Tuesday, June 24, 2008

నేను ఎందుకు ప్రేమించలేదంటే.....???


ఈ మధ్య ఏ college లో చూసినా,ఏ school లో చూసినా,టాంక్ బండ్ దగ్గర చూసినా,
సినిమాహాల్లో చూసినా,ఎక్కడ చూసినా ప్రేమ వ్యవహారాలే..........
ఎక్కడ చూసినా ప్రేమ..ప్రేమ....ప్రేమ.... ప్రేమికులే.........
లోకమంతా ప్రేమ మయం అయిపోయింది.........
***************************************
కనీసం మనశాంతి కోసం అయినా సినిమా కి వెళ్దామంటే అక్కడ కూడా "ప్రేమే"......
ఒక హీరో ఉంటాడు....ఒక హీరోయిన్ ఉంటుంది....
ఇద్దరు ప్రేమించుకుంటారు........మధ్య..మధ్య లో సాంగ్ లు సింగేసుకుంటారు....అన్నీ ప్రేమ సినిమాలే......
మైనే ప్యార్ కియా...,,ఇశ్క్..విశ్క్ ..ప్యార్..వ్యార్...
ప్రేమించుకుందాం రా..!!...నేను నిన్ను ప్రేమిస్తున్నాను..
నువ్వూ.... నన్నూ ప్రేమించు....నేను నిన్నే ప్రేమిస్తా.....
అందరినీ ప్రేమిస్తా......ఎక్కడైనా ప్రేమిస్తా.....
ఎప్పుడైనా ప్రేమిస్తా....నువ్వు వద్దన్నా ప్రేమిస్తా..........
ఇలా అన్నీ ప్రేమకు సంబందించిన సినిమాలే......
***********************************
కాసేపలా ఏదైనా బుక్ చదువుదామని తీస్తే ..అందులో కూడా "ప్రేమ" గూర్చి రాసారు..
సరే ప్రేమంటే ఏంటో..??? మనకు తెలీదు కదా అని చదవడం మొదలెట్టా.......
"ప్రేమంటే.. రెండు మనసులు, ఒకే.. పన్.......థాన నడుచుట"......అని రాసుంది.
ఈ ఒకే.. పన్ .....థాన ,నడవడమేంటో అర్దమవ్వలేదు...
"ప్రేమ, ఆల్జీబ్రా లెక్క వంటిది.ఎన్ని అడుగులు వేసినా ఈక్వేషన్ లా రెండువైపులా విలువ సమానంగా ఉంటుంది..
"ప్రేమ... గణితంలో ఒకటీ ప్లస్ ఒకటి విలువ చాలా....రెండు మైనస్ ఒకటి విలువ సున్నా"!!.....
"ప్రేమలో త్రికోణమితి ప్రేమలు కూడా ఉంటాయి".....
ఓరి భగవంతుడా..! నేను అన్యాయమైపోయా...చిన్నప్పటి నుండి లెక్కలంటే నాకు మింగుడు పడని బొక్కలతో సమానం...
ఇప్పుడిప్పుడే ప్రేమని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే చివరికి ప్రేమలో కూడా ,...
ఆల్జీబ్రా లు ఆవకాయలు,త్రికోణమితులు పెట్టావా తండ్రి.......నాకెందుకింత అన్యాయం చేసావ్ అని బాధపడుతూ......
ఆ....అయినా అందరూ లెక్కలొచ్చిన వాళ్ళే ప్రేమిస్తున్నారా ఈ లోకంలో ..
లెక్కలు రాని వాళ్ళు ఎంతమంది ప్రేమించడం లేదు... అనుకుని...తరవాతి లైన్ చదివా....
"ప్రేమని.. రోడ్డు మీద నడుస్తూ అకస్మాత్తుగా అరటి తొక్క మీద కాలేసి పడటంతో పోల్చొచ్చు.....ఎలా పడ్డాడో...ఎందుకు పడ్డాడో..
చూసేవాళ్ళకి తప్పా అతనికి లేచేదాక అర్ధం కాదు".....ఈ లైన్ చదివి వామ్మో ప్రేమంటే మూతీ,పళ్ళు,నడుములు విరగ్గొట్టుకోవడమా??...అని అనుకుని...ఆఆ.....అయినా... లోకం లో ఎంత మంది ప్రేమించుకోవడం లేదు....
అని తరవాతి లైన్ చదివా....
"నిజమైన ప్రేమకి నిదర్శనం ప్రేమికులిద్దరూ...ఒకే టూత్ బ్రష్ తో తోముకోవడం"....
ఇలా అని ఎవరో" ఏకదంతం" అనే మహానుభావుడు చెప్పారు ఆ బుక్ లో......
ఛి..ఛి..ఒకే బ్రష్ తో ఇద్దరు తోముకోవడమా ప్రేమంటే...ఛి ఇదేం మాయదారి ప్రేమ అనుకుని...ఆ..అయినా ఎంతమంది ప్రేమించుకోవడం లేదు ఈ లోకం లో అనుకుని...తరవాతి లైన్ చదివా.....
"ఇద్దరిని కలిపే సిమెంటే ప్రేమంటే"....అని రాసుంది....ఇది చదివాక ప్రేమంటే ఏంటో కాస్త అర్దమయ్యినట్టే అనిపించింది..
కానీ..అందులో "KCP,Birla,Nagarjuna" సిమెంట్లలో ఏది వాడాలో చెప్పలేదు....ఇప్పుడెలా అనుకున్నా...
ఆ..మన "బ్లాగ్ మిత్రులని" అడిగితే అయిపోతుంది కదా... అని....అనుకుని..తరవాత లైన్ చదివా....
"ప్రేమికులు గుడ్లగూబ కన్నా గుడ్డి వారై ఉండాలి" అని రాసి ఉంది......వార్నీ.....ఉన్న నాలుగు కళ్ళతోనే....
రోజూ..బస్సునంబర్లు,స్టార్ ప్లస్ లోని ఏక్తాకపూర్ ..తీసిన యమ ట్విస్టింగులున్న సీరియల్లు ..,సూడలేక...
ఇంకా....జుట్టుపిలకలు పెంచుకుంటున్న, అబ్బీలను... అమ్మీలా..??..అబ్బీలా..?? ...ఎవలాళ్ళు
అని నా నాలుగు కళ్ళ తో గుర్తు పట్టలేక చస్తా ఉంటే ........ఈ ప్రేమలో గుడ్డోళ్ళు కావడం ఏంట్రా బాబు అనుకుని..
అసలు ఈ ప్రేమ అనేది పెద్ద పద్మవ్యూహం ..లాంటిది అని డిసైడ్ చేసుకుని....
Hyd లోని ప్రేమా..ప్రేమా..అనే University లో "ప్రేమ" పై PhD చేయాలని నిర్ణయించుకుని, బుక్ మూసేసా...
************************************************
ఇక పోతే బ్లాగుల విషయానికి వస్తే....
కొంత మంది బ్లాగు మిత్రులు రాసే కవితలు,కథలు..కాలేజ్ జీవితాలు,చదివాక.....
నాకు చాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలా..బాధేసింది.....
వారు రాసిన కవితల్లో,కథల్లో,వారి కాలేజి జీవితాల్లో...
అన్నీ ప్రేమకు సంబందించిన ప్రస్తావనలే.......
ఒక చెలి ఉంటుంది....ఒక చెలికాడు ఉంటాడు...చెలి విరహవేదనలో...చెలికాడు...తపిస్తూ ఉంటాడు...
ఆ చెలికాడికి, చెలి కళ్ళల్లో ప్రపంచమంతా కనిపిస్తూ ఉంటూంది...
చెలియ కోసం చూసే ఎదురు చూపుల్లో, సెకనులు..నిమిషాలుగా...
నిమిషాలు..గంటలుగా...గంటలు..యుగాలుగా, అనిపిస్తూ ఉంటాయి.....
ఇక కొందరు రాసిన కాలేజి జీవితాల్లో.....వారు ఒకరిని ప్రేమించారు...ఒకరు వారిని ప్రేమించారు..వారి ప్రేమ సఫలమో..విఫలమో
తెలీదు కానీ.....మొత్తానికి ప్రేమించారు...
*******************************
ఛి..ఛి..ఛి..ఛి..ఛి...ఇవన్నీ చదివాక నాకు నా పైనే ఛిరాకేస్తుంది...
చాలా.... బాధగా కూడా ఉంది.....
నా పైన కవితలు రాసేవారే లేరా?? నన్ను పొగిడేవారే లేరా???...నా కోసం ఎదురు చూసే వారే లేరా???
హృదయం ఎక్కడున్నది.......హృదయం ఎక్కడున్నది..
నీ చుట్టూనే తిరుగూ....తున్నది......అని నా కోసం పాట పాడే వారే లేరా?
మీనాక్షీ ,నువ్వు ఆకాశం లో" milkyపుంతవి" అని అనే వాళ్ళే లేరా?
టప.....టప....టప....టప.....ఇవి కన్నీళ్ళు.....
ఇలా... నేను... ఏడుస్తుంటే నా కన్నీళ్ళను రుమాలు తో తుడిచి ....మీనాక్షీ...ఏడవద్దు....
నీ కన్నీళ్ళు....కొహినూరు వజ్రాలు....ఎవరైనా చూసారంటే ఎత్తుకుపోతారు....
కొంపతీసి నిన్నుkidnap చేసినా చేస్తారు.....అందుకే నువ్వు ఏడవకు అని అనే వాళ్ళే లేరా?
*****************************************
లేరు..లేరు..లేరు..లేరు......లేరు
ఎలా ఉంటారు మీరే చెప్పండి...నేనసలు ఎవరినైనా ప్రేమిస్తే కదా ఉండడానికి......
అసలు నేను ఎందుకు ప్రేమించలేదంటే?????
నా... ఈ ......ఈశాదమైన గాధ విని మీరంతా తట్టుకోలేరు......తప్పకుండా ఏడ్చేస్తారు.....
నాకు తెలుసు మీ అందరివి... వీ....శాలమైన హృదయాలని......
అందుకే.... ఒక రుమాలు,ఒక 2,3 బకేట్లు పక్కన పెట్టుకోగలరు....
ఈ సారి" ఉల్లిగడ్డలని గుండ్రంగా కోసి" వాటిని చూస్తూ చూస్తూ నా flashback లోకి వచ్చేయండి ....
******************************************
అసలు నేను ప్రేమించకపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే......
1. అప్పట్లో......నువ్వు..నేను,10th class,boys,లాంటి చిన్న పిల్లలు ప్రేమించుకోవాలని చెప్పే సినిమాలు తీయాలనే ఆలోచన ఏ దర్శకునికీ రాలేదు..
ఇది చాలా బాధాకరమైనా విషయమని నేను సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్షా.....
2.ఇక సంవత్సరమంతా..నాకు...(a+b)2..,(a-b)2...లాంటి సొల్లు సూత్రాలు బట్టి పట్టడానికే సరిపోయింది...
ఇక ప్రేమసూత్రాలు ఏంటో ఎలా తెలుస్తుంది?చెప్పండి.
3.అందరూ పేపర్లతో "పడవలూ,కత్తిపడవలూ,ఇమానాలు" చేయడం నేర్పారు కానీ .....
అవే పేపర్లపై "నాలుగు ప్రేమముక్కలు" రాసి ఎవరిపైకైనా "విసరాలని" ఎవరూ చెప్పలేదు.....
4.అందరు "ముగ్గులు" ఎయ్యడం ఎలాగో నేర్పారు కానీ.....అబ్బీలను" ముగ్గులోకి దింపడం" ఎలాగో నేర్పలేదు...
బ్లాగ్ మిత్రులారా..చూసారా..నన్ను ఈ సమాజం ఒక "ప్రేమికురాలిగా" కూడా ఎదగనివ్వలేదు....
3.నేను ప్రేమించకపోవడానికి మరొక కారణం "దూర్ దర్శన్".మాయదారి దూర దర్శన్....
నన్ను,ప్రేమకు "దూర్" చేసింది.అప్పట్లో ప్రేమకు సంబందించిన సీరియల్స్ ప్రసారం చేయకపోయేవారు...
సగం సమయం "అంతరాయానికి చింతిస్తున్నామూ" అని "చింతించడానికే" సరిపోయేది....
ఇక మిగితా టైం ...గ్రామదర్శిని,టెలిస్కూల్,చిత్రలహరి,బుర్రకథలు,వార్తలు,మహాభారత్,రామాయణం లాంటి కార్యక్రమాలు ఇచ్చేవారు...
గ్రామదర్శిని లో ఏ పంటకి ఏ మందు" పిచికారి" చేయాలో చెప్పేవారు తప్ప ....
ప్రేమలో "అబ్బీ" లను పడేయడానికి ఏ మందు "పిచికారి" చేయాలో చెప్పేవారు కాదు.....
4.ఇక పోతే నా చుట్టూ ఉన్న సమాజం,మా పెద్దలు...నాకు... ప్రేమకి,దోమకి మధ్యనున్న తేడాలు చెప్పలేదు....
కాని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ప్రేమలో కూడా ప్రేయసి,ప్రేమికున్ని కుడుతుంది...ప్రేమికుడు ప్రేయసిని కుడుతాడు..
తరవాత ఇద్దరికి" ప్రేమేరియ" అనే ఒక మాయదారి రోగం వస్తుంది.....అదే" ప్రేమ" అని....
ఈ వ్యాధి యొక్క లక్షణాలు::ఈ వ్యాధి సోకిన వారికి ప్రపంచమంతా... అందంగా కనిపిస్తూంటుంది.
వీరి కాళ్ళు....భూమి పైన నడుస్తున్నా,,,మనసులు మాత్రం ఆకాశం లో" దూదిపింజల్లాగా" ఎగురుతుంటాయి...
కొత్తగా "కవిథలు" రాయాలనే "భయంకరమైన" ఆలోచన వీరిలో రేకెత్తుతుంది...
ఈ వ్యాధి సోకిన వారికి ఆకలి,దప్పికా ఉండవు....ఈ వ్యాధి బాగా ముదిరిన వారు ..ఆకాశం లోకి చూస్తూ...తమలో తామే
మాట్లాడుకుంటూ....నవ్వుకుంటూ..ఉంటారు.....ఈ వ్యాధికి చికిత్స,మందు లేదు....
**************************************************
ఇదంతా వింటుంటే మీ కన్నీళ్ళు ఆగట్లేదు అని నాకు తెలుసు ...ఇప్పటికే 2 బకేట్లు నిండిపోయాయి అనుకుంటా...
మరొకటి పెట్టుకోండి...ముందు ముందు చాలా, వీ.....శాదం ఉంటుంది.
5.ఇక అతిపెద్ద కారణం ఏంటంటే..??? ప్రేమంటే ఇదేనా..? అని నాకు తెలీక పోవడం...
మా స్కూల్లో ఒక అబ్బాయి ఉండేవాడు...పేరు ఈశ్వర్.....చాలా క్లెవర్,మంచివాడు,మనసున్నవాడు.
తను ఎంత మంచివాడు అంటే........Exams లో ఆన్సర్స్ అన్నీ చెప్పేవాడు...
అలా చెప్పడమే "ప్రేమ" అని నాకప్పుడు తెలీదు.నా cycle chain పడిపోయినప్పుడల్లా పెట్టించేవాడు.
అలా పెట్టివ్వడమే "ప్రేమ" అని నాకప్పుడు తెలీదు.
మా క్లాస్ లో ఆన్సర్స్ చెప్పకపోతే ముక్కు చెంపదెబ్బ కొట్టించేవారు.
నేనెప్పుడు ఆన్సర్ చెప్పకపోయినా ఈశ్వర్ నన్ను మెల్లిగా కొట్టేవాడు.
మిగతా వాళ్ళని గట్టిగా కొట్టేవాడు.ఆ గట్టికి...ఈ మెల్లి కి మధ్య ఉన్నదే" ప్రేమ" అని నాకప్పుడు తెలీదు.
నాకు chemistry లో elements రాకపోయేవి...,,
మీనాక్షీ,.... చెప్పమ్మా అని sir అడగ్గానే టక టకా మొదలుపెట్టేదాన్ని.
H,He,Li,Be,B,C,N,O,F,Ne,Na,Mg,Al,Si,P,S,Cl,Ar....
వరకూ బాగానే చెప్పేదాన్ని.....తరవాత బండి ఆగిపోయేది.....
అలాంటి "విపత్కరఘడియల్లో",.... ఆపద్ద్భాందవుడు సినిమా లో ,మీనాక్షీ శేషాద్రి ని చిరంజీవి ఆదుకున్నట్టు....
ఈ మీనాక్షీని ,ఈశ్వర్ ఆదుకునేవాడు......ఎనకాల నుండి" పొటాషియం,పొటాషియం"’ ..అని చెప్పేవాడు.
అలా ఎనకాల నుండి పొటాషియం,పొటాషియం.... అని చెప్పడమే" ప్రేమ" అని నాకప్పుడు తెలీదు.
మా సుబ్బారావ్ గారు నా బుళ్ళి చేతుల పై కొట్టినప్పుడల్లా ఈశ్వర్ కళ్ళల్లో కన్నీళ్ళు .......
ఇక్కడ దెబ్బల ప్రయోగానికి, అక్కడ కన్నీళ్ళ రియాక్శనే, "ప్రేమ" అని నాకప్పుడు తెలీదు.
****************************************************
ఎలా తెలుస్తుంది మీరే చెప్పండి?......అప్పుడు "గంగోత్రి" లాంటి....సినిమాలు తీయాలనే ఆలోచన ఒక్కరికన్నా రాలేదు..
ఎంతటి బాధాకరమైన విషయమిది....మీరే చెప్పండి.
అసలప్పుడే "గంగోత్రి" సినిమా వచ్చుంటే నేను,ఈశ్వర్ కూడా కాజిపేట... రైల్వేస్టేషన్ లో...కూ..కూ...కూ..
చికుబుకు....చికుబుకు....చికుబుకు...చికుబుకు..
రైలుబండి....రైలుబండి.....అని సాంగ్ సింగుకునేవాళ్ళం....ప్రేమ రైలుబండి ఎక్కేసేవాళ్ళం...కానీ
ఆ ప్రేమ రైలు కూడా మిస్సయ్యా.....ఇంక.. నాకు ఏం మిగిలింది నా తుస్సు తుపాకి....
ఇదంతా ప్రేమ అని ఇప్పుడు తెలిసేసరికి "ఈశ్వర్ ఈమానమెక్కి ఈదేశాలకు"ఎళ్ళిపోయాడు....
*********************************************
బ్లాగుమిత్రులారా!!!......ఇంకా వీటన్నింటినీ మించిన విశాద సంఘటన.. ఒక్కటున్నది.....
మా స్కూల్లో "రాఖీపూర్ణిమ" కి ఒక్క రోజు ముందుగా ABVP,SFI అన్నయ్యవాళ్ళు వచ్చేవారు...
అందరికీ "ఎర్ర రంగు దూది" రాఖీలు ఇచ్చి....మా క్లాస్ "అబ్బీలకు" కట్టమనేవారు...
ఊరికే కట్టమంటే అయిపోయేది కదా... కాని వాళ్ళు మాతో "ప్రతిజ్ఞ" చేయించేవారు...
అదేంటో... చిన్నప్పటినుండి ,నేను ఏదైనా "ప్రతిజ్ఞ" ఒక్కసారి చేసానంటే ఇక అంతే.....
ఆ "ప్రతిజ్ఞ" ఏంటంటే........నువ్వు నాకు రక్ష..నేను నీకు రక్ష..మనమిద్దరము కలిసి ఈ దేశానికి రక్ష...
ఇలా నా చేత రక్ష..రక్ష..అంటు.."ప్రతిజ్ఞ"చేపించి... అనవసరంగా వారిపై,నాకు.. కక్ష పెంచుకునేలా చేసారు..
ఇలా నా చేత బలవంతంగా ప్రతిజ్ఞ చేయించి నా "సెవ్వులో పువ్వేట్టేసారు."..
ఇంక ....నాకేం మిగిలింది నా తుస్సు తుపాకి.....స్కూల్లో అంతా అన్నయ్యలే.....
పోనీ కాలేజ్ లో చూసుకుందాం అనుకుంటే......ఈ మాయదారి ABVP,SFI అన్నయ్యలు...అక్కడికి కూడా వచ్చేవారు..
ఇక కాలేజ్ లో కూడా అందరూ ....అన్నయ్యలే........
*********************************
మరొక విషయం ఏంటంటే .....నాకు చాలా అన్యాయం జరిగిపోయింది....
చిన్నప్పుడు "ప్రార్థన" చేసేప్పుడు ... కొన్ని జాగ్రత్తలు "పాఠించమని" ఎవరూ నాకు చెప్పలేదు...
చెప్పి ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో........
రజినికాంత్ అంకుల్ లా ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అనే బాపతు కాదు..ఈ మీనాక్షీ అంటే...
ఈ మీనాక్షీ ఒక్కసారి సెప్తే లెక్కేట్టుకోడానికి ఈల్లేనన్ని సార్లు సెప్పినట్టు....
ఇంకేముంది అంత అయిపోయింది...
"ప్రతిజ్ఞ" చేసేసా.....అదేంటంటే......
భారతదేశం నా మాతృభూమి....భారతీయులంతా నా "సహోదరులు"....అని
అప్పుడే..... ఓసి మీనాక్షీ... భారతీయులంతా నా సహోదరులూ అనేప్పుడు....
బ్రాకెట్లో ఒక్కరు తప్ప..అని పెట్టుకోవే అని చెప్పేవారే కరువయ్యారు.......
ఇంకా నాకేం మిగిలింది నా తుస్సు తుపాకి.....
***********************************
...ప్చ్..ఏం చేస్తాం చెప్పండి...అంతా నా తలరాత....
ఆ రోజు నేనలా చెయ్యకుండా ఉంటే ఈ రోజు ఇలా ఉండేదా...నా పరిస్థితి...
భారతదేశం లో ఉన్న అబ్బీలంతా మన చుట్టే తిరిగేవారు.
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే....మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే..
మీనా ....నా హృదయ వీణా ......అనో...నేను కోపంగా ఉంటే...బంగారు కళ్ళా బుచ్చమ్మో....చెంగావి చెంపా లచ్చమ్మో...
కోపం లో ఎంతో ముద్దమ్మో...ఓ బుంగమూతి సుబ్బమ్మో....అని పాడే వాళ్ళు ఎంతమందో నా కోసం...
*****************************************
బ్లాగ్ మిత్రులారా నాకు తెలుసు నా ఈ హృదయవిదారకమైన గాధ విని ..మీ కన్నీళ్ళు ఆగడం లేదు...అని
plz...ఏడవకండి.....మీరు ఈ కథ చదివి ఏడిస్తే ..మీ భార్య కొట్టిందేమో అనుకుంటారు....మీ పక్కవాళ్ళు...
"అమ్మీలూ’’ మీరు కూడా ఏడవద్దు plz..వచ్చేసారి "రుమాల్లకి" బదులు "స్పాంజిలు"తెచ్చుకోగలరని మనవి..
నా ఈ బాధ విని మీ కన్నీళ్ళు తుడుచుకుని..తుడుచుకుని...మీ చేతులు నొప్పెట్టి ఉంటాయి...స్పాంజ్ అయితే
చాలా వీజి గా కళ్ళు తుడుచుకుని పిండేసుకోవచ్చు........అన్నట్టూ బకెట్లు మరవకండి..
****************************************
ఇంత బాధ లోనూ....గుండెను దిటవు చేసుకున్నా....ఎందుకంటే ..ఎవరైనా మేరే పాస్ గాడి హై..
పైసా హై...బంగ్లా హై...బాయ్ ఫ్రెండ్ హై..తేరే పాస్ క్యా హై..క్యా హై.. అంటే....
మేరే పాస్" బ్లాగ్ హై బ్లాగ్ హై" అని అంటా....
ఇక ఉంటాను.....మీ బ్లాగే మీనాక్షీ......

66 comments:

  1. chala baga rasarandi. i liked your way of narration. and the reasons u gave are really superb :)

    ReplyDelete
  2. విమర్శలు రెండురకాలు. నేరుగా గూబ గుయ్యిమనేలా చెప్పేవి, సున్నితంగా చెప్పేవి. మీరు కాస్త వ్యంగంగా చెప్పారు. మంచి ప్రయత్నం. కాని ప్రేమ అనేది యూనివర్సల్ సబ్జెక్టు. అందుకే దాని గురించి అందరు మాట్లాడుకొంటారు, చదువుతారు, రాస్తారు కూడా. మీ టపా చదివిన తర్వాత నాకొక ధర్మ సందేహం కలిగింది. అస్సలు మీ బాధ ఏమిటి? ఎవ్వరు మిమ్మల్ని ప్రేమించలేదనా? మీరు ఎవ్వరిని ప్రేమించలేదనా?

    ReplyDelete
  3. పిచ్చపిచ్చగా ఉంది నీ ప్రేమ(లేని) పురాణం.రెండు కాదు దాదాపు ఐదు బకెట్లు నిండాయి..ఈ టపా చదివి, నవ్వి నవ్వి వచ్చిన నాకన్నీళ్ళకి.

    అసలు ఆ imagination ఏంటో, ఆ narration ఏంటో, ఆ పదప్రయోగాలూ, పోలికలూ ఏమిటో..నీకు నువ్వే సాటి. శబాష్..త్వరలో ప్రేమ కలగాలని ఆశీర్వదిస్తూ...

    ReplyDelete
  4. అమ్మ నా తుస్సు తుపాకో...మీనాక్షి...నీకు కవితే కదా కావాల్సింది,నా ఫ్రెండొకడు మలేషియాలో ఉన్నాడు.వాడి ఇలాంటి పైత్యం కట్టలు కట్టలు రాస్తాడు.వాడితో రాయించనా?టపా మాత్రం అదుర్స్.

    ReplyDelete
  5. మీ పోష్టులు చాలా బాగుంటున్నాయ్. అసలు "flash back లోకెళ్ళు విధములు" అని ఒక పోష్ట్ రాసేస్తే చాలా బాగుంటుంది మీరు. మాలాంటి వాళ్ళందరూ దాన్ని రిఫరెన్స్ మెటీరియల్ గా వాడుకొని తరించడానికి.
    అసలు ప్రేమంటే ఏమిటి అనే ధర్మ సందేహం మీవల్ల మరోసారి కలిగింది నాకు. ఇక ప్రేమలో రకాలు సరేసరి వీటి గురించి కూడా ఒక పోష్టూరాస్తారని ఆశిస్తున్నాను. ఐనా ఒక్కో సినిమాలో ఒక్కో definition ఇస్తే యెవరికైనా కష్టం కాదా ఏంటి. ఒక సినిమాలో నేమో ప్రేమ caliculation అంటారు ఇంకొకదాంట్లో నేమో అదలా పుడుతుందంతే అంటారు మరొక దాంట్లో త్యాగాన్ని కోరుకుంటుందంటారు ఇంకా మరొకదాంట్లో "ఏది ఏమైనను నవగ్రహమ్ములు గతులు తప్పినను, మహా సముద్రములింకిపోయినను, చతుస్సముద్ర పర్యంత భూమండలమంతయూ దద్దరిల్లిననూ" కోరినవారిని సాధించుకొనుటయే ప్రేమ అని చెబుతారు మరి feel my love ప్రేమలు? ఆ... ఇప్పుడవికూడా తయారయ్యాయి. 10th class ప్రేమలు, college ప్రేమలు/ప్రేమకధలు మన బుర్రలకు చక్కగా వినోదాన్నందిస్తున్నాయి. ఈ ప్రేమల్లో కులగోత్రాలు, ఆస్తులూ అంతస్తులూ, కట్న కానుకల ప్రస్తావనలున్న ప్రేమలు అసలు ఈ అధ్యాయనికే highlight.

    ReplyDelete
  6. త్వరలో మీకు ’ ప్రేమ ప్రాప్తిరస్తు’ అని దీవిస్తున్నా.
    అదరింది మీ ప్రేమ పురాణం!

    ReplyDelete
  7. మీనాక్షీ......................,
    కెవ్వు కేక.కామెడి కావాలని చెప్పాగానీ మరీ ఇంతగానా అన్నం తిని వచ్చి చదవటం మొదలెట్టా కడుపులో నెప్పొచ్చింది నవ్వీ... నవ్వీ....ఇప్పుడు డాక్టర్ దగ్గరికి నువ్వే తీసుకువెళ్ళాలి.ఇంక తప్పదు మనిద్దరం ఒకటే పార్టీ అన్నావ్ కాబట్టి నీ కామెడి జ్ఞానం నాకు కొంచం కావల్సిందే.
    కానీ నాకు కోపం వొచ్చింది.నా పైన కవితలు రాసేవారే లేరా?? అన్నావ్ కదా నేనున్నాను అని నీకు గుర్తుకు రాలేదు.నీ కష్టాన్ని నా మాటల్లొ చెప్తాలే నీ అంత గొప్పగా కాకపోయినా ఏదో అలా.కానీ ఇప్పుడే కాదులే టైం వచ్చినప్పుడు.నువ్వు నీ "ప్రేమ" పై PhD పనిలో ఉండు అది అయిపోయే లోపల నేను రాసేస్తా.ok naaaaaaa ha ha haaaaaa niceone

    ReplyDelete
  8. మీనాక్షీ,
    అడ్డెడ్డె, చిన్న పిల్లలు ప్రేమించుకునే సినిమాలు అప్పుడే తీయకుండా నిర్మాతలు నీకు చాలా అన్యాయమే చేసారు సుమీ! ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదులే, మొదలెట్టొచ్చు!

    ReplyDelete
  9. వార్నీ... నీ వయసులోనే నీకు ఇన్నికకారణాలున్నాయా ప్రేమించకపోవడానికి.
    ప్చ్... కలికాలం :)

    ReplyDelete
  10. వామ్మో గంగోత్రి!! అతి భయంకర శిరోవేదనాధాత్రి!!! నేణు ఖర్మకాలి ఈ సినిమాకి ఆంగ్ల సబ్ టైటిళ్ళు రాశాను ఒకానొక కాలంలో..

    ఓ ప్రేమనెరుగని మీనాక్షీ, నీ దయామయ గాధ చదివి నా హృదయం కన్నీటితో కరిగి లెమనేడయింది (హృదయం కన్నీటితో కరగడవేంటండీ .. ఎహె, ఉండెహె, అస్సలు సెంటిమెంటు తెలీదు!). ఇంత హడావుడిగా నాలుగు కళ్ళెట్టుకుని నువ్వో అబ్బీని పటాయించినా వాడే దిక్కుమాలిన వెధవో అయ్యే అవకాశం చాలా ఎక్కువగనక ప్రస్తుతానికి క్రాంతి ఇచ్చిన మలేషియా ఆఫరు ఒప్పేసుకో.

    ఇహపోతే నీ రచన గురించి .. మధ్య మధ్యలో అదో రకం పల్లెటూరి యాస లాంటిది ఇరికించడం నప్పలేదు. అబ్బీ, పిచికారీ, త్రికోణమితి ప్రేమ సూత్రాలు .. ఇత్యాదులు మాత్రం బ్రహ్మాండం

    ReplyDelete
  11. నేను ఈమధ్య కామెంటు రాస్తే టపాలు ఎగిరిపోతున్నాయి అందుకే ఇక్కడ రాయట్లేదు.

    ReplyDelete
  12. మీ పోష్టులోని సంఘటనలన్నీ చూస్తుంటే మీకో 30-35 ఏళ్ల వయసుండేటట్టుంది. (సరదాగా-కొంపతీసి కోపం రాలేదు కదూ-థాంక్స్)
    బొల్లోజు బాబా

    ReplyDelete
  13. మీ టపా చదువుతుంటే నాకు స్వర్ణకమలంలో "మీనాక్షి" పాత్రధారి భానుప్రియ గుర్తువచ్చారు. ప్రేమ లేకపోతే మనకెంత వెలితిగా ఉంటుందో ఈ లోకం "అర్ధం చేసుకోదూ.." ఎంత రాసినా, ఎంత ఏడిపించినా.. ప్చ్...

    Good narration.. I never complete such lengthy posts!!

    ReplyDelete
  14. ఈశ్వర్ మా ఊళ్ళోనే వున్నాడు. ఏదడిగినా మీనా..ఛీ..మీనా..ఛీ అంటున్నాడు. గుచ్చి గుచ్చి అడిగితే డీకోడ్..డీకోడ్ అంటుంటున్నాడు. నాకు డయోడ్ లు ఎలక్టొరేడ్ లు తప్ప ఈ డీకోడ్ లు తెలీవు. మీ సంకేత పదం చెబితే మీ మీద కవితలు రాస్తాడట.

    చాలా బావుంది.

    -- విహారి

    ReplyDelete
  15. సమాజం నాకు కూడా ఇలాగే అన్యాయం చేసింది.అందుకే తవికలు రాసుకుంటూ బ్రతికేస్తున్నాను.నీలాగే ఎన్నో విషయాలు ప్రేమ అని తెలియక అబ్బీలనందరినీ ఫ్రెండ్స్ లిస్ట్ లో చేర్చేసుకున్నాను.నీలాగే నాకూ అన్నయ్యలెక్కువ.ఆర్ ఎస్ ఎస్ స్కూల్ లో మాకు కూడా కాషాయపు రంగు దూది రాఖీలు ఇచ్చి ప్రతిజ్ఞ [అదే.......అదే...అచ్చూ అదే ప్రతిజ్ఞ] చేయించేవారు.మా కాలేజీలో కూడా ఆ స్కూలు అన్నయ్యలే కంటిన్యూ అయిన మూలంగా నా అన్నయ్యలు తప్పించి ప్రేమికులు లేకుండా పోయారు.ఈ సమాజం నాకు చిన్నప్పుడే ప్రేమకి అర్ధం చెప్పుంటే నా బ్లాగుకి స్నేహమా అని కాకుండా హృదయమా అని పెట్టుకుని ఉండేదానిని.
    అమ్మీ....టపా కేక.

    ReplyDelete
  16. జూనియర్లు, పసివాళ్ళ ప్రేమ, నేను UKG నువ్వు LKG లాంటి సినిమాలు తియ్యని ఆతరం దర్శకులు నిజంగా శిక్షార్హులు.

    ReplyDelete
  17. :)

    Marked this post for publishing in next Blog Book (of course, with your permission).

    ReplyDelete
  18. hilarious :)))

    అలానే విహారి గారి కామెంట్ కూడా!

    ReplyDelete
  19. కెకొ కెకొ... తుస్సు తుపాకి చాలా బాగుంది... narration style చాలా బావుంది... పైన ఎవరో అన్నట్టు మీ బాద ఎంటండి? మీమ్మల్ని ఎవరు ప్రేమించ లేదనా లేక మీరు ఎవరిని ప్రేమించలేదనా?

    ReplyDelete
  20. మీనాక్షి మీ ఓపికకి జోహార్లు ఇంత పెద్ద టపా తో నవ్వించి చంపేసారు.
    విహారి గారి కామెంట్ కూడా కేక.

    ReplyDelete
  21. మీనాక్షీ టూ గుడ్... నవ్వించి నవ్వించి చంపేస్తున్నావు.

    ReplyDelete
  22. ఇప్పటికైనా మించిపోయిందేముందండీ? సినిమా అయిపోయిందంటారా?

    - చిలకపాటి శ్రీనివాస్

    ReplyDelete
  23. :))
    మీ తుస్సు తుపాకి ఊత పదం బాగా నచ్చేసింది.

    బ్లాగ్ మిత్రులారా..మీకోసం ఏడవకండి. మీనాక్షి గారి కోసం, వారి ప్రేమ కోసం ఏడవండి.

    :D

    ReplyDelete
  24. ప్రేమించకుండా వుండడమే మంచిదయింది. లేకపోతే ఇంత కథ, మంచికథ, వచ్చేది కాదు. మీరు ఇంతబాగా రాయగలరని తెలిసేదీ కాదు నాకు.
    అభినందనలు.

    ReplyDelete
  25. అమ్మ నా తుస్సు తుపాకో ...i baboooi ..i babooi meenakshi garu eragateesesarandi...shabash !!! nice post

    ReplyDelete
  26. vammo mee kanchiki vellani 'prema ramayanam' kanna kanchiki velle 3 muddulu aaru paatala 'prema *' cinemalu better emo....
    kaani mee creativityni imaginationni mechukokunda vundaleka pothunna
    hillariousga vundi...coffee table daggara solluki chaala baagu vuntundi... kaani kooorchoni intha lenght vunnadi chaadavuthoo vunnappudu oke typevi vunte kastam emo...

    ReplyDelete
  27. @ "KARTHIK" garu....hi...
    thanksssssssssssss...anDi..
    keep writing comments......
    .........................
    @ "PRATHAP" garu...hi..
    thanks 4 ur response....nenu E post premani vimarshinchadaniki rayaledu.
    మీరన్నట్టే ప్రేమ అనేది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్.ఇందులో నేను రాసిన ప్రతివాక్యం హాస్యం కోసమే.కాని వ్యంగ్యంగా రాయాలని నా ఉద్ద్యేష్యం కాదు.ఈ టపా వల్ల మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి.ఇక పోతే మీ ధర్మ సందేహం...ఇది కేవలం హాస్యం కోసం రాసాను.......................
    @ "కత్తి" గారు...నెనర్లు...ప్రతీసారీ..మీరు రాసే మీ అమూల్యమైన అభిప్రాయం నన్ను ప్రొత్సహిస్తుంది....
    కత్తి...గారు..మొత్తానికి మీ కళ్ళలో నీరు తెప్పించి ఐదు బకెట్లు నింపించానన్నమాట...
    ఇక పోతే మాష్టారు...మీ ముందు నేనెంత....పిల్లకాయని....ఇక మీ ఆశీర్వాద బల ప్రభావం ముందు ముందు ఎలా ఉంటుందో తప్పకుండా చెప్తాను...
    .....................................
    "శంకర్" రెడ్డి గారు నెనర్లు....మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్స్.....
    ............................
    "క్రాంతి గారు...మొదటగా మీతో ఒక మాట చెప్పాలి...
    మీ అభిమానిని నేను...మీ టపాలన్నీ చదివి మా అమ్మకి కూడా చెప్తూ ఉంటాను.
    ఒక్కసారైనా మీతో మాట్లాడాలని అనుకున్నా...మీ కామెంట్ చూసాక నా ఆనందానికి అవధుల్లేవు...
    క్రాంతి గారు మీరన్నది కాదంటానా?తప్పకుండా రాయించండి.....మలేషియా అబ్బీతో....

    ReplyDelete
  28. @ "అరుణ్ కుమార్" గారు....
    ముందుగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్స్...........
    ఇక పోతే నా ఈ పోస్ట్ మీలో ప్రేమంటే ఏంటీ?????
    అనే అతి పెద్ద సందేహాన్ని కల్గిస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు...కానీ మీ సందేహాలను తీర్చడానికి మీరన్నట్టు తప్పకుండా ప్రేమ..ప్రేమలో రకాలు...?మొదలైన విషయాలపై తప్పకుండా పోస్ట్ రాయడానికి ప్రయత్నిస్తాను...
    మీరన్నది వాస్తవమే ఒక్కో సినిమాలో ఒక రకమైన డెఫినేషన్ ఇస్తారు ప్రేమకి....వాటి గూర్చి కూడా మీ సందేహాలను తీర్చడానికి ఒక టపా రాయడానికి ట్రై చేస్తా.......అన్నట్టూ....ఈ పోస్ట్ just 4 fun kosam raasaanu...kaani meeru cheppinattu raayadaniki try chestaanu...e roju nunde na adhyayanam modaleDta...

    ReplyDelete
  29. @ "sHIVA" garu thankssss...anDi..
    మీరంతా ఇలా దీవించేస్తే ఎలాగండి?????
    .............
    @ NANI garu......hi....
    కడుపునొప్పి తగ్గిందా???....
    డాక్టర్ దగ్గరికి తప్పకుండా తీసుకెల్తా....
    గుర్తోచ్చారు కుమార్ గారు....కాని ఆల్రెడి మీరు కిందా,మీదా పడి.. ఒక చెలి పై రాస్తున్నారు కదా....ఇంక నా పై ఎలా రాస్తారని...అలా అన్నాను....
    అబ్బో.....అంత టైం తీసుకుంటారా?నేను ఒప్పించుకోను...హ.హ.హాఆఆఆఆఆఆఆఆఆ...
    ...................
    @ SUJATHA garu..hi...
    హమ్మయ్యా....నా బాధ మీరు అర్ధం చేసుకున్నారు....చాలా థ్యాంక్స్.....అంతేనంటారా?modalettamataara??
    .......................
    @ PRAVEEN garu....నాకైతే ఇవే కారణాలున్నాయి...మీకెమన్నా ఇతర కకారనాలున్నాయా??మీ కాలంలో.....
    ........................
    @ KOTTAPALY garu...
    నమస్తే...నెనర్లు....
    పోయి పోయి ఈ సినిమాకు టైటిల్లు రాసారా?అమ్మో...!
    మీరు సామాన్యులు కాదన్నమాట?
    మీ మాట కాదంటానా గురూజీ...క్రాంతి గారి ఆఫర్ ఒప్పేసుకున్నా....
    మీరు చెప్పినవి ఈ సారి రాసెప్పుడు ద్రుష్టిలో ఉంచుకుంటా....మరోసారి..నెనర్లు..నెనర్లు..

    @ RAJENDRA garu..నమస్తే...
    మీరు అపార్ధం చేసుకున్నారు....ఆ టాపా బాగోలేదని తీసేసా.....మీరు కామెంట్ రాసారని కాదు...పోనీలెండి ఈ మాత్రమైనా రాసినందుకు నెనర్లు...తెలియజేసుకుంటున్నా....ఇట్లు మీ సూర్యకాంతం గారి మనవరాలు..మీనాక్షీ...

    @ BAABA garu..hi..నాకు అంత వయసా?
    పదహారేల్ల పడుచుపిల్లని పట్టుకుని ఎంత మాట అన్నారు...నాకు చాలా కోపం వచ్చింది..(నేను కూడా సరదాగా).థ్యాంక్స్ అలీ గారు..

    @ PURNIMA GAARU.....
    THANKSSSSSSSSSSSSSSSSSSSS...AMMOOO bhaanupriyani gurtuteppinchaanaa???

    @ VIHAARI garu..hi....నెనర్లు...
    ఏంటి???? ఈశ్వర్ మీ ఊళ్ళో ఉన్నాడా?అక్కడ ఎవరి సైకిల్లో చైన్స్ పెడుతున్నాడంటా???ఇప్పుడు సంకేత పదాలు చెప్పి ఏం లాభం లేదు...తనని కవితలు రాయడం పక్కకి పెట్టి ఇక్కడికి త్వరగా రమ్మనండి..లేకపోతే మా నాన్నారు ఎవరో కాకరకాయల సుబ్బారావ్ కిచ్చి నా పెళ్ళి చేస్తారట...
    గురువు గారు ...మీరు టపాలు రాయడం కాకుండా ఇలా కామెంట్లు రాసి కూడా...అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు..

    @ RADHIKA garu..hi...
    thankssssssssssssssssssssss
    thankssssssssssssssssssssss
    మీకు కూడా నాలానే అన్యాయం జరిగిందన్నమాట....
    ప్చ్.ప్చ్..ఏం చేస్తాం చెప్పండి..అందరికి రాఖీలు కట్టి కట్టి..బోలెడు అన్నయ్యలను కూడగట్టుకున్నా...ఇప్పుడు జగమంతా అన్నయ్యల మయమైపోయింది.....

    @ RAJ garu thanksssssssssssssss
    thanksssssssssssssssssssssssss
    thankssssssssssssssssssssssss.
    thanks 4 ur response.....keep writing.

    @ MURALI gaaru...thankssssssssssss
    thanksssssssssssssssssssssss
    na badhani ardham chesukunnanduku thanksssssss...anDi..

    @ GAJALSRINIVAS...garu...
    chaalaaa thankssssssssssssssss.
    nenarlu,shukriya...thank u so much 4 ur response......keep writing...

    @ DEEPU gaaruuuuuuuuuuuuuuuuuu
    thank u so much.........

    @ NAVEEN GAARLA gaaruuuuu....
    thank u so much.....
    Oh tappakunDa......with pleasure.....

    ReplyDelete
  30. chaala bagundi. tussu tupaaki bale vadaru ... nice ...prema ledu ani ..preminchaledu ani baadapadakandi. vundi le manchi kalam mundu mundu naa anukondi.

    ReplyDelete
  31. @ NISHIGANDHA garu thank u so much....
    mee srivaari premalekha adirindi....
    thankssssssssssssss
    4 ur response.....

    @ VIJJU garu hiiiiiiiiiiiii.
    thanksssssssssssssssssssssssssssss
    thanksssssssssssssssssssssss
    nenu e post just 4 fun kosam raasanu...
    ha..ha..haaaaaaaaaaaaaaaaaaaaaaaa
    meeru teese pics chaala baunTayi...


    @ VIKATAKAVI garu...nenarluuuuuuuuuuuuu
    nenarluuuuuuuuuuuuuuuuuuuuuu
    nenarluuuuuuuuuuuuuuuuuuuuuuuu
    keep writing.....

    @ VENU SHRIKANTH garuuuuuuu...
    thankssssssssssssssssssssssssssssss
    thankssssssssssssssssssss

    @ hi VIDYA garu....prati saari meeru naaku response istunnanduku chaaaalaaaaaaaaaaaaa...thanksssssssss
    keep in touch...keep writing...

    @ SRINIVAS garu...thanksssss 4 ur response.....chitram ippude modalettudamanukuntunna....emantaaru?

    @ hi VENU gaaru....thanksssssssssssssssssssss
    thankssssssssssssssssss
    ayyo evaruuu eDavadduuuu...andaru navvaDanike raasaanu...venu garu...

    @ TULIKA garuuuuu...thank u....
    na tapa meeku nachinanduku i am so happyyyyyyyyyy.....thank u so much ur response.......

    @ MURALI gaaru....meeku nachinanduku santhosham......
    mee amulyamaina abhiprayanni telipinanduku thank u so much.....

    @ VAMSI ji ..thankssssssssssssssssssssssss
    thanksssssssssssssssssssssssssss
    thanksssssssssssssssssssssssss
    mottaniki meeku nachinanduku santhosham......

    ReplyDelete
  32. @ CHAITU garu hiiiiiiiiiiiiiiiiiiiiiiii.....
    inka mee comment raledentabba ani chustunnaa......thankssssssssssss
    4 ur respose.....mottaniki ippudu chusarannamata...i am so happyyyyyyyyy........sare meeru cheppinatte anukunta....undile manchi..kalam mundu..mundunaa...nenu premistanu mundu..mundunaa..

    ReplyDelete
  33. This comment has been removed by the author.

    ReplyDelete
  34. మీనాక్షి గారు,

    అదిరిందండీ. నాలాటి సీరియస్ మనిషిని కూడా బాగా నవ్వించేసారు.

    ఇకపోతే మీకు కుట్టని ఆ ప్రేమ దోమ చిన్నప్పుడు నాకు ఒకా మారు కుట్టిన గుర్టండి. ఎప్పుడో నాలుగో తరగతిలో పరీక్షలపుడు తనకు బెంచి మీద కూర్చోటానికి జాగా ఇచ్చి, నేను కింద నేల కూర్చొని peeeeeedda త్యాగం చేసినపుడు :-) కాని ఏమి లాభం తను ఆ త్యాగాన్ని గమనించక ఐదో తరగతిలోనే బడి మారిపోయింది నా మనసు ముక్కలు చేసింది :-(

    ReplyDelete
  35. @ bhaavakudan gaaru....
    mottaniki pedda tyaagam chesarannamaata....
    adi kuda 4 th class lo abboooo.

    ReplyDelete
  36. ప్రేమలేని మీనాక్షిగారు ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలు రాసేప్పుడు తెంగ్లీషు కాకుండా వయ్యారాల తెలుగు లిపిలో రాయాలని సభాముఖంగా మనవి చేసుకుంటున్నా నధ్యక్షా!

    ReplyDelete
  37. This comment has been removed by the author.

    ReplyDelete
  38. చలా బా రశావ్, నువ్వేమిటో మరోసారి చూపించావ్. కాత్తి, చాకు, తురుము... నా కామెంట్ చదవాలంటే .... పైఇఇ నుండీ అందరి కామెంట్స్ చదువుకుంటూ వచ్చేయ్.
    ఒక్కమాట... మీనాక్షి........."జీవించేశావ్"

    ReplyDelete
  39. ee rOju malli chadivaa
    Sooooper

    ReplyDelete
  40. hi,meeku abyantram lekapothe mimmalni meena ani pilusthanu.o...k,

    fine,
    meeru love cheyakapovadaniki chala reasons unnai.chala fun ga undi mee blog.
    my rating:(92/100).
    nice.

    ReplyDelete
  41. కత్తి, కేక, ఉరుము, మెరుపు అనను, ఎందుకంటే... అందరూ ఇప్పటికే అనేశారుగనక :)

    ReplyDelete
  42. ఉదయ్ గారు నెనర్లు...

    ReplyDelete
  43. ప్రేమించటం ఒక భోగం
    ప్రేమించబడటం ఒక యోగం
    ఈ పదహారేళ్ళ పడుచుకి ప్రేమించటం నేర్పకపోవటం ఒక నేరం
    మీ బ్లాగ్ చదివి కంమెంటక పోవటం ఒక రోగం

    (సొంత కవిత చెప్పే టాలెంట్ లేక ఇలా ఒక పెద్దాయన మాటలకి పారడి చెప్తున్నా.)

    ఇంతకీ మీ బ్లాగ్ చదివి అందరు నవ్వుకున్తున్నారే తప్ప ఒక్కరైనా ప్రేమిస్తున్నాను అని చెప్పరా లేదా (అదే మీ బ్లాగ్ ని లెండి)..

    ReplyDelete
  44. @ BeZaWa.. గారు....థ్యాంక్స్....
    కవిత సుఉఉఉఉఉఉపర్......
    అయ్యో కనీసం మీరైనా ఆ మాట అడిగారు..ఇన్నాల్లకి..
    ఇంతవరకు ఎవరు ఆ సాహసం చేయలేదండి..:)

    ReplyDelete
  45. ప్రేమ అంటే, నేను మాట్లాడుతున్నప్పుడు మోకాళ్ళ మీద తల వుంచి,
    నా వైపే తదేకంగా చూస్తున్న నీ కళ్ళల్లో కదలాడే ఆసక్తి.

    ప్రేమ అంటే, నీ సాన్నిధ్యంలో గంటల తరబడి మౌనంగా కూర్చుని వున్నా,
    యే మాత్రం విసుగనిపించక పొవడం.

    ప్రేమ అంటే, నీకిష్టం లేక పోయినా,
    నా ఆనందం కోసం అప్పుడప్పుడు నా మాటలను మన్నించడం.

    ప్రేమ అంటే, నాకు నచ్చకపోయినా,
    నా మంచిని దృష్టిలో పెట్టుకుని నన్ను విమర్శించడం.

    ప్రేమ అంటే, నేను నీ మీద చిరాకు పడితే, కోపం తెచ్చుకోకుండా,
    నా వొడిలో కూర్చుని నా శిరస్సును నీ గుండెల్లో పొదవుకోవడం.

    ప్రేమ అంటే, మనం పోట్లాడుకొని, ప్రచ్ఛన్న యుద్ధం ప్రకటించినప్పుడు,
    భేషజాలు వదిలి నీ అంతట నీవుగా వచ్చి నన్ను అల్లుకుపోతే,
    నీ కౌగిలిలో నాకు దొరికే భద్రత.

    ప్రేమ అంటే, కొద్ది రోజుల ఎడబాటు తరువాత నిన్ను కలిసినప్పుడు,
    సుడిగాలిలా వచ్చి నన్ను చుట్టుకుపోతే నీ హృదయ స్పందన లో నాకు వినిపించే ఆర్తి.

    ప్రేమ అంటే నువ్వు నన్ను ఉడికిస్తున్నప్పుడు ఏం చెయ్యాలో తెలియక,
    నీ ఒడిలో తల దాచుకుని ఓటమి ఒప్పేసుకొనే నా నిస్సహాయత.

    ప్రేమ అంటే, నీ పెదవులను చుంబించినప్పటి కంటే,
    నీ బుగ్గలను ముద్దు పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆనందం కలగడం.

    ప్రేమ అంటే, కొద్ది సేపు నువ్వూ, కొద్ది సేపు నేనూ, ఎక్కువ సేపు మనం.

    ReplyDelete
  46. This comment has been removed by the author.

    ReplyDelete
  47. తేటగీతి గారు..చాలా బాగా చెప్పారు "ప్రేమ" గురించి...

    ReplyDelete
  48. ఏం మాట్లాడతామండి ఇంక
    ఏం మాట్లాడతాం


    అమ్మో.. అమ్మొ...అమ్మొ....
    ఇరగదీస్తున్నారండి

    ReplyDelete
  49. బెజవా గారు,నేను ప్రేమించుదాం అనుకున్నానండి,కానీ మీనాక్షి నాకంటే వయసులో బాగా పెద్దావిడ అయిపోయింది.మనలొమనమాట తనకు యాభయ్ దాటాయి తెలుసా!!!??? :) :)

    ReplyDelete
  50. మీనాక్షిగారూ,

    మీ బ్లాగులో రెండు టపాలు చదివాను. ఇదీ, దీని తరువాతది. రాసినంత దూరమూ హాస్యం మోతాదు పెంచుకుంటూనే పోతున్నారు. సెటైర్లు, విరుపులు, షాకులు, యాసలు ధారగా పడుతూనే వున్నాయి చదివినంతసేపూ. మీరు రాసింది చదువుతూ పోతే కొంత సేపటికి మీరే (పాఠకుల) ఎదురుగా మాట్లాడుతున్నట్టు మేం నవ్వుతూ ఆసక్తిగా వింటున్నట్టు అనిపించింది. "నాకు తెలుసు మీ అందరివి... వీ....శాలమైన హృదయాలని....." లాంటి మాటల్లో 'వీ....శాలమైన' అనే expression (అభివ్యక్తి) కళ్లముందు కనిపిస్తుంది. ఇది మీ విజయం. పొగిడితే బ్లాగుక్షీణం అంటారు. ఇక ఆపేస్తున్నాను.

    కొత్తపాళీగారికి నచ్చని పల్లెటూరి యాస నాకు చాలా నచ్చింది. దాంతో ఇంకెన్నో చెణుకులు విసరవచ్చు, విరుపులు తేవచ్చు. మీ రాతలో ఆ యాస ఎప్పుడు బయటికొస్తుందో దానికీ ఒక సమయం సందర్భం implicitగా వున్నాయని నాకనిపించింది.

    ReplyDelete
  51. రానారె గారు హమ్మయ్య విచ్చేసారా..ఇన్నాల్లకి ఇక్కడికి.
    చాలా సంతోషం..మీ అభిప్రాయాన్నితెలిపినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  52. అబ్బా..చాలా కొత్తగా రాసారు!

    ReplyDelete
  53. అమ్మీ...టపా అదుర్స్.చాలా బాగా రాసావు.నీ టపా ఒకటి చదవి నీ ఫాన్ ఐపొయను.Keep it up.

    ReplyDelete
  54. మీనాక్షి గారు..నా లవ్ స్టోరీ అంతా చెప్పాకా మీ టపా చదివాను... అయ్యో అనవసరంగా చెప్పానా అని అనిపించింది. దానిమీద కూడా సెటైర్ వేసి నన్ను ఏడిపించరు కదా!!

    కష్టపడి ప్రేమ కవితలు రాసే వారి మీద satires వేస్తారా...ఇది అన్యాయం..అక్రమం...

    ఇప్పటికైనా ప్రేమించడం మొదలుపెట్టండి., తూనీగా... తూనీగా... అని కాకపోయిన ఏదో ఒక సినిమా పాట మీకోసం రడీగ వుంటుంది.

    ReplyDelete
  55. పక్కింటి(క్యూబికలు అనాలా) అమ్మయి తో మాట్లాడినట్లుగా ఉంది. చాలా బాగుంది. పాపం మీ బుచ్చి బావకు కూడా కవిథలు రాయడం రాదా. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షా...అయ్యొ నేను అబ్బీ నయినా కాకపోయానే అని విచారిస్తున్నా. చేపకనుల మీనాక్షి.
    సూపరు.

    ReplyDelete
  56. మీనాక్షి గారూ చాలా బాగా రాసారు.మీరు పాపం ముళ్లపూడి వారిని అనవసరంగా అపార్ధం చేసుకున్నారు.

    "కాసేపలా ఏదైనా బుక్ చదువుదామని తీస్తే ..అందులో కూడా "ప్రేమ" గూర్చి రాసారు..
    సరే ప్రేమంటే ఏంటో..??? మనకు తెలీదు కదా అని చదవడం మొదలెట్టా.......
    "ప్రేమంటే.. రెండు మనసులు, ఒకే.. పన్.......థాన నడుచుట"......అని రాసుంది".
    -మీనాక్షి గారు(టపా:నేను ఎందుకు ప్రేమించలేదంటే)

    "ప్రేమంటే.. రెండు మనసులు, ఒకే.. పన్.......థాన నడుచుట......"
    కథ:ఇద్దరమ్మాయిలు-ముగ్గురబ్బాయిలు రచన:ముళ్లపూడి వెంకటరమణ.

    ఆ వాక్యం కూడా ప్రేమ అంటే ఏంటో చెప్దామని కాదు అలా చెప్పే సినిమాలని సెటైర్ చేద్దామని.ఆ కథ అంతా ప్రేమ,రాజకీయం,సినిమాలని సెటైర్ చెయ్యడానికి,విషాదాంత ప్రేమ కథలతో కర్చీఫ్ లు స్పాంజిలు తడపి ప్రజల్లో ప్రేమలూ,త్యాగాలు మొలకెత్తించిన శరత్ చంద్ర అనువాద నవలల్ని ఏకి వదిలిపెట్టడానికి వాడారు ముళ్లపూడి.
    ఇదంతా ఎందుకు రాసానంటే ప్రేమని కమర్షియలైజ్ చేసేవాళ్లను,అలాంటి వాళ్లు చెప్పింది ప్రేమ అనుకుని ఎగిరే వాళ్లని ఎత్తిపొడిచే పనిలో అదే పని యాభై ఏళ్లక్రితమే సమర్ధంగా చేసిన రచయితను(రిఫర్:ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలు,భగ్న వీణలూ-బాష్పకణాలు)పై కూడా సెటైర్ చేసారు అని చెప్పడానికి మాత్రమే. (ఇదంతా మీకు ముందే తెలిసినా,కామెడీగా రాస్తే లిటరల్ గా తీసేసుకున్నాడు అనిపించినా అయాం సారీ.అలాంటి అభిప్రాయాలు ఉన్నవాళ్లతో కామెంట్ల యుద్ధం చెయ్యలేను.
    bcoz i feel writing comedy is a serious job)

    ReplyDelete
  57. premanu minchi edaina vinaali chadavaalani unTae....click me...

    www.srivahini.blogspot.com

    ReplyDelete