ఒక రోజు నేను,మా ఫ్రెండ్ కాలేజ్ అవ్వగానే ఇంటికి బయలుదేరాము.నాకంటు ప్రత్యేకంగా సొంత వాహనం ఏమి లేదు. కాబట్టి 4 చక్రాల వాహనం లో ఇంటికి వెల్లాలి అంటే బస్సులో.నాకెందుకో ఈ బస్సు ప్రయానమంటే భలేగా అనిపిస్తుంది. కొన్ని సార్లు చిరాగ్గా అనిపిస్తుంది.మా కాలేజె నండి బస్ స్టాప్ కి చాలా దూరం నడవాలి. పాపం ఎండకి నేనంటే ప్రానం.ఉన్న ఎండనంతా నా పైనే కురిపిస్తుంది. ఎందుకో దానికి నా పైన అంత ప్రేమ. నేను,మా ఫ్రెంద్ ఎదేదో మాట్లాడుకుంటూ బస్ స్టాప్ కి చేరాము. అంతలో నేనొచేస్తున్నానొచ్ అంటూ ,కొత్తపెల్లికూతురిల ముస్తాబై వచేసింది బస్. నేను ,మా ఫ్రెంద్ చక చక బస్ ఎక్కేసాము,సీటు కొట్టేసాము. ఏవేవో సుత్తి కబుర్లు చెప్పుకుంటుంటే నా కల్లు ముందరి సీటు పై పడ్డాయి.
దాని పై 3 వాక్యాలు ఇలా రాసి ఉన్నాయి.
1.ఇది చదివే వాడు గాడిద.
దాన్ని మా ఫ్రెంద్ కి చూపించాను,ఇద్దరం కలిసి రాసిన వాన్ని తిట్టుకున్నాము.రెండవ వాక్యం ఇలా ఉంది.
2.ఇది రాసిన వాడు అడ్డగాడిద.
ఎవడో కాని భలేగా రాసాడే అనుకున్నాము. మూడవ వాక్యం చదివాక తెలిసింది వాడు సామాన్యుడు కాడని.
3.ఇది చదవని వాడు కంచర గాడిద.
అన్నీ చదివాక కంచర గాడిద కన్నా గాడిదే నయం కదా అనుకున్నాము.
మరి మీరేమంటారు.????...............