Friday, May 30, 2008

బ్లాగుకు శ్రీకారం...!!!
ఈ బ్లాగులన్నీ చదువుతుంటే నాకూ రాయాలి అనిపించింది.
కాని అంత ధ్యైర్యం చేయలేకపోయాను.
కొందరు మహానుభావుల ప్రోత్సాహంతో ఎలాగైతేనేం నేనూ బ్లాగింగు మొదలెట్టా.
కాని ఏం రాయాలి,ఎలా రాయాలి,ఏ విధంగా రాయాలి అనే అలోచనలు నా చిట్టి బుర్రలో
చీమల్లా దూరాయి .
వారం రోజుల పాటు బాగ ఆలోచించి ...చించి...చించి...చించిన..తరవాత.
ఒక ఆలోచన వచ్చినట్లు అనిపించింది.
*************
మా ఇంట్లో ఎక్కడెక్కడో ఉన్న పుస్తకాలన్నీ తీసి దుమ్ము కూడా దులపకుండా చదవడం మొదలెట్టా.
ఇక రాత్రి,పగలు ఒకే పని పుస్తకాలు చదవడం..చదవడం......చదవడం.
ఇదంతా చూస్తున్న మా అమ్మ మాత్రం నన్ను ఇలా చదువుతుంటే చూసి ...తన కల్లను తానే నమ్మలేక పోయింది...
నా 24 క్యారెట్ల బంగారు తల్లి,ఎగ్జామ్స్ ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు చదవని నా చిట్టి తల్లి,ఇలా హాలిడేస్ లో పుస్తకాలన్నీ చుట్టూ పేర్చుకుని,కిందా మీదా పడి చదువుతుందేటబ్బ అని నివ్వెరబోయింది.....
************
మొత్తానికి పుస్తకాలన్నీ చించేసా.......
ఇప్పుడు నేను కాస్త రాయగలనేమో అనిపించింది.
సిద్ధార్థునికి భోగి చెట్టు కింద జ్ఙానోదయం అయినట్టు నాకు కొంచెం జ్ఙానోదయం అయింది.
నాకు ఏ చెట్టు కింద బల్బు ఎలిగిందో మీకూ తెలుసుకోవాలని ఉంది కదూ.
నాకు తెలుసు మీకు కాస్త జ్ఙానోదయం పొందాలని ఉందని.
చెప్పమంటారా......
అమ్మా,ఆస,దోస,అప్పడం వడ.......
సరి సరి చేప్తాను కానీ మీరు ఎవరితో చెప్పొద్దు మరి........(ష్..ష్..ష్.టాప్ సీక్రెట్.)
ఆ చెట్టు పేరు "అక్షింతలచెట్టు".
పేరు చాలా బాగుంది కదూ.
ఈ చెట్టు కింద కుచుంటే ఎవ్వరికైనా బల్బు ఎలగాల్సిందే ఎలిగి తీరాల్సిందే.
ఈ చెట్టును అచ్చ తెలుగులో "గుచ్చుకునేగడ్డి" అంటారు.
ఇప్పుడు తెలిసిందా అసలు మర్మం.
ఈ విధంగా నా జ్ఙానోదయ ఘట్టం ముగిసింది.
******************
శుక్రవారం తెల్లవారు ఝామున లెగిసి సుబ్బరంగా తలంటుకుని, పూజ గదిలో కి వెల్లాను.
దీపాలు,ఆరతి,అగారత్తులు...(అంబికా అగర్బత్తి......భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది.....అందుకే అవి ముట్టించాను....)
దేవుల్లందరికీ నేను అందరికీ నచ్చే విధనగా బ్లాగాలని మొక్కుకున్నా.
అల..దేవుల్లందరి ఆశీర్వచనాలతో బ్లాగింగ్ కి శ్రీకారం చుట్టాను.
*****************
పెన్ను,ప్యాడ్,పేపర్ మొదలైన సరంజామ సిద్ధం చేసుకున్నాను.
ఎంత సేపు చించినా ఏం రాయాలో తెలీలేదు.
ఇలా ఐతే లాభం లేదు అనుకున్నాను...
ఇప్పుడు నేను మామూలు మీనాక్షిని కాదు...బ్లాగే మీనాక్షిని కదా ...అని తెలుసుకున్నాను.
జుట్టు విరబోసి ,పెన్ను పేపర్ పై పెట్టాను.........
*****************
అప్పుడే నిద్ర లేచిన మా అమ్మ ,నా ఈ కొత్త అవతారం చూసి నివ్వెరబోయింది.
వడి వడి గా నా దగ్గరకు వచ్చి ఏంటి బంగారం ఇలా తయారయ్యావ్ అనింది.
అమ్మ ఇలా ఉంటే చదివింది బాగా వంట బడుతుంది అని చెప్పాను.....
టీ.వి చుడ్డం,మాట్లాడ్డం,చాటింగ్ అన్నీ మానేసాను...
మా అమ్మ నన్ను చూసి మురిసిపోయి జిస్టి తీయడం స్టాట్ చేసింది.....
నేను రాస్తుంది,చదువుతుంది నా సబ్జెక్ట్ కదని మా అమ్మ కి తెలిస్తే ....
జిస్టి తీయడం మాట దేవుడెరుగు నా డొక్క చించి డోలు కడుతుంది...
అయినా సరే నా ఈ డొక్క..కాస్త డోలు అయ్యే లోపు కొన్ని టపాలైనా రాస్తాను...మీ అందరి గుండెల్లో టపాసులు పేలుస్తాను.......

19 comments:

 1. wow cool blog.your writing style is so entertaining and quite natural. raayagalanaa anna anumaaname vaddu. meeru raayagaralu. keep writing :)

  ReplyDelete
 2. @hi sri vidya garu..
  thanks,thanks,thanks,thanks thanks........
  mee encouragement ki thankssssssssss.

  ReplyDelete
 3. pilla entry E iraga deesav ga
  chala baavundi
  elA modalettavO anE aMSaM mE
  }O tapa raasi peDEsaav

  ReplyDelete
 4. ప్రారంభంలోనే పరిమళించేసావ్!.చెబుతుంటే మీ అమ్మగారు మిమ్మల్ని చూసిన మురిపెమైన చూపు తెలిసివచ్చింది.భాషలో అంత స్వచ్చత చాలా అరుదుగా వస్తుంది. ‘కల్హర’(http://swathikumari.wordpress.com/) గారి బ్లాగు మీరు తప్పక చదవాలి. పనిలోపని నా బ్లాగుకూడా(www.parnashaala.blogspot.com).

  ReplyDelete
 5. @hi aswin sir.
  antaa mee dayaa.mee aashirvaadaalu naaku eppatiki undaali gurudeva.
  thank u sir..

  meenakshi.

  ReplyDelete
 6. thanks mahesh garu.
  meeru cheppina blog tappakundaa chustanu.
  naaku salahaalu,soochanalu ivvalanukunte ivvavachu.
  naa tapa nachinanduku santhosham.
  .............meenakshi(penki pilla.)

  ReplyDelete
 7. పోకిరి సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ కంటే ఇది సూపరు!
  "పుస్తకాలన్నీ తీసి దుమ్ము కూడా దులపకుండా చదవడం మొదలెట్టా"
  "నా 24 క్యారెట్ల బంగారు తల్లి"
  "సిద్ధార్థునికి భోగి చెట్టు కింద జ్ఙానోదయం అయినట్టు"
  "అక్షింతలచెట్టు".
  "ఇప్పుడు నేను మామూలు మీనాక్షిని కాదు...బ్లాగే మీనాక్షిని "

  Fantastic .. welcome to Telugu blog world.

  One suggestion - please pay attention to ళ్ళ. "తన కల్లను" కాదు. "కళ్ళను".

  ReplyDelete
 8. బ్లాగు లోకం లో ఉదయించిన మీనాక్షి కి స్వాగతాలు.

  మొత్తానికి మీనాక్షి దేవి తరహాలో పూజలతో మొదలు పెట్టారు. అలాగే ఆ పక్కన ఎలుక చోదకుడూ కూడా వుంటాండి. ఆయనికి కూడా రెండో మూడో దణ్ణాలు పడేసి రండి. ఎవర్ని మర్చిపోయినా ఆయన్ని మర్చిపోకూడదు.

  మీది మధురనా? :-)

  -- విహారి

  ReplyDelete
 9. బ్లాగ్లోకానికి స్వాగతం మీనాక్షి..

  బావుంది ఎంట్రీ.. కాని కాస్త వ్యాకరణ దోషాలు చూసుకోమ్మా.

  ReplyDelete
 10. ఓ ఎంట్రీ ఇచ్చారన్నమాట...
  బాగుంది. ఏం రాయాలంటూనే మొదటి టపా రాసేసారన్నమాట.

  అన్నట్టు "జిష్టి" కాదు "దిష్టి"

  ReplyDelete
 11. @kottapaly garu,
  thanksssssssssssss
  ilage salahalu, suchanalu,ivvagalarani manaavi.

  @vihaari garu,
  namaskaaram.meeru cheppinatte chestanandi.
  thanksssssssssssss.

  @jyoti mam thankssssssssss.tappulu jaragakunda chustanu.

  ReplyDelete
 12. @radhika mam na fav.blogs lalo meedi okati.
  thankssssssssssssss.
  meeru chala baga rastaru mam.
  thanksssssssss.

  @praveen sir thankssssssssss.
  dishti ani telusandi kani spel.mistake.

  ReplyDelete
 13. చాలా బాగా రాసారు . ఇలాగే రాస్తూ ఉండండి.

  ReplyDelete
 14. చాలా బాగా రాసారు . ఇలాగే రాస్తూ ఉండండి.

  ReplyDelete
 15. పెద్దలందరూ చెప్పటానికేమీ లేకుండా ఊదేసారు. వీలైతే విహారి గారి కొత్తబ్లాగర్లకు సూత్రాలు టపా చూడండి.
  welcome and happy blogging.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 16. @ thank u chytu...

  @ thanks ahmad ali garu...

  ReplyDelete
 17. iMta aMdagiMcina blaagu
  nuvvu kuTT iccina buTTa gaunulE,O cellii!

  ReplyDelete
 18. ఈ రోజే మొదటిసారిగా మీ బ్లాగు చూసా.ఎంట్రీయే అదిరింది.కొంచెం spelling mistakes correct చేసుకోండి.చాలు.

  ReplyDelete