Sunday, September 14, 2008

తల- బట్టతల-మగవాడు కాన్సెప్ట్ తెలుసా ?




ముఖ్య గమనిక :: ఈ టపా చదవకుంటే 432 వెంట్రుకలు,చదివి కామెంటకపోతే
676 వెంట్రుకలు ఊడిపోతాయి.దానికి నేను బాధ్యురాలిని కాదు(హి హి హి )..


నిన్న సాయంకాలం కాలేజ్ నుండి ఇంటికి వస్తుంటే మా బుచ్చిబావ కాల్ చేసి
మీనూ...నేను ఈ రోజు ఇంటికి వస్తాను,అని చెప్పి కాల్ కట్ చేసాడు.
హమ్మయ్య నేను చేయబోయే "కాకరకాయ కసాపిసా" అనే కొత్త రకం వంట ఎవరి మీద
ప్రయోగించాలో అనుకుంటున్నా....బావొస్తున్నాడన్నమాట అనుకున్నా...

లైట్ గా కాళ్ళు నొప్పుడితే డబ్బులకు ఆలోచించి బసెక్కా "కాళ్ళనొప్పి" భయంకరమైన "తలనొప్పిగా" మారింది.

బస్ లో నా వెనక సీట్లో ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారు.
అందులో ఒక అబ్బాయి పేరు "విజయవాడ".మరో అబ్బాయి పేరు "బెజవాడ".

విజయవాడ: రేయ్ మామా నిన్న పెళ్ళిచూపులకి వెళ్ళానన్నావ్.యావైందిరా..
బెజవాడ: 30 yrs induustry... అదే రిపీట్ అయ్యింది.
విజయవాడ: ఏం జరిగిందో సరిగా చెప్పు.
బెజవాడ: ఎముంది, నేను తన "జడ" చూస్తే తన నా "బట్టతల" చూసింది.
విజయవాడ: "Software Engg" అని చెప్పావా ?
బెజవాడ:: ఆ.. చెప్పంగానే ఎందుకో మరీ "జాలిగా" చూసి వెళ్ళిపోయింది.

...........................................................


ఇదంతా చూసి, విని నా చిట్టి హృదయం ద్రవించిపోయింది.ఇంటికి వచ్చి చూసేసరికి మా
డాక్టర్ అన్నయ్య బట్టతలతో నవ్వూతూ కనిపించాడు.
పాపం రేపు మా అన్నయ్య పరిస్థితి కూడా ఇంతేనా..ఇంకా ఈ నవ్వులు కొంతకాలమేనా ?

దేవుడా..అబ్బాయిలకు ఇన్ని కష్టాలు పెట్టావా తండ్రి.అమ్మాయిలు జుట్టు కత్తిరించుకుని 'పోని' అన్నా,
అబ్బాయిలకు కత్తిరించకుండా ఊడిపోతుంటే పోనీ లే వాళ్ళు ఏం చేస్తారు ?
అని ఎందుకు వదిలెయ్యట్లేదు తండ్రి ??

ఇప్పటికే అమ్మాయిలంతా జుట్టుపిలకలున్న అబ్బాయిలను ఇష్టపడుతుంటే
వాళ్లకి జుట్టు ఊడిపోయేట్టు చేసావా తండ్రి. అయ్యో రాత..అని అనుకుంటూ...ఉంటే ఒక చక్కని ఆలోచన స్పురించింది..

ఆడదానికి ౩౩ % reservation ఇచ్చిన మన బుల్లబ్బాయిలందరి కోసం హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసి
జుట్టుని ప్రసాదించే ఏదో ఒక "మంత్రం" సాధించి తీరాలి అని నిర్ణయించుకున్న.

వెళ్ళే ముందు మన బ్లాగుమిత్రులందరికి కాల్ చేద్దామని అనుకుని ముందుగా
కొత్తపాళీ గారికి కాల్ చేసా..

నే : హల్లో కొత్తపాళీ గారు..బాఉన్నారా..ఏం చేస్తున్నారండి?
కొత్తపాళి గారు: ఏం బాఉండడమో ఏమోనమ్మా.."పెళ్ళాం చెప్తే వినాలి"..సినిమా చూస్తున్నా..

నేను: అయ్యో అదేంటండి..అలా..
కొత్తపాళి: అదంతేనమ్మా..ఒక్కసారి పెళ్ళాయ్యాకా
మన చేతిలో ఏమి ఉండదు.గుండుపై జుట్టూ ఉండదు.నా ప్రొఫైల్ లో ఉన్న పిక్ చూస్తే నీకే తెలుస్తుందమ్మా అన్నారు.
పిక్ చూసా..అయ్యో తన లైఫ్ కి సింబాలిక్ గా ఈ ఫోటొ పెట్టుకున్నారా.. పాపం
మగవాళ్లకి ఇన్ని కష్టాలా.. ఆ దేవుని మీద అప్పటి దాకా "సాస్" లా ఉండే నా కోపం "జామ్" లా గట్టిపడింది.

అనుకుంటూ...ఇలా పెళ్ళై జుట్టు ఊడిపోయేవాల్ల కోసమైనా నేను తపస్సు చేయాల్సిందే అనుకున్నా..

తరవాత..రాజేంద్రా గారికి కాల్ చేసా..
నేను: హెలో రాజేంద్రా గారా..?
రాజేంద్రా గారు: అవునమ్మా నేనే..
నేను: ఏం చేస్తున్నారండి..
రా: "పెళ్ళాం చెప్తే వినాల్సిందే" అనే సీరీయల్ చూస్తున్నానమ్మా..
నే: అయ్యో అలాంటి సీరీయల్ ఏ చానెల్ లో రాదే?
రా: అది ఏ చానెల్ లో రాదమ్మా..మా ఇంట్లో మాత్రమే వస్తుంది అన్నారు.
నే: ఇంతకీ మీది లవ్వు మ్యారేజీయా అరేంజా..?
రా: ఏదైతేనేం రెండిట్లో పెద్ద తేడా ఏమి లేదమ్మా..
నే: అదేలా అండి..?
రా: లవ్వ్ మారేజి అంటె.."మనంత మనమే వెల్లి గుంతలో పడటం".
అరేంజ్ మ్యారేజ్ అంటె "కొంత మంది కలిసి గుంతలోకి తోయడం".
ఏదైతేనేం మొత్తానికి "గుంతలో పడటం" అన్నమాట..

నే : ఏమనుకోక పోతే మీది "బట్టతల" కదా :)
రా : :(

పెళ్లి కాకముందు జుట్తు దానంత అదే ఊడిపోతుంది.పెల్లయ్యాక ఊడగొడతారు..అంతేనమ్మ తేడ అన్నారు.
ఇంతకీ ఏంటమ్మా సంగతి అని అడిగారు..
నే: ఇది కథ అని ..నా హిమాలయ ప్రయానం గురించి.చెప్పి కాల్ కట్ చేసాను.

పాపమ్ కొంతమందికి పెళ్ళికి ముందే జుట్తు ఊడిపోతే ,కొంతమందికి అయ్యాక ఊడిపోతుందా అనుకుని
ఎలాగైనా వీల్లందరి కోసం నేను త్యాగం చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నా..

........................................................

నా ప్రయాణం గురించి తెలిసి ...నాతో పాటు "విద్య" గారు, "మురళి" గారు కూడా వస్తానన్నారు.
మీరెందుకండి నాతో..ఎంచక్కా బ్లాగులు రాసుకోండి అంటే...హు హు హు..బ్లాగడానికి ఇంకా ఏం మిగిలింది మీను..
అరే..అరే..అసలు బ్లాగు పెద్దవాళ్ళు మాకు బ్లాగడానికి ఏం వదలడం లేదు..
కవితలు,కథలు,కాకరకాయ పులుసులు,బెండకాయ పులుసులు,ప్రేమలు,పెళ్ళిళ్ళు,
వంటాలు,తంటాలు,మా వారు శ్రీవారు,అత్తా,ఆవకాయ ఇలా అన్నింటి పైన
రాసేస్తున్నారు..ఇంకా మేం బ్లాగాలి..ఏం ఉందని బ్లాగాలి..

పోనీ కామెంటుదామంటే అది కూడా మా కన్నా ముందే కామెంటేస్తారు..

ఇంకా మాకేం మిగిలింది మునక్కాడ ముక్క...
మేం కూడా నీతో పాటు వస్తాం.....అంటే ....సరే చిన్నపిల్లలు ముచ్చట పడుతున్నారు కదా అనేసి రండి అన్నాను..

వెళ్ళె ముందు వరంగల్ కి వెల్లి మా ఫ్రెండ్స్ కి నా ప్రయాణం గూర్చి
చెప్పి వద్దామని బయలుదేరాను..
స్టేషన్ కి వెళ్ళేప్పుడు తోవలో శివగారు ఏవో ఆయుర్వేదిక మూలికలు కొంటూ కనిపించారు..
ఏందుకు శివగారు ఇవి అంటే ..జుట్టు పెరగడానికి మీనూ...

ఇదిగో ఈ "త్రిఫల చూర్ణం" వాడితే జుట్టు వద్దన్నా పెరుగుతుందిట...
అంటూ తన ఊడిపోయే జుట్టు గురించి బాధపడ్డారు....

జనాలు జుట్టు పెరగాలనే వ్యామోహం లో ఎంత
మోసపోతున్నారు ..పాపం ఇలాంటి వాళ్ళు ఎంతమందో..అనుకున్నా...

కాజిపేటా రైల్వేస్టేషన్లో ...అశ్విన్ గారు,శ్రీకాంత్ గారు కనిపించారు.

అశ్విన్ గారు చంకలో ఒక కుక్కపిల్ల.చేతిలో కోకాకోలా,కల్లల్లో కన్నీల్లు..
పెట్టుకుని కనిపించారు..ఎలాంటి మనిషి ఎలా అయిపోయారేంటి అనుకుని.
అసలు ఏం జరిగిందండి అని అడిగా..
నాదో విశాద గాధ ..ప్రతి సారి లువ్వులో ఫెయిల్ అవుతున్నాకానీ ఈ సారి నా పీకల మీదకు వచ్చింది.

నే: షాన్వాజ్ , షైలాభానూల గురించేనా ..?
అ: అవును వాళ్ళూ పోతే పోయారు ..ఇప్పుడు..నా కోసం
సులక్షణ రెడ్డి బాంబులు పట్టుకుని వెతుకుతుందిట.బతికుంటే "ఆఫ్రికా" అమ్మాయినైనా ప్రేమిస్తా.

అని ఒకటె ఏడవడం..ఇంతకి నువ్వెటు వెల్తున్నావ్ మీను అని అడిగారు.

హిమాలయాలకి వెల్తున్నానండి...
అ: ఓహో అలాగా..

ఇంతలో ఎవరొ అమ్మాయి వచ్చి గన్ ఎక్కుపెట్తి...
అశ్విన్ కదిలావో కాల్చి పారేస్తా అంది.
నే: ఎవరండి మీరు..?
అ: మీను తనె సులక్షన రెడ్డి..
సు: ఏయ్ ఎవరు మీరు..?
శ్రీ: మేము అశ్విన్ ఫ్రెండ్స్ అండి..
సు: ఐతే మీరు అయిపోయారు..
అ: ఏంటే అయిపోయేది..తుప్పు పట్టిన తుపాకీ మొహందానా...అని గట్టిగా అరుస్తూ బాలక్రిష్ణ స్టైల్లో
తుపాకీని తన్నేసి అశ్విని నాచప్ప లెవల్లో పరుగు పెట్టారు.
నేను,శ్రీకాంత్ గారు తనని ఫాలో అయిపోయాం.

మీను నువ్వు హిమాలయాలకి వెళ్తున్నావా..? అయితే నేను వస్తా..నీతో పాటు
కనీసం అక్కడనైనా సేఫ్ గా ఉంటాను.అలాగే నాతో పాటు మా ఫ్రెండ్ శ్రీకాంత్ వస్తాడు ,మేము కూడా తపస్సు చేస్తాం నీతో పాటు..అన్నారు.
సరే రండి అన్నాను.

అదేంటో నే వెళ్ళే సంగతి అప్పుడే అందరికీ తెలిసిపోయింది...ప్రవీణ్ గారు,చైతు గారు,కిరణ్ గారు,మురళీ గారు,సరస్వతికుమార్ గారు,క్రాంతి గారు,తెరెసా గారు,
వికటకవిగారు,ప్రఫుల్లచంద్ర గారు,వేణు గారు,భావకుడన్ గారు,బొల్లొజుబాబా గారు,మహేశ్ గారు,బ్రహ్మి గారు,శరత్ గారు,దీపు గారు,ప్రతాప్ గారు
తెలుగువాడిని గారు,విజ్జు గారు..అందరూ కళ్ళెంట నీల్లెట్టుకున్నారు..మా కోసం ఇంత త్యాగం చేస్తున్నావా..మీనూ అంటూ..


అన్నీ సర్దుకుంటుండగా.."రానారె" గారు కాల్ చేసి మీనూ బేగంపేట్ లో "బ్లాగానంద స్వామీజీ" గారున్నారు.
ఎందుకైనా మంచిది తను ఇంతక ముందు ఇలానే తపస్సు చేసారంటా మీరు వెళ్ళి కలిస్తే మీ ప్రయత్నం మంచిదో కాదో తెలుస్తుంది అన్నారు.
సరే అని అందరం బయల్దేరాం.

**** ***** ****

అది తాడేపల్లి వాళ్ళ ఆశ్రమం. అక్కడికి వెళ్ళాక. ఎంతో ప్రశాంతం గా ఉంది వాతావరణం.
ఇంతలో ప్రసాదం గారొచ్చి ప్రసాదం పెట్టారు. దీప్తిధారా గారు ఆశ్రమ పక్షుల తో నిమఘ్నమైనారు.
చదువరి గారు చదువుకుంటున్నారు. వీవెన్ గారు ఈ మధ్య బ్లాగులు హాట్ గొడవల మధ్య విసికి మెడిటేషన్ లో ఉన్నారు.

అశ్విన్ గారు వెంటనే స్వామిజి దగ్గరకు పరుగెత్తుకెళ్ళి.ఓ నవ్వు నవ్వారు.

స్వామీజీ : "ఆకాషం ఎర్రగా ఉంది" అన్నారు...
అశ్విన్ : "వీపు దురదగా ఉంది" అన్నారు....

మేమంతా ఇదేంటి అని అడిగితే ..అశ్విన్ గారు చెప్పారు.ఆ స్వామీజి ని కలిసే ముందు ఇలా
కోడ్ చెప్పాలని. ఆయిన అసలు పేరు "అబ్రకదబ్ర" అట. ఓహో అలాగా అనుకున్నామ్.

స్వా : పిల్లకాయల్లారా ఇంతకీ మీరు హిమాలయాలకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు.
శ్రీకాంత్ : "తల-బట్టతల-మగవాడు" అన్న Concept మీద తపస్సు చేయడానికి స్వామీజీ...
స్వా : ఇది ఓల్డ్ కాన్సెప్టే. మీకో విషయం చెప్పాలి అది పాతిక సంవత్సరాల క్రితం
ఉత్తర దేశంలో ఓ యోగ్యుడుండేవాడు. ఆ యోగ్యుడి పేరు
"విహారి భూపతి" అతను ఇదే concept మీద కొన్ని వందల మందిని
ఉత్సాహపరచి తప్పస్సుకు సిద్దం చేశాడు. ఆ వందల మందిలో నేనూ ఒకడినే.
అందరం కలిసి తపస్సు చేశాం. ఒక్కక్కళ్ళూ తపస్సు చెయ్యలేక వెనుదిరగటం ఆరంభించారు.
చివరకు ఓ ఐదుగురు మిలిలారు. ఆ "యోగ్యుడు" తో సహా ఆ ఐదుగురు మాత్రం
నిర్విరామంగా తపస్సు చేస్తూవున్నారు.
--------------------
INTERVEL
--------------------
( 10 నిమిషాలు తర్వాత )

అది అమృత ఘడియలు సమయం. భగవంతుడు ప్రసన్నమౌదగ్గ సమయం.
అనుకున్నట్టుగానే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.

దే :: "భక్తా ఏమిని కోరికా ?"
ఆ "యోగ్యుడు" నెమ్మిదిగా కళ్ళు తెలిచి చూశాడు.
అదృష్టమో దురదృష్టమోతెలియదు కానీ అందరూ సృహ తప్పి పడివున్నారు.
దేవుడిని చూసి ఆ యోగ్యుడు ఏడవటం మొదలపెట్టాడు. దేవునికేమి అర్ధం కాలేదు.

దే :: మళ్ళీ ..."భక్తా ఏమినీ కోరికా ?"
ఆ యోగ్య్డుడు ఇంకా ఏడుస్తునే ఉన్నాడు.
దేవునికి పిచ్చెక్కింది.

దే :: గట్టిగా అరుస్త్తూ "భక్తా ఏమిని కోరికా ?"

యోగ్యుడు ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు.
దేవుడు ఈ సారి ఆ యోగ్యుడు పక్కన కూర్చోని, తట్టి బ్రహ్మానందం స్టైల్ లో చెవిలో "భక్తా ఏమిని కోరికా ?" అనిడిగాడు.
యోగ్యుడు ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు.

దే :: దీనంగా "భక్తా ఏమిటయ్యా? ఏమిటి ? ఏమిటయ్యా నీ కోరికా ?
తపస్సు చేసి ఏడుస్తావేంటయ్యా.ఏమిటి నీ కొరికా ?.
చెప్పునాయినా పదహారుమంది వెయిటింగక్కడ. చెప్పు ఏం కావాలి "
యోగ్యుడు దేవుడి వంక చూసి.
నా ఖర్మ ఇలా కాలితే ఏవడేం చేస్తాడు లేండి."తల-బట్టతల-మగవాడు" అన్న concept మీద నేను తపస్సు చేశా.
మీరు ప్రత్యక్షమవ్వగానే నేను మిమ్మల్ని కడిగేద్దమనుకున్నా అసలు బట్టతల మగవానికి ఎందుకు పెట్టావ్ అని.
ప్రపంచంలో మగవాని బట్టతల తుడిచెయ్యటమే నా లక్ష్యం,కానీ.... స్వయాన మీరే "బట్టతలేసుకుని" దిగబడ్డారు.
అందుకు నేనేడుస్తున్నా.

అందుకు దేవుడిలా అన్నాడు.
"పిచ్చివాడా ?బట్టతల మగవానికిచ్చిన వరం ."

యోగ్యుడు : అదెలా స్వామీ ?
"బట్టతల మగవానికిచ్చిన వరం. మీ ఉద్దేశంలో మగ దేవతలందరూ ఇంతింత జుట్టేసుకునుంటారనుకుంటారా ?"
"ఏం కాదా",
"కాదు "పురాణాలలో" ఎక్కడన్నా మగవాని జుట్టుని గురించి ప్రస్తావించారా ?
లేదు కదా అదే మరి. బట్టతల దైవత్వానికి ,సింబల్.
అంతెందుకు దుశ్చాశనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని నిండు సభలోకి ఈడ్చుకొచ్చినప్పుడు
ద్రౌపది దుశ్చాచనుని జుట్టెందుకు పట్టుకోలేదనుకున్నావ్?
కారణం దుశ్చాశనునికి "బట్టతల". అంత దాకా ఎందుకు కలియుగ దైవం అంటారే
వేంకటేశ్వర స్వామి బట్టతలవ్వగానే కదా దేవుడైయ్యాడు..

ఇంకా చెప్పాలంటే రాజు పెద్దా ? రాణి పెద్దా ?
"రాజే పెద్ద "
"ఏలా అని మీరెప్పుడన్నా ఆలోచించారా? లేదు కదా నేను చెప్తావిను ఒక్కే ఒక్క కారణం రాజులకు "బట్టతల" కాబట్టి.
అవును శాస్త్రం ప్రకారం కిరీటం పెట్టుకున్నవాడే కింగ్. బట్టతల ఉంది కాబట్టే వాడు కిరీటం పెట్టుకున్నాడు.
కిరీటం పెటుకున్నాడు కాబట్టే వాడు రాజు.అంటే "బట్టతల రాజత్వం" అన్న మాట.
బట్టతలను ఉన్నవారిని అందరూ కాళ్ళుపట్టుకుంటారు. తెలుసా ? అదెలాగంటావా?
అదింతే జుట్టూ అందకపోతే కాళ్ళు అంటారు కదా బట్టతల ఉన్నవాడి జుట్టూ ఎప్పటికీ ఎదుటి వాడు అందుకోలేడు
కాబట్టి ఖచ్చితంగా కాళ్ళే పట్టూకుంటాడు.కాబట్టి నాయినా ఇలా పిచ్చివాడిలా తపస్సు చెయ్యకు ఇంతకు ముందు బట్టతల కోసం తపస్సుచేసే వారెందరో ఉన్నారు తెలుసా ?

కాబట్టి ............
బట్టతల మగవాని "గౌరవం" .
బట్టతల మగవాని "ఆనందం".
బట్టతల మగవాని మరో "అందం".
బట్టతల మగవాని "సుఖం".
బట్టతల "దైవత్వం".
బట్టతలే "సత్యం". సత్యమే నిత్యం.
బట్టతల ఉంది కాబట్టే ఆడవాళ్ళని మగవాడు శాశించగలుగుతున్నాడు.
మీ పూర్వీకులు బట్టతల రాని వాడిని గ్రామంనుండి వెలివేసి మగ గొడ్రాలు అని నిందించేవారంటే దాని విలువ నీకు తెలుసుంటుంది. " అని హితబోధ చేసాడు.
దానికి ఆ యోగ్యుడు కన్నీరు మున్నీరు గా భాదపడి. తనను క్షేమించమని కోరాడు.

దే:: "పర్లేదు భక్తా ఇవన్నీ కామన్. నువ్వు నాకొక సహాయం చెయ్యి.
ఇలాంటి చెత్త విషయాల మీద ఎవ్వరినీ తపస్సు చెయ్యొద్దని చెప్పు సరేనా.
యో : సరే.
దే : మరి నేను వెళ్ళిరానా ?
యో: స్వామీ నాదో అనుమానం. అసలు రాముడంటే N.T.R లా ఉంటాడనుకున్నా మీరేంటి ఇలా ఉన్నారు.
దే: "మీరేంటి ఇలా ఉన్నాను."-అంటే
యో: తమాషాగా, కామెడిగా అని స్వామి అంతకు మించి ఏమీ లేదు తప్పుగా అనుకోవద్దు.
దే: మీటింగ్ ఉంటే రాముడు "రాజస్ధాన్" వెళ్ళాడు. నేను రాముడిని కాదు. "తోటరాముడిని".
నీ ధైర్యానికి మెచ్చాను, నీకెప్పుడన్నా నాతో మాట్లాడాలంటే 'రెండు రెళ్ళు ఆరు' అను. అని మాయం అయ్యాడు దేవుడు.

..............................................................

అదమ్మా సంగతి అని " అబ్రకదబ్ర "స్వామీజి చెప్పారు.
కాబట్టి మీరందరూ "తల-బట్టతల-మగవాడు", అన్న తపస్సు యొక్క
concept ని అందరికీ చెప్పిమగవాని దుఖ: న్నీ పోగొట్టండి. సరేనా అన్నారు.

ఈ రోజు నుండి అహర్నిశలు బట్టతల అని బాధపడే మగవారికి కౌన్సిలింగ్ ఇచ్చి ..
వారికి నిజమైన "బట్టతల" అర్ధం ఇదని చాటి చెప్తాము. మాతో సహకరిస్తా అన్న వాళ్ళు చేతులెత్తండి.


(ఈ పోస్ట్ కేవలం సరదాగా నవ్వుకోడానికి రాసింది మాత్రమే ఎవరిని నొప్పించాలని ఉద్దేశం కాదు.. ఎవరికైనా అభ్యంతరముంటే తెలుపగలరు వారి పేర్లు తొలగించెదము. )

60 comments:

  1. చాలా హాయిగా నవ్వుకున్నాను మీ పోస్టు చదివి.కామెంటక పోతే ఉన్న నాలుగైదు వెండ్రుకలు కూడా ఊడిపోతాయేమోనని భయమేసింది.

    ReplyDelete
  2. jaMTa kavitvam laaga jaMTa blogging start chESaaraa?? baagu baagu !!!

    ReplyDelete
  3. భలే తమాషా గా రాసారండీ. అందరు బ్లాగర్లను కలుపుతూ.

    ReplyDelete
  4. అరిరింది తోట రాముడి ఎఫెక్టు సూపర్. అయ్యో కొత్తపాళీ గారూ అదా సంగతి.

    ReplyDelete
  5. యేను అచలే పచిదుడ్డునమ్మా ఇపుడిపుడే బుల్లి బుల్లి వెంట్రుకలు వస్తున్నాయి.తీరిగ్గా చదువుతా నీ టపా!!! ఈ లోపు నా జుట్టు ఊడిపోదుగా!!! హిహిహి అయినా సరే కామెంటుతున్నాగా 676 వెంట్రుకలు సేఫ్ అన్నమాట. అహా జిజ్జినక....

    ReplyDelete
  6. కొత్త ప్రయోగం బాగుంది . :)

    ReplyDelete
  7. తోటరాముడిని ప్రార్ధించిన యోగ్యుడు ఎవరో తెలుసా... ఎవరి పేరు చేబితే బ్లాగు సీమలో అందరూ పొట్టపగిలేలా నవ్వుతారో ఆయనేనండి ఆయనే దినకర్ దినకర్ దినకర్ .....100 సార్లు.

    ReplyDelete
  8. "అదింతే జుట్టూ అందకపోతే కాళ్ళు అంటారు కదా బట్టతల ఉన్నవాడి జుట్టూ ఎప్పటికీ ఎదుటి వాడు అందుకోలేడు" super...
    ఎప్పటిలానే అదిరిపోయింది !!!

    ReplyDelete
  9. అయినా మీనూ ఈ టపాని నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఇప్పటికే ఉన్నజుత్తు సగం పోయి ఏడుస్తుంటే, ఫ్లాపుల బాలకృష్ణ మీద ప్రజారాజ్యం పడ్డట్టు ఈ టపాతో అందరికి తెలిసేలా చేస్తున్నావా? ఇలా అయితే నాబోటి సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ కి పిల్లనెవరిస్తారు.
    అయినా మనదారులు మనకి ఉంటాయి గా... ఉందిగా విగ్గు షాపు దారిలోనా... జగడ జగడ జగడ జాం. (పెళ్ళి చూపులకు, వివాహాది శుభకార్యాలకు విగ్గులు అద్దెకివ్వబడును. ఇట్లు బోడిగుండు ఆంజనేయులు.ph:9291591701)

    ReplyDelete
  10. ఇలా ఇద్దరూ కలిసికూడా రచనలు చేసి హాస్యాన్ని సృష్టించొచ్చన్నమాట! బాగుంది ఈ విన్నూత్న ప్రయత్నం.

    ReplyDelete
  11. A wonderful narration
    Better understanding of Blogs

    ReplyDelete
  12. హ హ హ హా
    (ఈ మధ్యే మొదలైన నా బట్టతలని గోకుతూ)

    ;-)

    ReplyDelete
  13. హ హ హా...... హ హ హ .........................చాలా బాగుంది.

    ReplyDelete
  14. Super. చాలా బాగా రాసారు. నాకు బట్టతల అని మా స్నేహితులంతా ఏడిపిస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకు సరైన సమాధానం చెప్తా.. :)

    ReplyDelete
  15. సూపరంటే సూపరే! అదిరిపోయింది. బ్లాగర్లు కారెక్టర్లో అలా ఇమిడిపోయారంతే. రాముడు, తోటరాముడు హైలైట్.

    ఒక చిన్ని సలహా, ఎటూ బ్లాగర్లను ఉద్దేశించావు కాబట్టి, వారి బ్లాగులకు లింక్ ఇవ్వు! కొత్త వాళ్ళు ఎవరైనా చదువుతుంటే వారికి బ్లాగులు పరిచయం అవుతాయి. బ్లాగర్లను ఇంట్రడ్యూస్ చాలా బాగా చేశావు, అందుకే చెప్తున్నా.

    మొత్తానికి బ్లాగులను చాలా నిశితంగా గమనిస్తున్నా అని చెప్పకనే చెప్పావు.

    ReplyDelete
  16. శాస్త్రం ఏమి చెబుతుందంటే,

    బట్టతలమీద జోకులేసే వాళ్ళు మగవారు అయితే రౌరవాది నరకాలకి పోతారు, మళ్లీ జన్మలో అనుపమఖేర్ అయి పుడతారు. ఆడవాళ్ళయితే ఈ అనుపమఖేర్లతో ఏడేడు జన్మలూ సంతోషంగా వుంటారు. (by the way, నాకు బట్టతల ప్రస్తుతానికి లేదు.) :-)

    ReplyDelete
  17. హిమాలయాలకే ?
    నన్నడిగితే నే చెప్పనూ... పొడవాటి జుట్టు రహస్యం :-)

    ReplyDelete
  18. శ్రవణ్ గారూ
    అంతే అంతే
    బొల్లోజు బాబా

    ReplyDelete
  19. పర్మిషన్ లేకుండా నా మంత్రం వాడేసుకోటం దారుణం. అయినా హాస్యం పండించారు కాబట్టి వదిలేస్తున్నా :)

    Btw, పెద్ద కామెంట్ రాస్తే బట్టతలబాబుల నెత్తిపై జుట్టు మొలిపించే స్కీమేదన్నా ఉందా మీ దగ్గర? (నాకోసం కాదు లెండి).

    ReplyDelete
  20. ఇలాంటి మాయ మాటలు చెప్పి ఈ మహోద్యమాన్ని ఆపలేరు. అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరు. బట్టతల నివారణ కోసం తపస్సు
    కొనసాగుతుంది. మీరు విరమిస్తే,నేను చేస్తా! దేవుడు కుదరదంటే,
    మీ వాదననే వినిపిస్తే, ఆడవాళ్ళకి కూడా ఆ అమూల్య వరం ఇమ్మంటా!
    (కనీసం ౩౩% రిజర్వేషన్ తో...)

    ReplyDelete
  21. మొత్తానికి మీ ముఖ్య గమనిక నా చేత వ్యాఖ్య రాయించేలా చేసింది. ఇప్పటి దాకా ఈ టపాలన్నీ చదవటం, (విరగబడి) నవ్వుకోవటం(మరలా మరలా), వెళ్లిపోవటం అంతే ... ప్రస్తుతానికి ఈ బట్టతల సమస్య లేకపోయినా, నిన్న చదివి వ్యాఖ్య రాయకుండా వెళ్లిపోయిన దగ్గర నుంచి ఇప్పటకి చూసుకుంటే కొంచెం తేడాగానే ఉన్నట్టు అనిపించింది ... ఎందుకైనా మంచిది అని ఆ నాలుగు ముక్కలు రాసేశా .. హమ్మయ్య .. ప్రస్తుతానికి సేఫ్ ...

    ReplyDelete
  22. జుట్టు పోగొట్టుకోండి, ఆనందంగా ఉండండి!!!

    ReplyDelete
  23. కామెంటినా మెంటకపోయినా జుట్టు రాలుట తప్పేట్లు లేదు. నవ్వి నవ్వి ఉన్న జుట్టు రాలిపోయేట్టుంది...:))
    అవునూ మీ గమనిక -"ఈ టపా చదవకుంటే 432 వెంట్రుకలు, చదివి కామెంటకపోతే
    676 వెంట్రుకలు ఊడిపోతాయి"---మగవారికేనా, ఆడవారికి కూడానా". ఏం లేదు, ఎక్కువ మగ వ్యాఖ్యలే కనపడుతుంటేనూ...

    ReplyDelete
  24. అదిరింది... కేక. నేను చెతులు ఎత్తేసా. జై మీను.

    ReplyDelete
  25. ''ధర ఖర్వాటుడొకండు...''తో మొదలయ్యే ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యం గుర్తుకువచ్చింది. (ఖర్వాటుడు అంటే బట్టతల కలిగినవాడు).బ్లాగర్లందరూ పాత్రధారులైన ఈ టపా చాలా బావుంది. చదివాను,కామెంటాను కాబట్టి నా తలమీద 432 ప్లస్ 676 మొత్తం 1108 వెంట్రుకలను రక్షించుకోగలిగి నేను ఖర్వాటుడిగా మారే ప్రక్రియను ఆలస్యం చేసుకోగలిగాను.నాకీ అవకాశం కల్పించిన మీనాక్షి గారికి,అశ్విన్ బూదరాజు గారికి ధన్యవాదాలు!:)

    ReplyDelete
  26. అమీశ్వినాన్ క్షి గార్లూ... చమించండి ... నవ్వి, నవ్వి, మాటలు తడబడుతున్నాయి. మీ ఇద్దరికీ నవ్వుల పూల దండలు

    ReplyDelete
  27. హ్హా, హ్హా.
    మరి నేను ఎలా మిస్ అయ్యనబ్బా ఈ టపాల సందడిలో?

    ReplyDelete
  28. కేక టపా. కాని మధ్యలో కొంచెం బోర్ కొట్టించింది.
    మరొక సంగతి. ఇది న తొట్ట తోలి కామెంటు తెలుగులో.. తెలుగు బ్లాగ్లులో కూడాను.
    నేను గత సంవత్సరంగా బ్లాగుతున్నాను. కాని తెలుగులో రాయాలన్న ఆలోచన ఒక్కసారి మాత్రమే వచ్చింది. ప్రయత్నించాను కానీ సరిగ్గా చేతకాలేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు.
    మీ బ్లాగు చూసాక మల్లి నాకు తెలుగులో బ్లాగాలనిపించింది. :)

    ReplyDelete
  29. చాలా చాలా బాగుంది మీను

    ReplyDelete
  30. వా :-( ఇక్కడ నా కామెంట్ ఉండాలి ఏది ?

    ReplyDelete
  31. అదేంటో మీనూ నిన్న మీ టపా తోనే శుభారంభం చేసి కామెంటాను కాని పబ్లిష్ అవ్వలేదు బహుశా నువ్వు కూడా moderation మొదలెట్టావేమో లే అనుకున్నా, కానీ ఈ రోజు డైరెక్ట్ గా పబ్లిష్ అయింది. ఇంతకీ నిన్న నేనేమన్నా అంటే...
    మీనూ & అశ్విన్, జంటకవుల వింత ప్రయోగం భలేగా వుంది, బ్లాగర్లందరి పేర్లను ఇరికించి చెడుగుడు ఆడించేసారు గా.

    ReplyDelete
  32. నా తల మీద వెంట్రుకలు కాపాడుకోవడం కోసమే కామెంటు వ్రాస్తున్నా :))

    చాలా బాగుంది. మీ ఇద్దరిని జంట కవులు లాగా "జంట బ్లాగర్లు" అని పిలవాలేమో ఇక నుంచి.

    ReplyDelete
  33. చాలా బాగ చెప్పారండి మీనుగారు. బట్ట తల వల్ల ఇన్ని ఉపయొగాలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. నేను ఇన్నాళ్ళు చాలా అనవసరంగా భాదపడ్డానేమొ అనిపిస్తుంది. మీ కధనం చాలా బాగుంది.

    ReplyDelete
  34. బట్ట తలలూ జై
    బట్ట తలలు గల వాళ్ళందరికీ వారి విమర్శకులకి తగిన జవాబు ఇక్కడ దొరికిందని సంతోషిస్తూ (ఈ పోస్టు గురించి నాకు తెల్సిన బట్ట తలలకి చెప్పను).

    -కిరణ్

    ReplyDelete
  35. భలే తమాషాగా రాసారు! నాకూ జుట్టు ఊడుతుంది, ఏ తైలం వాడాలా? అని అలోచిస్తున్న సమయంలో మంచి టపా రాసి నా జుట్టుని కాపాడారు.

    ReplyDelete
  36. నమస్కారం..
    నేను ఒక పోస్ట్ రాసాను..
    ప్లీజ్ ఒకసారి నా పోస్ట్ చదివి వీలుంటే మీకు నచ్చితే spread it..ప్లీజ్
    ధన్యవాదాలు..
    లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
    http://prakamyam.blogspot.com/2008/10/blog-post.html

    ReplyDelete
  37. బట్టతల ఇస్తుంది పెద్దరికం.సమాజంలో గౌరవం. కాని పెళ్లికాని అబ్బాయిలకు బట్టతల ఇబ్బందే.ఆడపిల్లలు, పెళ్లయ్యాక, జుట్టు పీకటానికి వీలుండే విధంగా, జుట్టున్న కుర్రాళ్లనే ఎంచుకుంటారు.అమెరికాలో ఉద్యోగం, బట్టతల ఉంటే పెళ్లికాని కుర్రోళ్లు ఎదురిచ్చి చేసుకుంటే తప్ప పిల్లనివ్వటానికి ఆంధ్రదేశం లో తల్లి తండ్రులు సిద్ధంగా లేరు.అందుకే ఇక్కడి (అమెరికా) బట్టతల కుర్రవాళ్లకు చేతిలో కోకా కోలా,చంకలో కుక్కపిల్ల, కళ్లలో కన్నీళ్లు తప్పటం లేదు.

    -cbrao
    విహారి నవ్వుల తోట,డెన్వర్ మహానగరం,కొలొరాడో.

    ReplyDelete
  38. chala bavundandi. poddune hayiga navvukunnanu. battatala vachestondani badha pade vallaki manchi relief.. kani trichologistlu (spellingu tappo correcto.. antaga pattinchukokandi.) chadivithe labo dibo mantaremo? asale e channel pettina aadivaram poddunne krutrima kesa sampadanu ela saadhinchukovali ani kunkudu kayallekunda maree talantu posestunnaru?

    ReplyDelete
  39. naa comment.. naa juttu nu rakshinchadahooo.

    ReplyDelete
  40. నూతన సంవత్సర శుభాకాంక్షలు.


    -కిరణ్

    ReplyDelete
  41. శ్రావణ్ గారు నేను పైన తెలిపినకధ చదవలేదు ఎందుకంటె అది చదివేలోపు నా వెంట్రుకలు ఊదిపొతయెమొనని భయమేసింది....... ఐయినా బాగున్నట్టెవుంధి అనుకుంట అన్ని పొస్టులు చదివాను.....

    ReplyDelete
  42. "అదింతే జుట్టూ అందకపోతే కాళ్ళు అంటారు కదా బట్టతల ఉన్నవాడి జుట్టూ ఎప్పటికీ ఎదుటి వాడు అందుకోలేడు" ఐడియా అదిరింది.
    "రాముడు, తోటరాముడు" బ్లాగుకే హైలైట్.

    ReplyDelete
  43. ఒక చేయి పైకి ఎత్తి ఇంకో చేత్తో కామెంటుతున్నాను ...
    భలే రాసారండి...బాగుంది చాల... :)
    బట్టతలను ఉన్నవారిని అందరూ కాళ్ళుపట్టుకుంటారు. తెలుసా ? అదెలాగంటావా?
    అదింతే జుట్టూ అందకపోతే కాళ్ళు అంటారు కదా బట్టతల ఉన్నవాడి జుట్టూ ఎప్పటికీ ఎదుటి వాడు అందుకోలేడు

    సూపర్ లాజిక్ :D

    ReplyDelete
  44. hehe thota ramudu ni prardhina yogi peru marichaaru aa yogi peru DInakar

    ReplyDelete
  45. idi mari anyayam andi... nenu kuda sandeep ke vote.. nenu aitey eppudu ladies firstoo firstoo ani gole chestaru kadhaa, ee vishyamlo devudu enduku adugu venkesadoo... voo devuda 33% kadu inkoncham ekkuva ichana emi anukom lee.. kumesey nuvvu taggadu vachee yuganiki aina :)

    ReplyDelete
  46. hai meenu
    హ హా...... హ హ హ .................
    nice simply super ra
    keep it up
    byebye

    ReplyDelete
  47. Good one... chala funny ga rasaru...

    mee postings teluguratna lo chadivanu.... avi kuda chala bhavunnayi

    ReplyDelete
  48. కెవ్వ్ కెవ్వ్ ....కేక
    www.tholiadugu.blogspot.com

    ReplyDelete