Friday, July 11, 2008

పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా..!!!.( సినిమా..)


మూగవోయిన నా గళమ్మునను కూడా నిదురవోయిన సెలయేటి రొదలు కలవు....
అన్న" కృష్ణశాస్త్రిలా",నేను నోర్మూసుకుని ఉందామనుకున్నా....కాని..బాధలు ఎవరికైనా చెప్పుకుంటే
మనసు తేలిక పడుతుంది అంటారు కదా...అందుకే నా బాధను మీతో పంచుకుంటున్నా.....
**************************************************
3 నెల్లు అయింది....వరంగల్ కి వెళ్ళక......కాని , మొన్నతప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది....ఎందుకంటే
మా బబ్బీగాడు కాల్ చేసి మీనక్క.. బుచ్చిబావ కి accident అయింది నువ్వు వచ్చేయ్..
అన్నీ విషయాలు నీకు ఇక్కడికి వచ్చాక చెప్తాను...అని చెప్పి కాల్ కట్ చేసాడు..
వరంగల్ కి వెళ్ళేసరికి చాలా పొద్దు పోయింది....అన్నం తినేసి పడుకున్నా......!!!
"చిరంజీవి" వస్తే అభిమానులు పిలవకుండా ఎలా వస్తారో...
"నేను" వచ్చానని తెలుసుకొని మా వరంగల్ దోమలు,ఈగలు..బస్సులు,లారీలు,ఆటోల మీద....వచ్చాయి...
అవి తెల్లవార్లూ నాకు ఒకటే, "ముద్దులు"...వద్దన్నా వినకుండా....దుప్పటి లాగి మరీ పెట్టాయి........
*********************************************
తెల్లవారింది...నేను,బబ్బీ త్వరగా Hospital కి వెళ్ళాలని ready అయిపోయాము....
ఇంతకి ఎవరిని చూడ్డానికి వెల్తున్నామో.....అనుకుంటున్నారా..?
నాకు తెలుసు మీకు తెలుసుకోవాలని ఉందని......మా "బుచ్చిబావ" ని చూడ్డానికి వెల్తున్నాం...
"ఈ బుచ్చిబావ" ఎవరబ్బా.?..మీను మాకు ఎప్పుడు చెప్పనేలేదు..
అనుకుంటున్నారా..ఐతే ఇప్పుడు చెప్తాను మీకందరికి .....మీరంతా ఏం చేస్తారంటే,
ఒక బకెట్లో..వాటర్..తెచ్చుకోండి..(అయ్యో బట్టలుతకడానికి కాదండోయ్ Flashback లోకి వెళ్ళడానికి..)
తరవాత అందులో..ఒక రాయి వేయండి.....వేసేసారా....ఇప్పుడు అందులో తరంగాలు మొదలవుతాయి.....
ఒక తరంగం,రెండు తరంగాలు,మూడు తరంగాలు,నాలుగు తరంగాలు.....
అలా ఆ తరంగాలను చూస్తూ చూస్తూ ....నా flashback లోకి దూకేయండి........
*************************************************************
ఆ రోజు ఏం జరిగిందంటే......???
నాన్న గారు అప్పుడే వచ్చారు...నేను,బబ్బీ ఏదో మాట్లాడుకుంటున్నాము....
నాన్న గారు నన్ను,బబ్బీ ని పిలిచి రేపు మన ఇంటికి బంధువులు వస్తున్నారు..అని చెప్పారు....
మీరిద్దరు.." కోతిచేష్టలు" చేయకుండా..బుద్ధిగా ఉండాలి అన్నారు......
సరే అని ఇద్దరం తలలూపాం..........
లోపలికి వెళ్ళాకా మా బబ్బీగాడు చెప్పాడు....మీనక్క...నీకు తెలుసా..
వాళ్ళను రమ్మనడం వెనక ఒక పెద్ద కారణం ఉంది.....
వాళ్ళకు ఒక్కగానొక్క "పుతేర". (సుపుత్రుడు) ఉన్నాడు.....అతని నామధేయం "బంక వెంకట రమణా రెడ్డి"..
అలియాస్ "బుచ్చిబాబు"..(MBBS).
"ఇతనికి కుడిపక్క అమ్మా,ఎడమ పక్క నాన్న తప్పా వెనకా,ముందు ,పెద్దగా ఆస్తి పాస్తులేమి లేవు"..
కాని అబ్బాయి "చుక్కల్లో చంద్రుడు..,మంచివాడు,బుద్ధిమంతుడు"...
వాళ్ళు మనకి దూరపు బంధువులు..వరసకి అత్తయ్య,మావయ్య అవుతారు..
ఇక పోతే ఆ బుచ్చిబాబు గారు మనకి "బావ" అవుతాడే మీనక్క....
ఒక వేళ.. ఆ బుచ్చిబాబుకి నువ్వు,నీకు బుచ్చిబాబు నచ్చితే తరవాత
పిపిపి.....డుం..డుం..డుం..అన్నమాట..అని అసలు సంగతి చెప్పాడు...
**********************************************
మా నాన్న గారు నా పెళ్ళికి ఇంత తొందర పడుతున్నారేంటబ్బా అనుకుంటున్నారా...?
అయ్యో..రామా..!మళ్ళీ అదో పెద్ద..Flashback...
ఈనాటికి..సరిగ్గా 22 సంవత్స్రరాల క్రితం...ఈ భూమిపై ఒక "అద్భుతం" జరిగింది...
ఆ రోజు..Feb 14th..రాత్రి ..సమయం..సరిగ్గా 10.32 min.,,అవుతుంది.
అప్పటివరకు ఆకాశంలో ఏ మూలో నక్కి ఉన్న కారుమబ్బులు
వేగంగా కమ్ముకోసాగాయి...ఒకటే ఉరుములు,మెరుపులు,వర్షం...తుఫాను..అప్పుడే..నేను పుట్టాను..
నేను చిన్నగా ఉన్నప్పుడే "హిమాలయాల" నుండి ఒక "బాబా" వచ్చారంట...
నన్ను చూసి....ఈ అమ్మాయి "మామూలు అమ్మాయి" కాదు...
"బ్రహ్మకి ఇష్టపుత్రిక"...."కారణజన్మురాలు"....ఈ పాప ఏ పని చేసినా అందులో ఒక "ప్రత్యేకత" ఉంటుంది.
ఈ సొట్టబుగ్గల.. అమ్మాయిని చేసుకోబోయే వాడు....చాలా "పూజలు చేసిన వాడై" ఉంటాడు.
పూర్వ జన్మలో ఎన్నో "నోములు నోచిన వాడై" ఉంటాడు.....ఈ అమ్మాయి...
ఎక్కడ అడుగు పెడితే అక్కడ "లంకెబిందలే"....దొరుకుతాయి....ఎడారిలో అడుగు పెడితే
అక్కడ కూడా "వరదలొస్తాయి"...అని చెప్పారంట...మరేమనుకున్నారు.."మీనాక్షా..మజాకా"..!
అందుకే కాబోలు...మా నాన్న గారికి...ఒకసారి...పెరట్లో తవ్వుతుంటే..."బంగారం" దొరికింది....
అన్నట్టు ఈ మాట మీరు మళ్ళీ ఎవరితో అనకండి......మీతోనే అంటున్నా...!
ఇది మీకు ,నాకు మద్య్హలో ఉండాలి సుమండీ....అసలు నేనేమి అనలేదు,మీరేమి వినలేదు సరేనా..
***************************************************
నా కోసం పూజలు చేసేవాడు ఆ బుచ్చిబావే అయ్యింటాడేమోనని మా నాన్న గారి..అనుమానం..
అన్నట్టు మా బబ్బీ గాడి గురించి మీకు చెప్పలేదు కదూ...వాడు మా పిన్ని కొడుకు.
ముద్దుగా,బొద్దుగా ఉంటాడు.
చుట్టాలు వస్తున్నారు అని నాన్న గారు చెప్పగానే,మా బబ్బీ గాడికి ఒకటే సంతోషం .
పెద్దనాన్న,మనం షాప్ కి వెళ్ళి స్వీట్స్ తీసుకొద్దామా...అని అనేసాడు....
వాడికి నచ్చినవన్నీ కొనిపించుకున్నాడు...ఇంటికివచ్చాక మళ్ళీ వాడి ప్రసంగం మొదలైంది.
మీనక్క.. ఆ బుచ్చిబావ చాలా మంచివాడటే..
అల్లం బెల్లం అంటూ ఏదేదో చెప్పాడు....అన్నీ తెలిసిన ఆరిందలా...
**********************************************
చక్కగా నా మానాన నేను... "రామా రామా రామా నీలీ మేఘశ్యామ ..
రామా రఘుకుల సోమా భద్రాచల శ్రీరామా"....అని ఊరికే అలా పాడుతుంటే బబ్బీగాడొచ్చి....
మీనక్క....వాళ్ళని impress చేయడానికా..ఈపాట...ఏడ్చినట్టుంది.
ఇలాంటి పాటలు సినిమాల్లోనే బాగుంటాయి....ఎందుకంటే హీరోయిన్
పాట పాడుతుంటే వెనకాల నుండి Background music..వస్తుంది....
మరి మనం పాడితే ఏమి రాదాయే..!.....అందుకే నువ్వు ఆ పాట పాడకు అన్నాడు....
మనం ఏం చేసినా sensational గా ఉండాలి....ఒక "ప్రత్యేకత" ఉండాలి....
మరి ఏం పాడనురా బబ్బీ అని అడిగా....
"వాషింగ్ పౌడర్ నిర్మా..వాషింగ్ పౌడర్ నిర్మా....పాలలోని తెలుపు నిర్మాతో వస్తుంది...
రంగూల బట్టలే తల తల గా మెరిసేను...అందరూ మెచ్చిన నిర్మా...
వాషింగ్ పౌడర్ నిర్మా..శంకర్ దయాల్ షర్మా"......
నువ్వు ఈ పాట పాడుతుండు.....నేను వెనకాల నుండి నిర్మా..నిర్మా...అంటు
కోరస్ ఇస్తాను....అర్దమైందా....అన్నాడు ...వెధవా..!!!
***********************************************
తెల్లవారి పదింటికల్లా..రమణ గారి అమ్మా,నాన్న వాళ్ళు వచ్చేసారు...
కానీ...ఈ "నవాబ్ ఆఫ్ పటౌడి" గారు మాత్రం రాలేదు.....అంతలో బబ్బీగాడు అన్నాడు..
మీనక్క ఎవరో "పూలరంగడు" వస్తున్నాడే...అని..తను గేట్ తీసి అడుగు పెట్టారో లేదో....
"పిట్టలన్నీ ఆయనకి...రెట్టలతో స్వాగతం పలికాయి"...పాపం సిగ్గుపడుతూ ఇంట్లో అడుగుపెట్టారు....
అసలు సిగ్గుపడడం అబ్బాయిల లక్షణమని నాకు 5th class లోనే తెలిసింది..
ఆ వివరాలన్ని తరవాత చెబుతాను.......మీకందరికి..(ఎందుకంటే మళ్ళీ అదో పెద్ద flashback.)
నాన్న గారు...నన్ను,బబ్బీని బుచ్చిబాబు గారికి పరిచయం చేసారు.....
అలా..అలా...ఆ రోజు ముగిసింది.....
*********************************************
బుచ్చిబావ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు.....
ఒక రోజు బబ్బీ ,నేను సినిమాకి వెల్తుంటే బుచ్చిబావ వచ్చాడు...
ఎక్కడికి వెల్తున్నారు..అని అడిగితే సినిమాకి అని చెప్పాం....
ఐతే నేను మీతో వస్తా...అన్నాడు.....సరే అని ముగ్గురం బయలుదేరాం...
సినిమా స్టాట్ అయింది....అందరం చూస్తున్నాం....ఆ సినిమా చాలా ట్ర్రాజెడి....
మా బుచ్చిబావ ఆ సినిమాలో లీనమై తన "భావోద్వేగాలను నియంత్రించుకోలేక".....
"భయంకరంగ ఏడవడం" మొదలెట్టాడు..ఆయన ఏడుపుకి జడుసుకుని చాలా మంది
ప్రేక్షకులు సినిమా చూడ్డం మానేసి ఈయన్ని వింతగా చూడ్డం మొదలెట్టారు....
ఇంతటితో కథ ముగిసిందా అంటే అదీ లేదు....ఆ సినిమాలో ఎక్కడైనా jokes వస్తే పెద్దగా నవ్వుతూ..
మా బబ్బీగాడి వీపు మీద చరవడం......పాపం ఆ రోజు బబ్బీ గాడు అయిపోయాడు...
***********************************************
తిరిగి ఇంటికి వస్తుండగా....బబ్బీగాడు.. మీనక్క..పుచ్చకాయ కొందామా...అన్నాడు...
అప్పుడు మొదలెట్టాడు బుచ్చిబావ "పుచ్చకాయ పచాపచా"....
"మనం ఎలాంటి కాయ కొనాలంటే.....మందపాటి తొక్కలతో..బరువుగా ఉండే కాయల్ని ఎంపిక
చేసుకోవాలి...చూపుడు వేలు లేదా..మధ్యవేలితో కాయ మీద గట్టిగా్ కొట్టి చూస్తే -
"ఎక్కడో-నూతిలో నుంచి వచ్చినట్లుగా శబ్దం వినిపిస్తే" అది తియ్యని గుజ్జున్న తాజా కాయేనని గుర్తించాలి.
నేల మీద ఆనుకునే కాయ భాగం తెల్లగానూ ఆకుపచ్చ రంగులోను కాకుండ కాస్త పసుపురంగులోకి మారి
ఉంటే అది బాగా పండినకాయే....అని గుర్తించాలి.(పైపెచ్చు మా బుచ్చిబావ ఊతపదం)
పైపెచ్చు పుచ్చకాయరసంలో తేనె కలుపుకుని తింటే గుండెజబ్బులు నయమవుతాయి..
పైపెచ్చు తాపం తగ్గాలన్న,,చెమట ద్వారా పోయే ఖనిజలవణాల లోపం తగ్గాలన్న పుచ్చకాయ తిని తీరాల్సిందే..
పైపెచ్చు ఈ పుచ్చకాయ పైతోలుకు ఎర్రని గుజ్జుకు మధ్య తెల్లని భాగాన్ని "కూర" చేసుకుని తినచ్చు.
పైపెచ్చు లోపలి గింజలను తీసి వేయించి వాటిపై "పొట్టుతీసి" తినచ్చు....
ఇలా పుచ్చకాయ గురించి చెప్పుకుంటు..పోతూనే ఉన్నాడు...
మీనక్క పుచ్చకాయ వద్దు గిచ్చకాయ వద్దు.....త్వరగా ఇంటికి వెల్దామే.. అన్నాడు...బబ్బీగాడు..
ఇంటికి వెళ్ళాక అమ్మ ...సినిమా ఎలా ఉందిరా బబ్బీ....
అని అడిగితే "పుచ్చకాయ" లా ఉంది అని చెప్పాడు బబ్బీగాడు...ఆ రోజు ఏలాగోలా ముగిసింది..
*****************************************
అలా అలా రోజులు గడిచిపోతున్నాయి....అంతలో నా results వచ్చాయి...
నా Results రోజు అందరు "ఉత్కంఠంగా" ఎదురు చూస్తున్నారు....ఫలితాలు ఎలా ఉంటాయో అని...
నేను మా college first వచ్చాను...(ఇది నిజమేనండోయ్)
దేవతలార ఈ సారి పాస్ చేయండి చాలు..మీ చుట్టు..
108.. చుట్లు తిరుగుతాను అని ఎన్నో మొక్కులు మొక్కాను....
కాని ఏకంగా college first తెప్పించేసారు...ఇక మొక్కులు తీర్చాలి కదా..అనుకుని..
తెల్లవారగానే "భద్రకాళిగుడి" కి బయలుదేరాం...నేను,బబ్బీ....
అంతలో మా బుచ్చిబావ వచ్చాడు...వామ్మో ..బుచ్చిబావ వచ్చాడే మీనక్క...అన్నాడు బబ్బీ..
ఇప్పుడెలాగే...అన్నాడు...అయ్యో గుడికి వెళ్తున్నాము అని చెబుదాము లేరా..!అన్నాను...
బావ రాగానే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు...
ఉన్న కథా కమామిషు అంతా చెప్పాం ...(రాడేమో అనుకుని...)
నేను వస్తాను మీతో అన్నాడు...ఇంకేం చేస్తాం సరే అని వెళ్ళాం....
నేను చుట్లు తిరగడం స్టాట్ చేసాను....మా బబ్బీ గాడు కూడా నాతో పాటు తిరగడం మొదలెట్టాడు..
ఒరేయ్ నిన్ను చుట్లు లెక్కపెట్టమని చెప్పాను కదరా..వెధవ..నువ్వు ఎందుకు తిరుగుతున్నావ్ అంటే...
మీనక్క..బుచ్చిబావ..."పుచ్చకాయ పచాపచా"..మళ్ళీ ఎక్కడ మొదలెడతాడో..అని భయంగా ఉందే...
అందుకే ఇలా నీతో చుట్లు తిరుగుతానే..కనీసం పణ్యమైనా వస్తుంది కదే...!
ఇప్పుడా "పుచ్చకాయసుత్తి" నేను భరించలేనే..మీనక్కా..అన్నాడు..
మరి బుచ్చిబావ...ఎలా రా..?అంటే...మనం చుట్లు తిరిగుతుంటే లెక్కపెట్టమని చెప్పానక్క..అన్నాడు..
********************************************************
మొక్కు తీరింది...ఇక ఇంటికి బయలుదేరాం.....
నేను,బబ్బీ చాలా అలసిపోయాం.....అంతలో అమ్మ ఇక భోజనాలకి లెగండి..అని కేక...
అన్నం తిని కూర్చున్నాము...అంతలో బుచ్చిబావ "పొడుపుకథలు పొడుద్దామా" అన్నాడు..
సరే అన్నాం.....ఇద్దరం బుద్ధిలేకుండా..!!..బుచ్చిబావ పొడిచాడు ఒక పొడుపు...
దానికి మేమిద్దరం ఢమాల్....."లక్కబుడ్డి నిండా లక్షవరహాలు"..చెప్పుకోండి చూద్దాం....
అన్నాడు...మాకు తెలీదు బావ అన్నాం ఇద్దరం.....ఓస్ ఆ మాత్రం తెలీదా.."పుచ్చకాయ"...అన్నాడు..
మళ్ళీ మొదలైంది "పుచ్చకాయ పచాపచా"..!!!
నీకు తెలుసా మీను పుచ్చకాయతో "పచ్చడి" కూడా చేయోచ్చు...
ఓరి దేవుడా..!..ఈ సారి పుచ్చకాయ పచ్చడా.....?
****************************************************
మీను అసలు పుచ్చకాయ పచ్చడి ఎలా చేస్తారంటే....పుచ్చకాయ లోపలి ఎర్రని పదార్థం తినేయగా
మిగిలిన చెక్కు, పావుకిలో,నువ్వులు,ధనియాలు,జీలకర్ర,మెంతులు.వెల్లుల్లి,అల్లం,చింతపండు....
మొదలైనవి సిద్ధం చేసుకోవాలి...అన్నీ కలిపి మిక్సీలో వెయ్యాలి...
తరవాత అని....అంటుండగానే....బబ్బీగాడు..మీనక్క నాకు పొట్టలో నొప్పిగా ఉంది అంటు వెళ్ళిపోయాడు...
తరవాత బుచ్చిబావ పుచ్చకాయ పచ్చడి,పుచ్చకాయ తొక్కల ఫ్రై,పుచ్చకాయ చట్ని.పుచ్చకాయ హల్వా,
ఇలా రకరకాల వంటలు...ఇంకా పుచ్చకాయ పుట్టుపుర్వోత్తరాలు..అన్ని చెప్పాడు..
ఇదంతా, విన్న నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు...బావ తలనొప్పిగా ఉంది నేను పడుకుంటా అన్నాను..
***************************************************
బబ్బీగాడు రాత్రి పడుకునేముందు నా దగ్గరికి వచ్చి మీనక్క....ఈ బుచ్చిబావతో నువ్వు వేగలేవే అన్నాడు..
ఒక వే్ళ నీ పెళ్ళి బావతో గనక ఐతే..నేను మాత్రం మీ ఇంటికి రానే...అన్నాడు..
ఎందుకురా..అంటే వామ్మో....బుచ్చిబావ చెప్పే" పుచ్చకాయ పచాపచా"..వినాలి...
ఇంకా ఆ దిక్కుమాలిన..."పుచ్చకాయ కూర","పుచ్చకాయ పచ్చడి","పుచ్చకాయ చట్ని,
"పుచ్చకాయ హల్వా","పుచ్చకాయ బిర్యాని" తినలేక చావాలి.....తలుచుకుంటేనే భయంగా ఉందే..
నేను రానే మీ ఇంటికి అన్నాడు...ఓరేయ్ బబ్బీ .,,బుచ్చిబావతో నా పెళ్ళి చేస్తే ఎలా ఉంటుంది అని అమ్మ
నాన్న అనుకున్నారు అంతే...గాని.. బుచ్చిబావకి నా పై అలాంటి అభిప్రాయం లేదురా
సో నో ప్రాబ్స్.....అన్నాను....ధీమాగా..
*********************************************************
తరవాత ఒక రోజు బుచ్చిబావ వచ్చి మీను..నేను..US వెల్తున్నాను...అని చెప్పాడు..(MS చేయడానికి)
మీను నేను ఇంకో..10 days తరవాత వెళ్ళిపోతా అన్నాడు...బుచ్చిబావ దిగాలుగా.
10 days తరవాత వచ్చి,బబ్బీ,మీను నే వెల్తున్నాను...
అప్పుడప్పుడు కాల్ చేస్తాను...సరేనా..అని చెప్పి వెళ్ళిపోయాడు...
*************************************************************
మళ్ళీ మొన్నే వచ్చాడు సరిగ్గా సంవత్సరం తరవాత.....US నుండి.......వాళ్ళ చెల్లి పెళ్ళికని...
వస్తుంటే..చిన్నaccident అయింది...
కొంచెం నడుము విరిగింది..అంతే..!..మిగతా అంతా ఓకె..నేను,బబ్బీ చూసి రావడానికి వెళ్ళాం...
వెళ్ళేప్పుడు పుచ్చకాయ తీసుకెడదామా..మీనక్క..అన్నాడు బబ్బీ వెధవ...
నువ్వు ముందు నోర్మూసుకుని పద అన్నాను...
******************************************
బుచ్చిబావ ఎలా ఉన్నావ్ అన్నాను...ఆ ఇప్పుడు పర్లేదు అన్నాడు....
అయ్యో పెళ్ళికి అని వస్తే ఇలా జరిగిందేంటి బావ ..అన్నాను...మేము బాగానే వస్తున్నాం మీను ..
వాడే గుద్దేసాడు......వెధవ..అన్నాడు....పోనీలే... మీను నువ్వు,బబ్బీ ఎలా ఉన్నారు..?
"నేను మీ ఇద్దరిని చాలా మిస్ అయ్యాను తెలుసా"...అన్నాడు....
"మేము కూడా నిన్ను చాలా మిస్ అయ్యాం బుచ్చిబావ అన్నాడు బబ్బీగాడు"....
అంతలో బుచ్చిబావ అన్నాడు..మీను..నేను...ఈసారి అమ్మ,నాన్నతో మన పెళ్ళి
గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను......అని.
ఈ వార్త విని...నాకు,బబ్బీకి నెత్తిపైన "పుచ్చకాయ" పడ్డట్టైంది....
అంతలో నేనే అన్నాను.. జోకులు వేయకు బావ..అని..జోకులు కాదు మీను..ఇది నిజం ...
ఓరుగల్లుకే.. పిల్లా పిల్లా..ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే..
ఓరచూపులే రువ్వే పిల్లా..ఏకవీర నువ్విలా ఉన్నావే..అంటూ ..పాటలు పాడ్డం మొదలెట్టాడు..
బుచ్చిబావ పాట బాగానే ఉంది కానీ... నేనెందుకు బావ నీకు...
నా కన్నా మంచి పిల్ల దొరుకుతుంది నీకు అన్నాను నవ్వుతూ..(ఏడవలేక)
నేను జోకులు వేయడం లేదు మీను..ఇది నిజం....కట్టుకుంటె నిన్ను తప్పా..
కట్టుకోనే కట్టుకోను...ఒట్టు పెట్టుకుంటినమ్మో బెట్టు చేయకే....అన్నాడు..బుచ్చిబావ...!!!
***********************************************
తరవాత అసలు ఏం జరుగుతుంది...ఈ కథ ఎటు మలుపు తిరుగుతుంది..
ఇంతకీ బుచ్చిబావకి,మీనుకి...సయోధ్య కుదిరిందా....?
సయోధ్య కుదరక..అయోధ్యలో అగ్నిగుండం బద్ధలైందా..? అసలేం జరిగింది...
తెలుసుకోవాలని మీకందరికి ఆత్రుతగా ఉంది కదూ....
తరవాతి కథ మీరు తెలుసుకోవాలంటే నేను త్వరలో .....తీయబోతున్న సినిమా చూడాల్సిందే....
బడ్జెట్ ఎంతో తెలియదు కాని సినిమా పేరు మాత్రం "పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా"..!!!
***************************************************

53 comments:

  1. :)))))))
    అమ్మో మీనాక్షీ పొద్దుపొద్దున్నే ఎంతలా నవ్వించేసారు!! నవ్వీ నవ్వీ నాకు కన్నీళ్ళు ఆగటంలేదు.. ప్రతీ వాక్యం ఫన్నీ గా ఉంది!

    ముఖ్యంగా ఇవి తెగ నచ్చేసాయి..

    "చిరంజీవి వస్తే అభిమానులు పిలవకుండా ఎలా వస్తారో.."
    "సినిమా ఎలా ఉంది రా అబ్బీ అంటే పుచ్చకాయలా ఉంది.."
    "పిట్టలన్నీ రెట్టలతో స్వాగతం పలికాయి.."
    "నెత్తిపైన పుచ్చకాయ పడ్డట్టైంది.."

    ReplyDelete
  2. అవునా మీనాక్షి??

    ReplyDelete
  3. చిత్తగొట్టేశావ్!! సూపరూ!! చాలా రాయలని ఉంది. మళ్ళ వచ్చి చెప్తా!!

    ReplyDelete
  4. :-))) ఉదయం శుభారంభం...పొద్దున్నె నీ పుచ్చకాయ కష్టాలు చెప్పి పిచ్చ పిచ్చ గా నవ్వించేసావ్ మీను... చాలా చాలా బావుంది. నీ సినిమా కోసం ఎదురు చూస్తున్నా... నీ సినిమా కి టిక్కెట్ తో పాటు ఒక పుచ్చకాయ బద్ద ఫ్రీ అని పబ్లిసిటీ మొదలెట్టేయ్...బోలెడు బుచ్చిబావలు వస్తారు నీ సినిమా చూడ్డానికి....

    ReplyDelete
  5. మీనాక్షి,
    నాలా సీరియస్ టైపు వాళ్ళని కూడా తెగ నవ్వించేస్తున్నారు మీరు.
    అమ్మో పాపం, (ఈ పాపం మీకు కాదు లెండి. మీ బుచ్చి బావకి, మీతో ఎలా వేగుతాడో ఏమో.)

    ReplyDelete
  6. BTW, తెలుగులో వ్యాఖ్యలు రాస్తున్నందుకు చాలా సంతోషం.

    ReplyDelete
  7. చాలా బాగుంది మీ పుచ్చకాయ పచా పచా. ముఖ్యంగా
    1."చిరంజీవి" వస్తే అభిమానులు పిలవకుండా ఎలా వస్తారో...
    2."ముద్దులు"...వద్దన్నా వినకుండా....దుప్పటి లాగి మరీ పెట్టాయి........చాలా బాగుంది
    అంత భాద లోను మీ బావ ఒరుగల్లు కే పిల్ల ... అన్నాడు అంటే ...కొంచెం ఆలొచించాలి ... ఎమంటారు???. ???.

    ReplyDelete
  8. అయ్యో మీనాక్షి,
    మీ ఇద్దరికి సయోధ్య కుదిరితే మీ ఇంటినిండా పుచ్చకాయలే పుచ్చకాయలన్నమాట,రాఘవేంద్రరావ్ సినిమాల్లో పాటలు గుర్తుకొస్తున్నాయి :)
    పుతేర-మొదటిసారి ఈ పదం వింటం.

    ReplyDelete
  9. పిచ్చ పిచ్చ గా నవ్వించేసావ్ ..........keaka

    ReplyDelete
  10. మీనాక్షి,
    ఐతే మీ పెళ్ళెప్పుడు. మేమందరంకలిసి తలో పుచ్చపండు పంఫిస్తాములే.. అదేంటో ఈ అమ్మాయిలు ఈ మధ్య తెగ గోల చేస్తున్నారు. ముఖ్యంగా క్రాంతి, మినాక్షి,,, ఇంకా..

    ReplyDelete
  11. TGIF !

    ఫ్రైడే ఫన్నీ పోస్టింగ్ తో చితగ్గొట్టేసారు...(అదే పుచ్చకాయని !)

    :))

    ***** పోస్ట్

    ఇంతకీ మీ బుచ్చి బావ వాళ్ళకి పుచ్చకాయ తోట లాంటింది ఏమైనా ఉందా?

    ReplyDelete
  12. ఎప్పటిలాగే... అదిరింది. నీ హాస్యం సన్నివేశాల కల్పనల్లో,పదాల ఎంపికలో,ఛెళుకుల కుమ్మరింతల్లో ప్రతి కోణంలో శ్రేష్టం..అతి శ్రేష్టం. ఇక సినిమా తప్పకుండా తియ్యాల్సిందే!

    ReplyDelete
  13. చూడమ్మా బుజ్జి మీనాక్షీ,

    ఇలా పుచ్చకాయల్తో కూడా జనాల్నిఏడిపిస్తారా?

    చిత్రగుప్తుడు లెక్కలు మొదలు పెట్టాడు.
    1. ఈశ్వర్
    2. బుచ్చి గాడు
    3. బన్నీ
    4. చక్రం
    5. ???

    జాగ్రత్తమ్మా మీనాక్షమ్మా.

    -- విహారి

    ReplyDelete
  14. చాలా నవ్వించారు :))))

    "సయోధ్య కుదరక..అయోధ్యలో అగ్నిగుండం బద్ధలైందా..?"
    తెలుసుకోవాలని 16 మంది waiting ఇక్కడ... త్వరగా పోస్ట్ చేయండి.

    ReplyDelete
  15. మీనాక్షి గారు.. టపా అదిరింది.. చాలా బాగా రాస్తున్నారు :)

    ReplyDelete
  16. HI MEENAAKSHI,
    OKA PEDDA PUCHHAKAAYA TOO DISTI TEEYINCHUKOO AMMAKI CHEPPI...
    ANDARUU NEEKU BAAGAA DISTI PETTESAARU

    SRI PRIYA

    ReplyDelete
  17. This comment has been removed by the author.

    ReplyDelete
  18. అదిరిందమ్మా! మీను!!

    .శివ స్పీక్స్

    ReplyDelete
  19. మా ఇంటి కప్పు అదిరేలా నవ్వాను. పుచ్చకాయ పురాణం సూపరో సూపరు.

    ReplyDelete
  20. @ మీను

    నవ్వులే నవ్వులు... ఈ రాత్రికి నేను నిద్రపోనేమో... ఇక నుండీ నేను దిసైడ్ అయిపోయాను... పడుకునే ముందు నీ టపాలు చదవకూడదని... :-)
    త్వరగా పూర్ణిమ చెప్పినట్టు చేయించుకో...

    ReplyDelete
  21. baga rasaru,kadhu cheparu.very funny...

    ReplyDelete
  22. హహ... మంచి హాస్యం పండించారు.
    మొత్తానికి ఒక బకరా (ఊప్స్...) మీకు తగిలాడన్నమాట.

    చూద్దాం ముందు ముందు ఏమవుతుందో.

    ReplyDelete
  23. మొదట విహారి గారి కామెంట్ అదుర్స్ ...కాదేది కవితకు అనర్హం అనట్టు కదేది మీనాక్షి కి అనర్హమ్ చివరకు పుచ్చకాయ ఏంటి పుచ్చాకాయ మీద కూడా రాసి బా నవ్వు తెప్పించావ్

    ReplyDelete
  24. మీనూ,
    నిజ౦గానే చలాకీ చేపపిల్లవి నువ్వు.చేపపిల్ల మొప్పల్తో స౦ద్రాన్ని ఈదుతు౦టే నువ్వు టపాలతో బ్లాగు స౦ద్రాన్ని ఈదేస్తున్నావ్.అ౦దర్నీ నీ వైపుకి లాగేస్తున్నావ్.
    లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తున్నావు.హాస్పిటల్లో కూడా మీ బుచ్చి బావ పాటలు పాడాడు కానీ నిన్నుచూసి ఒక్కసారి ఈ టపా చూపి౦చు ఇ౦క మళ్ళీ కనపడడు పుచ్చకాయ గొడవా ఉ౦డదు.ఏమ౦టావ్?సరేనా?హ హ హ

    ReplyDelete
  25. Puchakayaa pachadi ane title choosi...modata puchakayatho pachadi kooda chesthaaraa anukoni...sarale manmu vantalu thelusukoni...buddi leka chesi jeevithalanu nasanam cheyadam anukoni tapani vadili vellipothoo vundaga malli endukoo inko choopu choosthe ii pucha kaaya taste different ani artham ayyindi.... Pucha kaaya pachadi adiripoyindi...

    ReplyDelete
  26. This comment has been removed by the author.

    ReplyDelete
  27. అమ్మ మీను..
    చెరువులో చేపపిల్ల ఈదినట్లు బ్లాగుచెరువులో తెగ సందడి చేస్తూ ఈదేస్తున్నావ్..!!!
    దానికి తగ్గట్లు పేరుకూడా అదే కదా?
    gud style of narration. మరి నీ సినిమాలో నాకో role ఇస్తావా?

    ReplyDelete
  28. @ నిషిగంధ గారు...
    ప్రతి ఉదయం మీరు ఇలాగే నవ్వుతూ ప్రారంభించాలని కోరుకుంటున్నాను.
    నా పోస్ట్ నచ్చినందుకు...సంతోషం...మరియూ..నెనర్లు..

    @ రాజేంద్ర గారు...నెనర్లు....అవును .

    @ పూర్ణిమ గారు...నెనర్లు...దిష్టి తేయించుకుంటా..గాని..మీకో పుచ్చకాయ పంపించనా...?పచ్చడి చేసుకోడానికి..హ హ హ .

    @ వేణు గారు...థ్యాంక్స్...మీరు చెప్పినట్టె చేస్తా....
    అన్నట్టు మీకు ఏమైనా రోల్ కావలంటే చెప్పండి ఇస్తాను..
    టికెట్ మాత్రం మన వాళ్ళందరికి ఫ్రీ..అవునూ..పుచ్చకాయ పచ్చడి ట్రై చేసారా..?

    @ ప్రతాప్ గారు..థ్యాంక్యూ సో మచ్.....మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాని కోరకుంటున్న...
    అయ్యో పాపం...నాకు కాదా...బుచ్చిబావకా...:):)

    @ కొత్తపాళి గారు నెనర్లు...అయ్యో..గురువు గారు..తెలుగులో రాయమని అంత మంచి విషయం చెప్పాక రాయాకుండా ఎలా ఉంటాను...

    @ చైతు గారు..ముందుగా మీకు థ్యాంక్స్....
    వ్యాఖ్యలు నచ్చినందుకు సంతోషం...అయ్యో చెప్పడం మరిచా..బుచ్చిబావకి పాటలు పాడ్డం ఇష్టం..సిచువేషన్ కి తగ్గట్టు..

    @ సిరిసిరిమువ్వ గారు...నెనర్లు...అలా జరిగితే మీకే ముందుగా ఒక పుచ్చకాయ పంపిస్తాను...పుతేర..అంటే కొడుకు..పుతేరి..అంటే కూతురు..ఏదో బుక్ లో చదివాను..ఈ పదం మన తెలుగులోనిది కాదు..

    @ రాధిక గారు...నెనర్లు....మొత్తానికి మిమ్మల్ని నవ్వించానన్నమాట..
    సంతొషం...

    @ జ్యోతి గారు నెనర్లు...అయ్యో ఇలా గోల చేయకుంటే ఏం బాగుంటుంది చెప్పండి...అమ్మో మీరు నా పెళ్ళికి కూడా పుచ్చకాయ గిఫ్ట్ గా ఇస్తారా..

    @ వేణూ గారు ఇంకా ఈ ప్రశ్న ఎవరూ అడగలేదేంటబ్బా..అనుకున్నా..
    మీరు అడిగేసారు...అన్నట్టు మా బుచ్చిబావ వాళ్ళకి పుచ్చకయల తోట ఉందండి..మీకు కావాలా పుచ్చకాయలు చెప్పండి పంపిస్తాను..హ హ హ హ...

    @ కత్తి గారు..నెనర్లు...అయ్యో గురుదేవా..అడగడం మరిచా..మీకు సినిమా తీయాలని ఒక కోరిక ఉందని ఎప్పుడో చెప్పినట్టు గుర్తు..
    మీరు నాకు ఈ సినిమా తీయడంలో హెల్ప్ చేయకూడదా..సూపర్ హిట్ అవుతుంది సినిమా...ఏమంటారు..?

    @ విహారి గారు..మీరు ఇలా టపాలు అదరగొట్టి,కామెంట్లు కూడా అదరగొట్టేస్తున్నారు...చూసారా..మీ కామెంట్ కూడా అదుర్స్..
    అన్నట్టు..చిత్ర గుప్తుడు మీకెప్పుడు కలిసారో..కాస్త చెప్పండి..ఒక వేళ ఇది నిజమైనా నేను భయపడను...ఎందుకంటె చిత్రగుప్తుడిని ఎలా బుట్టలో వేయాలో నాకు తెలుసోచ్..హిహిహిహి..

    @ ప్రఫుల్ల గారు ..నెనర్లు..:))))))ఆప్ భీ మరీ హై..
    అయ్యో ఇంతమంచి సినిమా తేయాలంటే కనీసం సంవత్సరం పడుతుందండి..అప్పటి వరకు మీరు వేయిట్ కరాలి హై...

    @ నిరంజన్ గారు..థ్యాంక్స్...అండి..థ్యాంక్యూ సో మచ్..:):):)

    @ శివ గారు నెనర్లు..నెనర్లు.నెనర్లు..

    @ విద్యగారు...నెనర్లు....అన్నట్టు పుచ్చకాయ పచ్చడి ట్రై చేసారా..

    ReplyDelete
  29. @ దీపు అన్నయ్య నెనర్లు....:):):):):):)
    మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి...ఎప్పుడు..

    @ లలిత గారు నెనర్లు...రాసినందుకు కాదు..చెప్పినందుకు..:):):)

    @ ప్రవీణ్ గారు..అయ్యో తను బకరా కాదండి..మా బావా..!
    అన్నట్టు సినిమా చూడ్డం మరవకండి..:)))))))))

    @ అశ్విన్ గారు..థ్యాంక్స్....మీ మిద కూడా రాయనా...ఒక టపా..

    @ క్రాంతి..కవి మహాషయా...ఇలా కామెంట్లు కూడా కవి భాషలో రాసి
    కవి అని నిరూపించుకున్నారు..నెనర్లు...

    @ వంశి గారు....నెనర్లు..అయ్యో నిజంగానే పుచ్చకాయ పచ్చడి చేస్తారండి...మీకు ఈ టేస్ట్ నచ్చినట్టే అదీ నచ్చుతుందేమో..
    ఎందుకైనా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి..

    @ బాబా గారు..నెనర్లు...మీ ప్రోత్సాహానికి..

    @ రాజ్ గారు..థ్యాంక్స్ అండి...:))))))))))))))))))))

    @ కల గారు ముందుగా..మీకు నెనర్లు...
    క్రాంతిగారు చేప పిల్ల అని ఎందుకన్నారో మీ కామెంట్ చూసాక అర్దమైంది...అవును మరి నా పేరు కూడా అదే కదా..!!!
    అయ్యో ఎంత మాట ..తప్పకుండా మీకు రోల్ ఇస్తాను..
    మీరు అడిగాక కాదంటానా.....:)))

    ReplyDelete
  30. ఇంతకి ఇది కథా నిజమా? ఏదైనా టపా చాలా బాగా రాసారు. కంగ్రాట్స్ (కాలేజీ ఫస్ట్ వచ్చినందుకు)

    ReplyDelete
  31. @ నాగరాజా గారు థ్యాంక్స్...ఇది కథ కాదు..హ హ హ హ..
    ఇది నిజం కూడా కాదు..థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్..

    ReplyDelete
  32. వహ్వా
    చాల బాగుంది, ఇంతకీ సినిమా రిలీజ్ ఎప్పుడు?

    -కిరణ్

    ReplyDelete
  33. కిరణ్ గారు..థ్యాంక్స్...
    ఏమోనండి..చెప్పలేం....పరిస్థితులు ఎలా ఉంటాయో..
    ఇంత మంచి సినిమా తీయాలంటే మాటలా..మీకు చెప్తాలెండి..రీలీజ్ అప్పుడు..:)))))

    ReplyDelete
  34. మీనూ.. చిత్తగొట్టెశావ్ .. మాళ్ళా వస్తా అని వెళ్ళిన తర్వాత ఇదే నేను రావటం ఇక్కడికి. ఆ దిష్టి సంగతి నాకు తెలీదు. ఎవరో శ్రీ ప్రియా అని సైన్ చేసారు చూడు. అది నేను కాదు.

    ఇన్ని కమ్మెంట్స్ వచ్చినప్పుడు కష్టమే అనుకో.. అయినా గమనించమని సూచన. నా పేరూ మార్చుకోవాలి ఏమో!!

    పూర్ణిమ (ఊహలన్నీ ఊసులై)

    ReplyDelete
  35. అవునా..పూర్ణిమ గారు...మీరే అనుకున్నా...
    అయ్యో ఐతే ఆ పూర్ణిమ గారు వేరే అన్నమాట...

    ReplyDelete
  36. చాలా బాగుంది మీనాక్షి గారు మీ పుచ్చకాయ పురాణ ప్రహసనం, నవ్వించడంలో బ్లాగులోకాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్నారు.

    ReplyDelete
  37. @ రమణి గారు...నెనర్లు...చాలా రోజుల తరవాత కనిపించారు..

    ReplyDelete
  38. 5 క్లాసులో సిగ్గు కధ గురించి పిచ్చ వెయిటింగండి. త్వరగ రాసెయ్యండి.

    ReplyDelete
  39. hi meenakshi...
    ఈ రోజే మీ బ్లాగ్ చూసా. చాలా బాగుంది.
    నాకు రైలు బడి పుస్తకం బాగా నచ్చిన పుస్తంకం.
    చాలా ఇష్టంగా కొన్నది. కానీ... ఒక అది miss అయ్యంది. i still feel bad about it.
    మళ్లి, ఇన్నాళకి మీ profile లో ఆ పేరు చూసే సరికి చాలా సంతోషంగా ఉంది.
    మీ రాతలు బాగున్నాయ్. congrats.

    ReplyDelete
  40. Too good. I thoroughly enhoyed :)
    Keep posting..

    ReplyDelete
  41. @ హాయ్ మురలి గారు...నెనర్లు..
    త్వరలోనె రాస్తాను...ఆ సిగ్గు కథ..:)


    @ హాయ్ సుజన గారు..థ్యాంక్స్...నా బ్లాగ్ మికు నచ్చినందుకు సంతొషం.:)
    అవును ఆ బుక్ అంటే నాకు కూడా చాలా ఇష్టం..


    @ మోహనా...నెనర్లు..:)

    ReplyDelete
  42. బాంచన్.. late గ ఒచ్చినా గని latest గ చెప్తున్న - ఖతర్నాక్ రాశ్నరు! లొల్లి లొల్లి!! నవ్వి నవ్వి భౌరన్ భౌరన్ అయిన.. espeshally ఇది - "పిట్టలన్నీ ఆయనకి...రెట్టలతో స్వాగతం పలికాయి" హి హి హి హి

    దిల్-ఖుష్ అయిందనుకొరాదుల్ల!

    "ఈ వార్త విని...నాకు,బబ్బీకి నెత్తిపైన "పుచ్చకాయ" పడ్డట్టైంది...." - ఇక్కడ పుచ్చకాయ reference - ఏక్ దం అవ్వల్! కథల ఉన్న main ingredient ని కథనం/screenplay లకి తీస్కోచ్చిన తీరు, yamagazing I say!

    ఇటు దిక్కొచ్చుడు ఇదే ఫస్తు, ఇగ ఒస్తనే ఉంట.. ఇంగిల్పీస్ ల అంటరు సూడుర్రి - బండల్ ఏస్తనే పొండ్రి!

    ReplyDelete
  43. వార్ని.. గూగులోడు నా కొంప ఉస్మాన్ సాగర్ చేసిండు (గమనించాలె, హుస్సేన్ సాగర్ కాదు - వాక్! కంపు!!) ఏం జేస్తం, ఖండిస్తం

    ReplyDelete
  44. మీనాక్షి మీ టపా కేక. చాల నవ్వించారు.

    ReplyDelete
  45. మీనాక్షి గారూ,

    చాలా బాగుంది.పుచ్చకాయతోనే కథ అదరుగొట్టేశారు.కడుపుబ్బా నవ్వాను. ఈరోజే మీబ్లాగ్ చూశాను. చాలా బాగా రాస్తున్నారు.

    ReplyDelete
  46. mee blog ki late ga vachina latest ga navvi navvi veltunna... adarahoooooo mee rachana

    ReplyDelete
  47. meenakshi.nee latest post kanipinchatamledu aenti? o buthama..rammu!!????
    what happend?

    ReplyDelete
  48. మీనాక్షి గారు, మీ టపా అదిరిందండీ!
    వాషింగ్ పౌడర్ నిర్మా..శంకర్ దయాల్ షర్మా"......
    ఇంటికి వెళ్ళాక అమ్మ ...సినిమా ఎలా ఉందిరా బబ్బీ....అని అడిగితే "పుచ్చకాయ" లా ఉంది అని చెప్పాడు బబ్బీగాడు..
    బాగున్నాయి

    ReplyDelete
  49. మీ బుచ్చి బావ ప్రేమలో పుచ్చరసం అంత చల్లదనం ఉంది. ఈ జన్మకి ఇలా కానిచ్చేయండి. అప్పుడే మాకు మనసారా నవ్వుకోనే టపాలు రాస్తారు మీరు. ఇంతకీ మిస్టెర్ బుచ్చికి బట్టతలా? ఇప్పాట్‌కీ బాక్కెట్లో2 రాళ్లు వెస్ఎసాను. 3 రాయి అదే 5తరగతి విషయం ఏమిటి?

    ReplyDelete