అని అన్నాను..లేని అమాయకం తెచ్చిపెట్టుకుంటూ.
అసలు నాకు డ్రాయింగ్ రాదు సర్ అన్నాను...???
ఆయన గారు నా రైటింగ్ చెక్ చేసారు........
ఇక్కడ నేను దొరికిపోయాను అని మీరనుకుంటే మీరంతా "గడ్డ పెరుగులో కాలు వేసినట్టే"....హ..హ..హ...హి..హి..హి....
ముందు జాగ్రత్తగా గోడపైన "కొండముచ్చు" అని వంకర..టింకరగా రాసా...
(అంత చిన్న వయసులోనే నాకు ఎంత ముందు చూపు ఉందో చూడండి.)
"మీనాక్షి, కో పకడ్ నా ముష్కిల్ హి నహి ,నా ముం కిన్ భి హై".
******* ******** ********
నేను మాత్రం ఆయనకి దొరకలేదు..చిక్కలేదు.....
అయినా ,ఆయన దగ్గర నన్ను పట్టుకోవడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు.
హమ్మయ్య అనుకున్నాను.
అయినా సుబ్బారావ్ గారు ఒక పెద్ద"Ollu ka pattha gaaru"అని నాకు అర్దమైంది.
లేక పోతే మరేంటి...ఎవరైనా దొంగను పట్టుకుని ఒరేయ్ నువ్వు దొంగతనం చేసావా అంటే వాడు ఒప్పుకుంటాడా....మీరే చెప్పండి....???
ఎలాగైతేనేం పెద్ద ప్రమాదం లో నుండి బయటపడ్డాను...
******** ********* ********
ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ....ఎప్పుడూ కూడా ఎవరి పైనా "partiality"చూపించకూడదని.....
ముఖ్యంగా.......పిల్లల విషయం లో అలా చేస్తే అది వారి చిన్నారి మనసుపై చాలా ప్రభావాన్ని చూపుతుంది...
చిన్నపిల్లలనే కాదు..ఎవరైనా సరే......
ఎవరి పైనా "partiality"ని చూపకండి.

Thursday, June 5, 2008

ఏయ్ క్యా బోల్తి తూ............???

మా కాలేజ్ లో అబ్బాయిలు ,అమ్మాయిలను ప్రపోజ్ చేసినపుదు నేను
విన్న సమాధానాలు.
1.ఏంటి......???
2.ఛీ.......నీకసలు బుద్ధుందా???
3.నువ్వు నా గురుంచి ఇలా ఆలోచిస్తావా...?
4.మనమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే...
5.నేనెప్పుడు నిన్ను ఆ ద్రుష్టితో చూడలేదు.
6.ఐ అం సారీ ...నేను ఆల్రెడీ అశ్విన్ ని లవ్ చేస్తున్నాను.
7.ఒరేయ్ .....వెధవా.
8.ఆర్ యూ జోకింగ్...???
9.చెప్పు తెగుతుంది...
10.నీకు అసలు నా గురించి ఏం తెలుసు...?
11.ఐ థింక్ ఇట్స్ జస్ట్ అట్రాక్షన్.
12.ఒల్లు ఎలా ఉంది..???
13.నాకు లవ్వు,గివ్వు అంటే పడవు.
14.మా మమ్మీ ని అడిగి చెప్తాను...(అమ్మ కూచీ..)
15.నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను...
16.ఈ మాట చెప్పడానికి ఇంత టైం పట్టిందా..???
17.అవునా....? కానీ నేను నిన్ను ఒక బ్రథర్ లా చుసాను.
18.నాకలాంటి ఉద్దేషం లేదు.
19.ఆర్ యూ గాన్ మ్యాడ్......???
20.సారీ.....?
21.నాకు తెలుసు నువ్వూ నన్ను ప్రేమిస్తున్నావని...
22.ఒరేయ్ నీ ఫేస్ ఎప్పుడినా అద్దం లో చూసుకున్నవా...???
23.నేను పోయిన సంవత్సరం నీకు రాఖీ కట్టను కదా...???
24.నువ్వు చాలా లేటె చేసావ్.....ముందే చెప్తే ..ఆలోచి.....
25.ఐ టూ లవ్ యూ.
26.నాకు ఈ మధ్యే ఎంగేజ్మెంట్ అయిపోయింది....
27.నాకు కాస్త టైం ఇవ్వు.
28.హేయ్ నీకు ఏమైనా పిచ్చి పట్టిందా.?
29.ఆర్ యూ గాన్ మ్యాడ్....???
30.నీకెంత ధైర్యం ...నాతో ఇలా చెప్పడానికి...?
31.గాట్టి...గా చెంపదెబ్బ....(ఊహించుకోండి..)
32.యూ స్టుపిడ్,ఇడియట్,రాస్కెల్....
33.నేను మన సీనియర్ సీను ని లవ్ చెస్తున్నాను.
34.అసలు నువ్వు ఏం మట్లాడుతున్నావ్...?
35.నేనెప్పుడు నీ గురించి అలా ఆలోచించలేదు.
36.అమ్మో....మా ఇంట్లో వాల్లు చంపేస్తారు...
37.ఏంటి....???
38.మల్లీ ఎప్పుడు ఇలా మాట్లాడకు....
39.ఎప్పటినుంచి.???
40.మరీ ,నీకు ,స్వాతీ కి అఫైర్ ఉందని విన్నాను....?
41.సారీ ,నేను మీ తమ్మున్ని లవ్ చెస్తున్నాను.
42.ఐతే చెయ్ ...నాకు నో ప్రాబ్లం.
43.మరీ షాది ఎప్పుడు...???
44.తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే, ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు...???
45.వెధవల్లార...మీకెప్పుడు ఇదే పనా?
46.ముందు లైఫ్ లో సెటిల్ అవ్వు...
47.మా ఇంట్లో వాల్లతో మాట్లాడు.
48.దీప్తీ నిన్ను లవ్ చేస్తుంది....నీకు తెలుసా..???
49.ఠీక్ హై లైన్ మే ఖడే రహొ....
50.వచ్చే వారం నా పెల్లి.....(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకొండి.....)
51.మాది చాల సాంప్రదాయకుటుంబం....
52.నాకు ప్రేమ మీద నమ్మకం లేదు..
53.నాలో ఏం చూసి లవ్ చేసావ్....???
54.చిన్న నవ్వు నవ్వి వెల్లిపోవడం....
55. నువ్వు నాకీ ప్రేమిస్తున్నదా ,మా బయ్యా కి చెప్తా.(ముస్లిం పిల్ల)

మరి మీరు ఎవరికైనా చెప్పారా.....???

చెప్తే మీకు ఏ సమధానం వచ్చింది......???

Friday, May 30, 2008

బ్లాగుకు శ్రీకారం...!!!
ఈ బ్లాగులన్నీ చదువుతుంటే నాకూ రాయాలి అనిపించింది.
కాని అంత ధ్యైర్యం చేయలేకపోయాను.
కొందరు మహానుభావుల ప్రోత్సాహంతో ఎలాగైతేనేం నేనూ బ్లాగింగు మొదలెట్టా.
కాని ఏం రాయాలి,ఎలా రాయాలి,ఏ విధంగా రాయాలి అనే అలోచనలు నా చిట్టి బుర్రలో
చీమల్లా దూరాయి .
వారం రోజుల పాటు బాగ ఆలోచించి ...చించి...చించి...చించిన..తరవాత.
ఒక ఆలోచన వచ్చినట్లు అనిపించింది.
*************
మా ఇంట్లో ఎక్కడెక్కడో ఉన్న పుస్తకాలన్నీ తీసి దుమ్ము కూడా దులపకుండా చదవడం మొదలెట్టా.
ఇక రాత్రి,పగలు ఒకే పని పుస్తకాలు చదవడం..చదవడం......చదవడం.
ఇదంతా చూస్తున్న మా అమ్మ మాత్రం నన్ను ఇలా చదువుతుంటే చూసి ...తన కల్లను తానే నమ్మలేక పోయింది...
నా 24 క్యారెట్ల బంగారు తల్లి,ఎగ్జామ్స్ ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు చదవని నా చిట్టి తల్లి,ఇలా హాలిడేస్ లో పుస్తకాలన్నీ చుట్టూ పేర్చుకుని,కిందా మీదా పడి చదువుతుందేటబ్బ అని నివ్వెరబోయింది.....
************
మొత్తానికి పుస్తకాలన్నీ చించేసా.......
ఇప్పుడు నేను కాస్త రాయగలనేమో అనిపించింది.
సిద్ధార్థునికి భోగి చెట్టు కింద జ్ఙానోదయం అయినట్టు నాకు కొంచెం జ్ఙానోదయం అయింది.
నాకు ఏ చెట్టు కింద బల్బు ఎలిగిందో మీకూ తెలుసుకోవాలని ఉంది కదూ.
నాకు తెలుసు మీకు కాస్త జ్ఙానోదయం పొందాలని ఉందని.
చెప్పమంటారా......
అమ్మా,ఆస,దోస,అప్పడం వడ.......
సరి సరి చేప్తాను కానీ మీరు ఎవరితో చెప్పొద్దు మరి........(ష్..ష్..ష్.టాప్ సీక్రెట్.)
ఆ చెట్టు పేరు "అక్షింతలచెట్టు".
పేరు చాలా బాగుంది కదూ.
ఈ చెట్టు కింద కుచుంటే ఎవ్వరికైనా బల్బు ఎలగాల్సిందే ఎలిగి తీరాల్సిందే.
ఈ చెట్టును అచ్చ తెలుగులో "గుచ్చుకునేగడ్డి" అంటారు.
ఇప్పుడు తెలిసిందా అసలు మర్మం.
ఈ విధంగా నా జ్ఙానోదయ ఘట్టం ముగిసింది.
******************
శుక్రవారం తెల్లవారు ఝామున లెగిసి సుబ్బరంగా తలంటుకుని, పూజ గదిలో కి వెల్లాను.
దీపాలు,ఆరతి,అగారత్తులు...(అంబికా అగర్బత్తి......భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది.....అందుకే అవి ముట్టించాను....)
దేవుల్లందరికీ నేను అందరికీ నచ్చే విధనగా బ్లాగాలని మొక్కుకున్నా.
అల..దేవుల్లందరి ఆశీర్వచనాలతో బ్లాగింగ్ కి శ్రీకారం చుట్టాను.
*****************
పెన్ను,ప్యాడ్,పేపర్ మొదలైన సరంజామ సిద్ధం చేసుకున్నాను.
ఎంత సేపు చించినా ఏం రాయాలో తెలీలేదు.
ఇలా ఐతే లాభం లేదు అనుకున్నాను...
ఇప్పుడు నేను మామూలు మీనాక్షిని కాదు...బ్లాగే మీనాక్షిని కదా ...అని తెలుసుకున్నాను.
జుట్టు విరబోసి ,పెన్ను పేపర్ పై పెట్టాను.........
*****************
అప్పుడే నిద్ర లేచిన మా అమ్మ ,నా ఈ కొత్త అవతారం చూసి నివ్వెరబోయింది.
వడి వడి గా నా దగ్గరకు వచ్చి ఏంటి బంగారం ఇలా తయారయ్యావ్ అనింది.
అమ్మ ఇలా ఉంటే చదివింది బాగా వంట బడుతుంది అని చెప్పాను.....
టీ.వి చుడ్డం,మాట్లాడ్డం,చాటింగ్ అన్నీ మానేసాను...
మా అమ్మ నన్ను చూసి మురిసిపోయి జిస్టి తీయడం స్టాట్ చేసింది.....
నేను రాస్తుంది,చదువుతుంది నా సబ్జెక్ట్ కదని మా అమ్మ కి తెలిస్తే ....
జిస్టి తీయడం మాట దేవుడెరుగు నా డొక్క చించి డోలు కడుతుంది...
అయినా సరే నా ఈ డొక్క..కాస్త డోలు అయ్యే లోపు కొన్ని టపాలైనా రాస్తాను...మీ అందరి గుండెల్లో టపాసులు పేలుస్తాను.......

Thursday, May 29, 2008

గాడిదా.....అడ్డ గాడిదా.....కంచరగాడిదా...???
ఒక రోజు నేను,మా ఫ్రెండ్ కాలేజ్ అవ్వగానే ఇంటికి బయలుదేరాము.నాకంటు ప్రత్యేకంగా సొంత వాహనం ఏమి లేదు. కాబట్టి 4 చక్రాల వాహనం లో ఇంటికి వెల్లాలి అంటే బస్సులో.నాకెందుకో బస్సు ప్రయానమంటే భలేగా అనిపిస్తుంది. కొన్ని సార్లు చిరాగ్గా అనిపిస్తుంది.మా కాలేజె నండి బస్ స్టాప్ కి చాలా దూరం నడవాలి. పాపం ఎండకి నేనంటే ప్రానం.ఉన్న ఎండనంతా నా పైనే కురిపిస్తుంది. ఎందుకో దానికి నా పైన అంత ప్రేమ. నేను,మా ఫ్రెంద్ ఎదేదో మాట్లాడుకుంటూ బస్ స్టాప్ కి చేరాము. అంతలో నేనొచేస్తున్నానొచ్ అంటూ ,కొత్తపెల్లికూతురిల ముస్తాబై వచేసింది బస్. నేను ,మా ఫ్రెంద్ చక చక బస్ ఎక్కేసాము,సీటు కొట్టేసాము. ఏవేవో సుత్తి కబుర్లు చెప్పుకుంటుంటే నా కల్లు ముందరి సీటు పై పడ్డాయి.

దాని పై 3 వాక్యాలు ఇలా రాసి ఉన్నాయి.

1.ఇది చదివే వాడు గాడిద.
దాన్ని
మా ఫ్రెంద్ కి చూపించాను,ఇద్దరం కలిసి రాసిన వాన్ని తిట్టుకున్నాము.రెండవ వాక్యం ఇలా ఉంది.

2.ఇది రాసిన వాడు అడ్డగాడిద.
ఎవడో
కాని భలేగా రాసాడే అనుకున్నాము. మూడవ వాక్యం చదివాక తెలిసింది వాడు సామాన్యుడు కాడని.

3.ఇది చదవని వాడు కంచర గాడిద.
అన్నీ
చదివాక కంచర గాడిద కన్నా గాడిదే నయం కదా అనుకున్నాము.
మరి మీరేమంటారు.????...............