Friday, June 20, 2008

ఓర్పుకు ప్రతీక....... !!!.....


కోపానికి బధ్ధ శత్రువు ఓర్పు.ఓర్పు కి ప్రతీక సాలెపురుగు.
గదిలొ ఒక మూల.....,,
నిశబ్దంగా ఓర్పుగా,ఒంటరిగా
అది గూడు కట్టుకుంటుంది.
ఎవరిని సహాయం అడగకుండా,,
ఎవరినీ బాదించకుండ
తన.... నుంచి తాను విడివడుతూ
తనని తాను త్యాగం చేసుకుంటు,పోగు తరవాత పోగు
గొప్ప ఏకాగ్రతతో ఒక శిల్పి చెక్కినట్టు
గొప్ప నైపుణ్యంతో ఒక వైద్యుడు నరాల్ని ముడులు వేసినట్టు,
తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది.
******************************
అంతలో...........
ఒక హడావుడి ఉదయాన్నో,
నిశబ్ద సాయంత్ర సమయాన్నో,
గోడమీది నుంచి పెద్ద శబ్దంతో వచ్చిన చీపురుకట్ట,
ఒక్క వేటుతో దాని శ్రమంతా సమూలంగా తుడిచి పెట్టేస్తుంది.
సర్వనాశనమైయిపోయిన సామ్రాజ్యంలోంచి,
సాలెపురుగు అనాధలా నేల మీద పడుతుంది.
ఎవరినీ కుట్టదు.
ఎవరి మీదా.... కోపం ప్రదర్షించదు.
మళ్ళీ తన మనుగడ కోసం,
కొత్త వంతెన నిర్మించుకోవడానికి,
సహనమనే పోగుల్ని....
నమ్మకం....అనే... గోడల మీద తిరిగి స్రవిస్తుంది.
ఎలా బ్రతకాలో... మనిషి కి పాఠం చెబుతుంది.
******************************
బ్లాగు మిత్రులకు ఒక మనవి....
ఇది నేను రాసింది కాదు...

14 comments:

  1. నువ్వు రాయకపోయినా..ఎప్పుడో చదివిన ఈ పాఠాన్ని మళ్ళీ గుర్తుచేసావ్. మంచిది. మనిషి ఎప్పుడూ భయపడేది, "మళ్ళీ జీరో నుంచీ, జీవితాన్ని మొదలెట్టాల్సివస్తేనే". అది ఈ సాలెపురుగు చేస్తుంది.

    ReplyDelete
  2. @ Meenakshi

    manchi vishayaanni gurtu chesaavu. Thanks.

    ReplyDelete
  3. meenaakshi nenu em rayalo tega alaochinchesthunte nuvvu ekkado chadivina manchi vishayalu cheppi markulu kottesthunnav?nenika alochinchi alochinchi edo purnima gari katha preranatho elago rasesa.I am wating for your entertaining comedy flow stories.prepare it fast

    ReplyDelete
  4. hi mahesh ji.
    thanks andi.idi evaru raasaro teleedu kaani baundi kada anesi blog lo pettanu...

    ReplyDelete
  5. @ KRANTHI garu.thanks andi.
    purnima gari katha preranato mottaniki chala baga rasaru.

    ReplyDelete
  6. @ narsing rao garu ...thankssssssssssssssssssssssssssssss
    anDi....

    ReplyDelete
  7. అది ఎవర్రాసారో తెలీదు కాని, నేను యండమూరి పుస్తకంలో చదివాను. "విజయానికి అయిదు మెట్లు" అనుకుంటా.

    ReplyDelete
  8. @ independent garu...నాకు కూడా అది ఎవరు రాసారో తెలీదండి...

    @ purnima garu thank u...

    ReplyDelete
  9. Telusu. Yandamoori ekkadnincho "Inspire" ayyi raasthe meeru Yandamoori nunchi Inspire ayyaraa :)

    Really Im getting sick of this kind of "Inspirations" .
    Oka book ganee, Movie gaanee Edaina oka Original idea choosi chachipovalani undi

    ReplyDelete
  10. అప్పుడప్పుడే హృదయం వికసిస్తున్న తరుణంలో యండమూరి గారి "విజయానికి ఐదు మెట్లు" పుస్తకం లో చదివిన మాటలు. సొంతవి అయినా కాకపోయినా, ఈ ఆలోచనా సరళి అందరికీ ఉపయోగకరం కదండీ! ఏదేమైనా గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు!

    గోపాళం!

    ReplyDelete