Tuesday, June 10, 2008

నేనూ గొప్ప చిత్రకారినినే.......


ఈ టపా ద్వారా నేను మీ అందరికి కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను...........
లోకం లో ఎక్కడ చూసినా ,పక్షపాతం ,పక్షపాతం..పక్షపాతం..........

********************
అవి నేను స్కూల్లో చదువుతున్నట్టు నటించే రోజులు......(మీ ఇంట్లో టార్టాయిస్ కాయిల్స్ ఉంటే కాస్త వాటిని చూస్తు..చూస్తూ నా ఫ్లాష్ బాక్ లో కి వెల్లగలరని మనవి.....).....
అందరికి స్కూల్ లైఫ్ హాయిగా గడిచిపోదు........ఉదాహరనకి నా లాంటి వాల్లకి....
"మనసంతా నువ్వే" సినిమా లో లా నా లైఫ్ లో అలాంటి హిరో లు కూడా లేరు.......ఎప్పుడైనా "తూనీగా...తూనీగా"......అని పాడుకుందామన్న.......
కాని మా ఇంటి పక్కన సంతోష్ ఉండేవాడు.(పొట్టోడు,నేను ముద్దుగా అలాగే పిలిచేదాన్ని,ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు...)
ఇక వాడితో తూనీగా...తూనీగా...పాడడం సంగతి పక్కకి పెడితే ...గాడిదా..,దున్నపోతా..కోతి...నక్క..కుక్క...అని తిట్టుకోవడాలు ఎక్కువగా ఉండేవి...అయినా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.....ఎందుకంటే మా ఇద్దరికి మ్యాథ్స్ రాదు......
"ఒకే రకానికి చెందిన పక్షులు ఒకే చోటుకి చేరతాయన్నట్టు" మేము కూదా ......ఒకే నోట్స్ లో చూసి మ్యాథ్స్ చేసేవాల్లం.
కష్టపడి ఇద్దరం కలిసి మ్యాథ్స్ చేసేవాల్లం.(అంతా అబద్దం......లత నోట్స్ చూసి చేసెవాల్లం..)
*****************
సంతు,లత,నేను బెస్ట్ ఫ్రెండ్స్.....
లత చాలా క్లెవర్.మనం కూడా అన్నింట్లో క్లెవర్ ,ఒక్క చదువులో తప్ప.....
మా క్లాస్ లో 2 సెక్షన్స్ ఉండేవి.
ఒకటి "ఏ",రెండవది "బి"."ఏ" సెక్షన్ లో కాస్త తెలివి ఎక్కువైన వాల్లను,"బి" సెక్షన్ లో కాస్త తెలివి తక్కువైన వాల్లను చేర్చేవాల్లు,మా టీచర్స్.(అంతా వారి భ్రమ).
మీ అందరికి నేను ఏ సెక్షనో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ..........చెప్తా..చెప్తా.
దేవుడి దయ వల్ల మనకి కాస్త అతిక తెలివి+ తెలివితక్కువ=??? కదా....అందుకని..మా అతిక తెలివి టీచర్స్ నన్ను "ఏ"సెక్షన్ లో వేసారు.మనకి కాస్త గణితం లో పాండిత్యం తక్కువ.ఇక మిగతా...సబ్జెక్ట్స్ అన్నీ........అమ్మో నేను చెప్పను...."గొప్పవాల్లు ఎప్పుడు సొంత డబ్బా కొట్టుకోరు"...అని ఒక బుక్ లో చదివాను...
అలా....అలా హాయిగా,ఆటపాటలతో సాగిపోతున్న నా జీవితం లోకి హఠాత్తుగా ఒక తుఫాను వచ్చింది.......(ప్లీజ్ ప్లే ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.)

*****************
ప్రతీ రోజు లానే ఆ రోజూ స్కూలు కి వెల్లాను.స్కూల్లో ప్రేయర్ చేస్తుంటే ఒక కొత్త మొహం కనిపించింది.
ఆ........ ఎవరో లే అనుకున్నా.....
కాని..కాని..కాని...కాని........
అప్పుడు నాకు తెలీదు ఆ మొహమే నా మొహం పై నవ్వులు లేకుండా చేస్తుందని.
అంతలో మా బట్టగుండు హెడ్మాస్టర్ వచ్చి..ఒక అనౌన్స్మెంట్ చేసాడు..........
పిల్లకాయల్లారా ఈ రోజు మీకు కొత్త సోషల్ టీచర్ రాబోతున్నారు అని....
అంతే ఇక అందరం సైలెంట్ గా అయిపోయాము.(కొత్త వాల్ల ముందు ఆ మాత్రం నటించక పోతే ఎలా....???)
అదేంటో గాని చిన్నప్పటి నుండి...నాకు కాస్త "కలాపోసన" ఎక్కువే........
ఈ సమాజం,మా పెద్దవాళ్ళు...నాలో ఉన్న ప్రతిభను గుర్తించలేదు..........ఎప్పుడు చదువు...చదువు..చదువు...
లేకపోతే నేను ఇక్కడ ఉండాల్సిన దాన్నా...కాదు...
అభిషేక్ లు,షారుఖ్ లు...హ్రిథిక్....వీల్లంతా మన కోసం లైన్ కట్టాల్సిన వాల్లే...
మేడం మీనాక్షి గారు నాతో నటించండి నాతో నటించండి అంటూ...మా గేట్ ముందరే ఉండేవాళ్ళు...
పాపం వాల్లకు దేవుడు అంత అదృష్టం రాసి పెట్టలేదేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు...
******** ******** ********
చిన్నప్పటినుండే ..అంటే మా అమ్మ బొజ్జలో ఉన్నప్పటి నుండే నాకు నటన అబ్బింది....
"పువ్వు పుట్టగానే పరిమలిస్తుంది" అన్నట్టూ నేను కూడా, పుట్టీ పుట్టగానే ,నటించడం మొదలెట్టా..........
నా నటనను డాక్టర్ అంకుల్ దగ్గరే ప్రదర్శించా.......
పిల్లలంతా పుట్టగానే ఏడూస్తారంటా...కాని మీనాక్షి కి నవ్వడం,నవ్వించడం తప్ప ఏడుపు రాదే....
నన్ను బొజ్జలో నుండి తీయగానే ....ఎలాంటి చడి.చప్పుడు..లేకుండా...అలాగే పడుకున్నా.
పాపం డాక్టర్ అంకుల్ ఒకటే కంగారు పడిపోయారు....
నేను మాత్రం ,మీనాక్షి భలే నటిస్తున్నావే షభాష్ అనుకున్నా.కొద్దిసేపు వాల్లను అలాగే టెన్షన్ పెడదామనుకున్నా....
కానీ ఒక నర్స్ ఆంటీ గా...ట్టిగా గిల్లింది.........అంతే పిట్ట కొంచెం ..కూత ఘనం అన్నట్టు..ఏడవడం స్టాట్ చేసా..........
వాఆఆఆఆఆఆఆఆఆఆ..............
ఆ ఏడుపు ఎంత దూరం వినిపించిందంటే,ఎక్కడో ఆపరేషన్ థియేటర్ కి దూరంగా ఉన్న
మా..నాన్న,పెద్దమ్మ,పెద్దనాన్న,పిన్ని,చిన్నపిన్ని,మావయ్య,మా అత్తయ్య.......అందరూ ఒకేసారి పరుగెత్తుకొచ్చారు...
అంతలో నర్స్ ఆంటీ వచ్చి...చాలా సంతోషం మీకు అమ్మాయి పుట్టింది...అని చెప్పింది.....కొంచెం సేపైతే భయపడ్డాం ...పాప కి ఎమైందో అని ....చెప్పింది...
అంటే మన నటనా పఠిమ ఎట్టిదో మీ అందరికి తెలిసిందనుకుంటా...
ఇక అసలు విషయానికి వద్దాం...
************************
మా కొత్త సోషల్ టీచర్ క్లాస్ లోకి ఎంటర్ అయ్యారు.
వారిని చూసాకే తెలిసింది...అప్పుడప్పుడు భగవంతుడు భూమి పైకి కొందరిని పంపిస్తుంటాడు..వాల్లే అవతారపురుషులని.....
ఇక పరిచయ కార్యక్రమం మొదలైంది......
***** ***** *****
ఆయన పేరు సుబ్బారావు గారు.
మా పేర్లన్నీ అడిగి తెలుసుకున్నారు.
అదేంటో మా టీచర్స్ అంతా స్వాతి, అనే అమ్మాయిని ఇష్టపడేవారు.....తను మా క్లాస్ ఫస్ట్.....కొంచెం నత్తి+కొంచెం సుత్తి+కొంచెం పొట్టీ కాని చాలా అందంగా ఉండేది.చాలా పొగరు కూడా.
ఈ సుబ్బారావ్ గారు కూడా స్వాతి కి ఫ్యాన్ అయిపోయారు.....
***** **** ***** ***** *****
ఇక సుబ్బారావ్ గారి, గురించి సెప్పాలంటే అయబాబోయ్ మాటలు సాలవండి.......
అబ్బబ్బ..బ్బ,,బ్బ...బ్బ..బ్బ...అసలు వర్ణించలేమండి.....
1.ఆయనది గుండ్రటి ఫుట్బాల్ లాంటి ఫేసు
2.తలపైన కొన్ని పోచలు మాత్రమే మిగిలున్నయి.అర ఎకరం అప్పటికే మటాష్.
3.ఆయనగారి, ముక్కు ని దేనితో పోల్చాలో అర్దం కావట్లేదు...అదో మాదిరిగా ఉండేది...లావుగా. చంద్రశేఖర్ రావ్ ముక్కు లా ఉండేది అచ్చంగా.
4.ఆయనకో ప్యాంట్.దాన్ని 2 నిమిషాలకోసారి పైకి లాక్కోవడం....అది జారినా....జారకపోయినా..
5.షోలే సినిమాలో ని గబ్బర్ సింగ్ అంకుల్ లాంటి నవ్వు.(గబ్బర్ సింగ్ అంకులే కాస్త నయం ఆయన కన్నా.)
**** **** **** **** *****
యురేకా..యురేకా...మొదటిరోజే ఒక విషయం కనిపెట్టా..అదేంటో తెల్సా..ఈ సుబ్బరావ్ గారి ఇంట్లో వారానికి ఒక పౌడర్ డబ్బా ఢమాల్....
అంత పౌడర్ వేసుకొచ్చారు మరి...ఇంకా ఆ వెడల్పాటి నుదిటి పైనా ముందుగా చందనపు బొట్టు...తరవాత దాని మధ్యలో కంకుమ బొట్టు..గుండ్రంగానూ...వీటికి పైనా సాయిబాబ బొట్టు అడ్డంగానూ...పెట్టారు .....ఆయన గారి మొహం మండ ప్లేస్ ఉంటే ఇంకా ఎన్ని పెట్టేవారో...(బొట్లరాయుడు.గారు.)
******** ********** **********
సుబ్బారావ్ గారు ,లెస్సన్ చెప్పటం స్టాట్ చేసారు ...
ముందుగా జేబులో నుండి ఒక పేపర్ తీసారు ..
వాటిని చదవడం బోర్డ్ పై రాయడం......
వాటిని చదవడం బోర్డ్ పైన రాయడం.....
వారి రాత బ్రహ్మ రాత..వారి క్కూడా..తెలీదు...వారి బాబుక్కూడా తెలీదు...
ఇంక బుడ్డి..బుడ్డి పిల్లలం మాకెలా తెలుస్తుంది..
వారు రాసిన వన్నీ నోట్ చేసుకోవడం మా పని...
ఇందులో ఈయన చెప్పేదేముందబ్బా అనుకున్నా...
***** ****** ******* ******
ఈ సుబ్బారావ్ గారి దయ , వల్ల మెల్లిగా మెల్లిగా నా జీవితం లో ని సంతోషమంతా సెంట్ బాటిల్ లోని సెంట్ లా ఆవిరైపోసాగింది...
అయినా సరే ఓపిక పట్టాను.కాని ..కాని..ఆయన ఆగడాలు మరీ మితిమీరిపోయాయి....
ఎగ్జామ్స్ లల్లో స్వాతి ,కొన్ని ఆన్సర్స్ రాయకపోయినా మార్క్స్ వేసేవారు....
ఇంక తనకి చాక్లెట్స్,నోట్బుక్స్,పెన్స్,బుక్స్ కి కవర్స్ కూడా కోనిచ్చేవారు...అంత వరకూ బాగానే ఉంది...
కాని....అప్పుడప్పుడు మా స్కూల్లో జరిగే సాంగ్స్,డాన్స్..కాంపిటీషన్స్ లో కూడా తనకే ప్రైజ్ వచ్చేలా చేసేవారు.
నేను ఎంత బాగా పాడినా నాకు మాత్రం ఫస్ట్ ప్రైజ్ రాకపోయేది.ఆయన గారి దృష్టిలో స్వాతి ఒక గులాబి పువ్వు,మేమంతా గొంగలి పురుగులం.
ఎండలో నిలబెట్టడం,వేల్ల మధ్యన పెన్ పెట్టి వత్తడం,ఒంగో బెట్టడం,రూల్ కర్రతో వాతలు పడేలా కొట్టడం....ఇలాంటి punishments ఇచ్చే వారు.
సుబ్బారావ్ గారి, ఈ చేష్టల వల్ల నాలో అంత చిన్న వయసులోనే "విప్లవ భావాలు" చెలరేగాయి...
****** ******** ********** ********
కానీ ఏమి చేయలేకపోయాను.......
నేను" విప్లవం" అని అంటే ...నా వెనకాల నిలబడి.."వర్ధిల్లాలి"... అని అనడానికి అరవాడానికి...మా తొట్టిగ్యాంగ్ ఫ్రెండ్స్ ఎవరూ సహకరించలేదు......
నాకు అప్పుడే ఎవరైనా సహకరించి ఉంటే నేను ఈ పాటికే
"ఒసేయ్ రాములమ్మా"సినిమా లోని "విజయశాంతి ఆంటీలా" లేక ఏ నక్సలైట్ల లోనో ఉండేదాన్ని.
ఈ పాటికే మీరందరు కూడా నన్ను అప్పుడప్పుడు పేపర్స్ లో చూసేవారు....
ఈ సమాజం నన్ను ఒక గొప్ప" విప్లవ నాయకురాలిగా" కూడా ఎదగనివ్వలేదు....
***** ****** ***** *****
ఒక రోజు మాములూ లాగానే స్కూల్ కి వెళ్ళాను.ఇంక మా ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు....స్కూల్ అంతా నిర్మానుష్యంగా ఉంది అంతలో నాకు ఒక ఆలోచన తట్టింది.
వెంటనే ఒక చాక్పీస్ తెచ్చి గోడపైనా ఒక బొమ్మ వేసాను...(నాకు డ్రాయింగ్ అంటే ఇస్టం).
బొమ్మ వేసాక పాపం దానికి పేరు పెట్టకుంటే అది బాదపడుతుంది కదా అని దానికి "కొండముచ్చు" అని పేరు పెట్టాను.(ఆ బొమ్మ ఎవరిదో మీరంతా ఊహించే ఉంటారు..)
***** ****** ********
అందరం లంచ్ చేసాక కాసేపు అలా బయటికి వెల్లి ఆడుకుంటున్నాము.......అంతలో (మా సీనియర్)
ఒక అక్కయ్య,హేయ్.... ఈ రోజు గోడపై బొమ్మ చూసారా అని అడిగింది.అందరూ చూడలేదు అని చెప్పారు.
అందరూ తప్పకుండా చూడండీ ,ఎవరూ వేసారో కాని అదిరింది అంది.(మా స్కూల్లో సుబ్బారావ్ గారంటే ఎవరికీ నచ్చదు).
అంతే ఇక సంతోషం తట్టుకోలేకపోయాను.ఏదో గొప్ప ఘనకార్యం చేసి "గిన్నిస్ బుక్ "లో ఎక్కినట్లు ఫీల్ అయిపోయా........
ఆ బొమ్మ వేసింది నేనే,ఆ పేరు రాసింది నేనే,అది నేనే,నని చెప్పబోయాను.
కాని మా ఫ్రెండ్ లత నన్ను ఆపేసింది.వద్దు,వద్దు తరవాత ప్రాబ్లం అవుతుంది అని.
కాని నా చిట్టి పొట్టలో ఏది దాగదు.అంతే ఇక నిజం చెప్పేసా.ఆ బొమ్మ వేసింది "నేనే" అని.
కాని నేను ఒక విషయం మరిచాను.....
అదేంటంటే....ఆ సుబ్బారావ్ గారికి మాలో జరిగే ఈ "లూజ్ టాక్" ని క్యారీఆన్ చేసే "బూట్లీకర్స్ "ఉన్నారని.....
***** ****** *********
2,3 రోజులయ్యాక సాయంత్రం 4.36 నిమిషాలకు ఆ సుబ్బారావ్ గారి,నుండి నాకు పిలుపు వచ్చింది......అంతే ఇక ,మిగతా ఫ్రెండ్స్ అంతా మీనాక్షి నువ్వు అయిపోయావ్..అయిపోయావ్ అని అనడం స్టాట్ చేసారు.
లత,సంతు కి నాకు ఏం జరుగుతుందో అని భయం పట్టుకుంది...
ఇద్దరు కలిసి నువ్వు ఇలా ఎందుకు చేసావ్ అని తిట్టడం ప్రారంభించారు.
అందరి గండెల్లో రైల్లు పరిగెత్తించే...నా గుండెల్లోనే "కృష్ణా,గోదావరి,గోల్కొండా,ఇంకా ఏవేవో ఎక్స్ప్రెస్ లన్ని పరుగెత్తసాగాయి.
లత కి,సంతు కి భయపడకండి నాకు ఏమి కాదు అని...చెప్పాను..కాని నాక్కూడా లోలోపల భయం వేస్తూనే ఉంది.
కాని అలాంటి సమయం లోనే " గుండె గట్టిగా చేసుకోవాలని",లోపల భయం వేస్తున్న "వేయనట్టు నటించాలని" ఏదో విప్లవకారుల బుక్ లో చదివాను.
****** ******* *******
మెల్లిగా చిన్నబోయిన ,అమాయక మొహంతో ఆయన దగ్గరికి వెళ్ళాను.
(ఆ సీన్ లో భలే నటించాను.ఆ పాత్ర లో జీవించాను.)
గుడీవినింగ్ సర్ అని నేనే విష్ చేసాను.
మీనాక్షి ఇప్పుడు ఇక్కడ జరిగే విషయాలు ఎవ్వరితో చెప్పవద్దు....అన్నారు..సరే అని తలూపాను.
నేను కొన్ని ప్రశ్నలు ,అడుగుతాను...ఆన్సర్స్ చెప్పు అన్నారు.
1.నా బొమ్మ గోడపైన ఎవరు వేసారు అన్నారు.....????
ఆ మాట విన్న నాకు భయం పోయి "ముక్కాలా...ముక్కాబులా...లైల ...లైల"....అనే పాట వేసుకుని డాన్స్ చేయలనిపించింది.
ఆ రోజుల్లో ఆ పాట చాల ఫేమస్.
కొంచెం తేరుకుని...("అది ఆయన గారి బొమ్మా అని ఆయన గుర్తు పట్టారు, అంటే నేను ఎంత బాగా వేసానో మీరే ఊహించండి.")
నేనా సర్...బొమ్మా...సర్???
ఎక్కడ సర్....ఎవరిది సర్..???
అని అన్నాను..లేని అమాయకం తెచ్చిపెట్టుకుంటూ.
అసలు నాకు డ్రాయింగ్ రాదు సర్ అన్నాను...???
ఆయన గారు నా రైటింగ్ చెక్ చేసారు........
ఇక్కడ నేను దొరికిపోయాను అని మీరనుకుంటే మీరంతా "గడ్డ పెరుగులో కాలు వేసినట్టే"....హ..హ..హ...హి..హి..హి....
ముందు జాగ్రత్తగా గోడపైన "కొండముచ్చు" అని వంకర..టింకరగా రాసా...
(అంత చిన్న వయసులోనే నాకు ఎంత ముందు చూపు ఉందో చూడండి.)
"మీనాక్షి, కో పకడ్ నా ముష్కిల్ హి నహి ,నా ముం కిన్ భి హై".
******* ******** ********
నేను మాత్రం ఆయనకి దొరకలేదు..చిక్కలేదు.....
అయినా ,ఆయన దగ్గర నన్ను పట్టుకోవడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు.
హమ్మయ్య అనుకున్నాను.
అయినా సుబ్బారావ్ గారు ఒక పెద్ద"Ollu ka pattha gaaru"అని నాకు అర్దమైంది.
లేక పోతే మరేంటి...ఎవరైనా దొంగను పట్టుకుని ఒరేయ్ నువ్వు దొంగతనం చేసావా అంటే వాడు ఒప్పుకుంటాడా....మీరే చెప్పండి....???
ఎలాగైతేనేం పెద్ద ప్రమాదం లో నుండి బయటపడ్డాను...
******** ********* ********
ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ....ఎప్పుడూ కూడా ఎవరి పైనా "partiality"చూపించకూడదని.....
ముఖ్యంగా.......పిల్లల విషయం లో అలా చేస్తే అది వారి చిన్నారి మనసుపై చాలా ప్రభావాన్ని చూపుతుంది...
చిన్నపిల్లలనే కాదు..ఎవరైనా సరే......
ఎవరి పైనా "partiality"ని చూపకండి.

27 comments:

  1. మొత్తానికి సినిమా నాయికా కాక...విప్లవ నాయికా కాక... బ్లాగులో మాపాలిట మీనాక్షివయ్యావన్న మాట. బాగుంది. ఇక ఓసారి నువ్వు "విప్లవం" అంటే, నేను "వర్ధిల్లాలి" అనడానికి తయార్. ఆముచ్చటా తీర్చుకుందువుగానీ. హృతిక్ రొషన్ కావాలంటే మాత్రం కష్టమే!

    కొన్ని తెలుగు టైపింగు తప్పులున్నాయ్...
    వాళ్ళు=vaaLLu
    హృతిక్ =hRutik
    ఉదాహరణకి = udaaharaNaki

    సరిచేసుకో...ఇక మిగతాదంతా సూపరో..సూపరు

    ReplyDelete
  2. చాలా బాగుంది. విషయాన్ని భలె ఈజ్ తో చెప్పుతున్నారే.
    కంగ్రాట్స్
    బొల్లోజు బాబా

    ReplyDelete
  3. కెవ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్...............మీనాచ్చీ తల్లో.....కేక పెట్టించావు."చదువుతున్నట్టు నటిస్తున్న రోజులు" అన్న దగ్గరనుండి మొదలు పెట్టాను నవ్వడం.టపా అయ్యేదాకా అలా నవ్వుతూనే వున్నాను.చివర్లో "మెస్సేజీ"ఇంకా నవ్వు తెప్పించింది.సేం టూ సేం నీ కధే నాదీను.మేమయితే మా సార్ కి ఒక ఉత్తరమే రాసేసాము కోతి బొమ్మలతో,సినిమా పేర్లతో.అది కూడా స్కూల్ అడ్రస్ కి.అవన్నీ రీలులా తిప్పావు కళ్ళ ముందు.నీకు బోలెడు థాంకులు.

    ReplyDelete
  4. అద్బుతం చలా బా రాశావ్,
    నీ నటనా కళాపోషకురాలివని Hopstital లో ఇచ్చిన ఉదాహరణ చాలా బావుంది.
    మళ్ళీ...
    విజయశాంతి, ఒసేయ్ రామలమ్మ కూడా వర్ణన కూడా నాకు చాలా నచ్చింది.
    అమ్మో బ్లాగు ఇప్పుడే మొదలుపెట్టినట్టు లేదు.
    మంచి Writing Talent ఉంది నీకు.
    చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పున తీరు చాలా బావుంది.
    బాబా గరన్నట్టు, విషయాన్ని చాలా ఈజ్ గా చెప్పెశావ్..
    మెసేజ్ కూడా బావుంది,
    any way good Going

    ReplyDelete
  5. @ మీనాక్షి
    బాగుంది... చాలా సార్లు నవ్వుకున్నాను... మరి నీలో విప్లవాగ్ని చల్లారిందా? :-) ఇంకా విప్లవం వర్ధిల్లాలి అంటున్నావా? :-)

    ReplyDelete
  6. ఏవిటో టాలెంటున్నోళ్ళను ఈ సంఘం గౌరవించదు. బ్లాగులు మాత్రం చాలా గౌరవిస్తాయ్. అందుకే బ్లాగులు రాయమని చెప్పేది.

    హాస్పిటల్ సీను మాత్రం నేను రాయాలనుకున్న దానికి మక్కీకి మక్కీ. నాదీ సేం కేస్. కాకపోతే కొంచెం డిఫరంట్. బయటికి రాంగానే పెద్ద పెద్ద గుడ్లేసుకుని నర్సును చూస్తూ నవ్వానట.

    మీనాక్షి మధుర నుండి రాకపోయినా మధురంగా రాస్తోంది. సెహ్బాషో..

    -- విహారి

    ReplyDelete
  7. చాలా బాగుంది మీ కథనం. మీ స్కూల్ విశేషాలు నాది కూడా ఒక్కటే. కాక పొతే చిన్న తేడా మీకు సోషియల్ సార్ అంటె పడదు నాకు లెక్కలు సార్ అంటే పడదు. చాలా బాగుంది, బాగ నవ్వు తెప్పించేలా వుంది. మీకు విప్లవ భావాలు ఇంకా వుంటె చెప్పండి కలసి ఒక విప్లవ సంస్థ పెట్టేద్దాం. నేను విప్లవం చిన్నప్పుడు ఒక గద్దర్ లా, ఒక కొండపల్లి సీతారామయ్యల కావాలి అని వుండేది. కాని ఏం చేస్తాం కాలం కలసి రాలెదు . నా విప్లవొద్యమం గురించి ఒక టపా వ్రాయలి అని వుంది త్వరలొ వ్రాస్తా. విప్లవం వర్థిల్లాలి, జై అ.ఆ.ఇ సంస్థ (ఇప్పుడే పెట్టాం, మీనాక్షి గారు అధ్యక్షులు నేను కార్యదర్శి.)

    ReplyDelete
  8. చాలా బాగా రాసారు. మహేష్ చెప్పినట్లు అచ్చుతప్పులు సరిచేసుకుంటే చదివేవాళ్ళకి ఇంకా బాగుంటుంది.

    ReplyDelete
  9. చాలా బాగా రాస్తున్నారు, మీరు వ్రాసే పద్దతి బాగుంది... బాగా నవ్వించారు keep it up !!!

    ReplyDelete
  10. wow too good.simply superb...
    navvinchi navvinchi champesaaranukondi.

    ReplyDelete
  11. Hi Meenu,

    Nuvvu rasina bolgu chala bavundi.Narration is super.Nee childhood days gurinchi ippatiki chala baga rasavu.Keep it up.See with some other blog

    ReplyDelete
  12. :)))))
    (నవ్వడం అయ్యాక మిగతా కామెంట్ రాస్తాను)

    ReplyDelete
  13. hi mahesh garu.thanksssssssss.
    eppudu start cheddamandi viplavam.na venaka meeru untarannamata.santhosham.
    ika hruthik monne vachi velladu,tanato natinchamani adigadu.nenu ippudu khaliga lenu.blagutunnanu.chala busy,malli eppudyna randi ani cheppanu.ha..ha..ha...ha..


    @ HI SHANTI garu.thank u,thank u,thank u.

    ReplyDelete
  14. HI AHMAD ALI garu.shukriya,shukriya,shukriya.aap hamara blog padte rahe.hame aap ke comments bhej te rahen.

    ReplyDelete
  15. @ hi RADHIKA garu.mottaniki mimmalni navvinchanu annamata.santhosham.memu kuda last lo oka letter rasamu .titlato,bommalato.
    aa chinna nati anubhavalu gurtu chesukunte navvostundi.appudappudu edupu kooda.


    @ hi ASWIN garu.thank u,thank u.inka meeku em cheppanu.idanta mee vallane kada.

    ReplyDelete
  16. చాఆఆఆఆఆఆఆఆఆఆఆఅలా బాగున్నాయి మీనాక్షి నీ టపాలు.చాలా సింపుల్‌గా... హాయిగా....కానీ నాకు చాలా చిన్ని చిట్టి పొట్టి సందేహం?ఎల గుర్తుపెట్టుకున్నావ్ నువ్వు హాస్పిటల్లో చేసిన గోల?నువ్వు చాలాఆఆఅ ఇంటెలిజెంట్ అనుకుంట.హ హ హహాహ్హాఆఆ.అందరిని తిట్టటం కూడా భలే ఈజీగా తిట్టేస్తున్నావ్‌గా?Nice Keepit up.Chala baga rasthunnav.
    నీ టాలెంట్ నాకు కూడా కొంచెం అప్పు ఇవ్వవా?

    ReplyDelete
  17. @ HI DEEPU ji.inka challaraledandi.andukane appudappudu,fridge lo kurchuntunnanu.
    mottaniki tamaru navvarannamata.ha..ha..ha..


    @ hi VIHARI ji.correct ga chepparu.hayyababoye meeru takkuvemi kadannamata.nurse ni chusi navvina seen oohiste navvostundandi.
    annattu madi madhurai kadandi.nenu ORUGALLU PILLANI.

    ReplyDelete
  18. @ hi CHAITU.HOW R U?cheppadam marichanu.naaku maths anna ,maths sir anna,padadu.kabatti nee story ,na story okkate.mari mana viplava samstha ekkada pedadam.mahesh ji,vihari ji kuda manato patu unnaru.
    keep in touch.VIPLAVAM VARDHILLALI.

    @ hi vikatakavi garu.ee sari tappulu jaragakunda chustanu.thank u so much.keep writing comments.meeru cheptene ga naaku telisedi.

    ReplyDelete
  19. @ HELLO PRAPHLLA CHANDRA JI.thank u.meeku na post nachinanduku santhosham.mari appudappudu chaduvutu,comments rastu undandi.

    @ HI VIDYA JI.thankssssssssss.
    thanksssssssssssssss.mee navvulu ikkadi daka vinipinchayi.

    ReplyDelete
  20. @ SUDHAKAR JI thanksssssssssssss.
    NA BLOG MEEKU NACHINANDUKU SANTHOSHAM.

    @ HI NISHIGANDHA ji.thaksssssssssssssss.
    monne mee blog chusanu.baundi.
    mottaniki navvarannamata.

    @ HI KOTTAPALY garu.thank u.inka mee comment raledentabba anukunna.thank u so much.

    ReplyDelete
  21. HI,NANI.THANK U.meeku na posts chala nachayi annaru kada.daniki santhosham.
    ika pote nenu chala intelligent ani anukokandi.hospital lo chesina gola chala chinnadi.inka chala unnayi.
    ika tallent appivvadam antara...?
    nakanta ledandi babu.
    keep in touch.untanu.meenakshi.

    ReplyDelete
  22. hi.

    enta partiality no.. meeku endaru comments raasero ?!! Bagaa raaste maree inni comments raseyaalaa?

    Eee blaagarlaki 'meenakshi' ante partiality!!!


    :D

    ReplyDelete
  23. మీ పోస్ట్ లన్నీ బావున్నాయి. ఇప్పుడే తీరిగ్గా చదువుతున్నాను. మంచి హాస్యం. సలహా ఏమిటంటే ఫాంట్ సైజ్ పెంచితే చదవడానికి ఈజీ గా ఉంటాది.

    ReplyDelete
  24. we cant able to read this blog due to font problem.I am verymuch eager to read this blog.
    Can anybody please tell me which font I need to download.

    ReplyDelete